JetBlue airlines
-
వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా
విమానంలో వేడి టీ సర్వ్ చేస్తున్నపుడు కుదుపులకు గురవడంతో ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో సదరు విమాన సంస్థపై ప్యాసింజర్ ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు (రూ.12.5 కోట్లు) దావా వేశారు.ప్రయాణికురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం..తహజానా లూయిస్ అనే మహిళా ప్యాసింజర్ తన కుటుంబంతో మే 15న ఓర్లాండో నుంచి కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌కు ‘జెట్‌బ్లూ ఫ్లైట్ 2237’ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి సీట్‌బెల్ట్ పెట్టుకోవాలనే సిగ్నల్ వచ్చింది. అదేమీ పట్టించుకోకుండా విమాన సిబ్బంది వేడి టీ సర్వ్ చేయడానికి సిద్ధం అయ్యారు. కానీ అప్పటికే సీట్‌బెల్ట్ వార్నింగ్ రావడంతో విమానం కుదుపులకు గురైంది. దాంతో వేడి టీ ప్రయాణికురాలి శరీరంపై పడి ఛాతీ, కాళ్లు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో కనీసం విమాన సిబ్బంది ప్రథమ చికిత్స కూడా చేయలేదు.ప్రయాణికురాలు గాయాల నుంచి కోలుకున్నాక ఇటీవల విమాన ఘటనపై కోర్టును ఆశ్రయించారు. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఈమేరకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంస్థ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర గాయాలపాలయ్యానని తెలియజేస్తూ 1.5 మిలియన్ డాలర్లు(రూ.12.5 కోట్లు) దావా వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం విమానంలో సీట్‌బెల్ట్ సిగ్నల్ వచ్చినపుడు వేడి పానీయాలు, భోజన సేవలను నిలిపేయాలి.ఇదీ చదవండి: జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టుఇదిలాఉండగా, మే నెలలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దాంతో ఒక ప్యాసింజర్ గుండెపోటుతో మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.. అందుకే..
వాషింగ్టన్ : న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే జెట్బ్లూఎయిర్లైన్స్కు చెందిన ఇద్దరు పైలట్లపై.. అదే సంస్థకు చెందిన ఉద్యోగినులు అత్యాచార ఆరోపణలు చేశారు. విధులు ముగించుకుని సేద తీరే క్రమంలో డ్రగ్స్ ఇచ్చి తమపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మేలో జరిగిన ఈ ఘటన కారణంగా తమ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, ప్రాణాంతక వ్యాధులు బారిన పడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు... గతేడాది మే 9న వాషింగ్టన్ నుంచి ప్యూర్టోరికోకు చేరిన తర్వాత తమకు బుక్ చేసిన హోటల్లో సదరు ఉద్యోగినులు బస చేశారు. అదే రోజు సాయంత్రం సరదాగా బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వాళ్లను పైలట్లు ఎరిక్ జాన్సన్, డాన్ వాట్సన్ అనుసరించారు. అనంతరం మాటలు కలిపి డ్రగ్స్ కలిపిన శీతల పానీయాలను వారికి ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం గురించి జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఈ విషయం గురించి వారి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ ఘటన జరిగి ఏడాది కావొస్తున్నా వాట్సన్, జాన్సన్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ నా క్లైంట్ ఎంతో ధైర్యవంతురాలు. అందుకే కోర్టును ఆశ్రయించాం. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలని భావిస్తున్నాం. ఈ ఘటన వల్ల తనెంతో మానసిక వేదన అనుభవించింది. మేము చేసే అలుపెరగని ఈ పోరాటం.. మరెంతో మంది బాధితులు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ఆదర్శంగా నిలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరగణిస్తున్నామని, తమ ఉద్యోగుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని జెట్‌బ్లూ వివరణ ఇచ్చింది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకునే దిశగా చర్యలు ముమ్మరం చేస్తామని తెలిపింది. -
డాన్సర్ దుస్తులపై వివాదం
బోస్టన్: డాన్సర్ మ్యాగీ మెక్ మఫ్ఫీన్ కు నెటిజన్లు అండగా నిలిచారు. మసాచుసెట్స్ లోని లోగాన్ ఎయిర్ పోర్టులో ఆమెకు జరిగిన అవమానంపై సోషల్ మీడియాలో గళమెత్తారు. కురచ దుస్తులు వేసుకుందన్న కారణంగా జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ ఆమెను విమానంలోని ఎక్కనీయయలేదు. అప్పటికప్పుడు పొడుగు దుస్తులు కొనుక్కుని వేసుకోవడంతో ఆమెను విమానంలోకి అనుమతించారు. మఫ్ఫీన్ పట్ల జెట్ బ్లూ ఎయిర్‌లైన్స్ సిబ్బంది వివక్ష పూరితంగా వ్యవహరించారని నెటిజన్లు ఆరోపించారు. బూటీ సాలిడారిటీ, బూటీ షార్ట్ సపోర్ట్ హాష్ ట్యాగ్స్‌తో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఇది డ్రెస్ కోడ్ వివక్ష అని ఎద్దేవా చేశారు. మనిషి మనిషికి డ్రెస్ కోడ్ పెడతారా అని ప్రశ్నించారు. తాను ఒంటినిండా దుస్తులు వేసుకున్నానని, నియమాలు ఉల్లంఘించలేదని మఫ్ఫీన్ తెలిపింది. అయితే ప్రయాణికుల దుస్తులు అభ్యంతకరంగా ఉంటే అనుమతించబోమని జెట్ బ్లూ అధికార ప్రతినిధి అన్నారు. చివరకు మఫ్ఫీన్ కు జెట్ బ్లూ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా ఆమెకు 162 డాలర్ల ఫ్లైట్ క్రెడిట్ ఆఫర్ చేసింది. డ్రెస్ కోడ్ పై జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ స్పష్టత ఇవ్వాలని మప్ఫీన్ డిమాండ్ చేసింది. -
దుస్తులు సరిగా లేవని ప్రయాణికురాలిని...
బోస్టన్: విమానం ఎక్కడానికి వచ్చిన ప్రయాణికురాలికి ఎయిర్ లైన్స్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె దుస్తులు సరిగా లేవన్న కారణంగా విమానంలో కాలు పెట్టేందుకు అభ్యంతరం చెప్పారు. మసాచుసెట్స్ లోని లోగాన్ ఎయిర్ పోర్టులో కొన్ని రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాగీ మెక్ మఫ్ఫీన్ లోగాన్ లో జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించి బోస్టన్ చేరుకుని, అక్కడ కనెక్టింగ్ ఫ్లయిట్ అందుకుని న్యూయార్క్ కు వెళ్లాల్సి ఉంది. ఆమె ఓ స్వెట్టర్, చిన్న షార్ట్ వేసుకుందని, పొడవాటి సాక్సు ధరించి ఉందని జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. సీటెల్ కు చెందిన మాగీ మరీ పొట్టి దుస్తులు వేసుకుని వచ్చిందని, ఆమెను దుస్తులు మార్చుకోవాల్సిందిగా సూచించారు. లేనిపక్షంలో విమానం ఎక్కేందుకు ఆమెను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక మాగీ.. వేరే టర్మినల్ కు వెళ్లి 22 డాలర్లు ఖర్చుపెట్టి కొత్త షార్ట్స్ కొనుక్కుంది. ఆ తర్వాత హాయిగా ప్రయాణించి బోస్టన్ చేరుకుంది. రూల్స్ లో ఈ విషయాలు లేకున్నా తనను అడ్డుకున్నారని మాగీ చెప్పింది. ఎగతాళి చేసేలా లోగోలు, ఫొటోలు ఉన్న దుస్తులు ధరిస్తే ఎయిర్ లైన్స్ నియమాలకు విరుద్ధమని అధికారులు వెల్లడించారు. తనను విమానం ఎక్కకుండా గేట్ వద్దే నిలిపివేసినందుకు సిబ్బంది క్షమాపణలు చెప్పిందని బాధిత ప్రయాణికురాలు స్థానిక మీడియాకు వెల్లడించింది.