జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి లక్నో వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సోమవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం రద్దు కావటంతో విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లక్నో వెళ్లాల్సిన సుమారు 80మంది ప్రయాణికులను వేరే విమానం ద్వారా లక్నోకు తరలించారు.