jio feature phone
-
దీంతో రిలయన్స్ కిట్టీకి బంపర్ బొనాంజానే
ముంబై : రిలయన్స్ జియో మూడు రోజుల కిందటే అత్యంత చౌకైన 4జీ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. సంచలనాలు సృష్టిస్తూ వస్తున్న ఈ ఫోన్‌తో రిలయన్స్ కిట్టీలోకి భారీగా కస్టమర్లు వచ్చి చేరనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు మరో 10 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు యాడ్ కానున్నారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అంతేకాక రిలయన్స్ జియో మార్కెట్ షేరు కూడా 2018 నాటికి మరో 10 శాతం మేర పెరుగనుందని పేర్కొన్నాయి. పడిపోతున్న ఇండస్ట్రి రెవెన్యూ ట్రెండ్‌ను ఇది తిరిగి పుంజుకునేలా చేస్తుందని తెలిపాయి. ''సెప్టెంబర్ నుంచి రిలయన్స్ జియో ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్‌తో ఇంటర్నెట్ వాడకం పైకి ఎగుస్తోంది. రెవెన్యూ విషయంలో టెల్కోలు ఇటీవల ఎదుర్కొంటున్న ట్రెండ్‌ను ఇది రివర్స్ చేస్తోంది'' అని ఫిచ్ సోమవారం పేర్కొంది. ఒకవేళ కనీసం 100 మిలియన్ సబ్స్క్రైబర్లు జియోఫోన్‌కు వచ్చి చేరితే, ఈ చౌక హ్యాండ్‌సెట్‌తో వార్షిక ఇండస్ట్రీ రెవెన్యూలు అదనంగా 3-4 శాతం పెరుగుతాయని తెలిపింది. గతవారంలో నిర్వహించిన షేర్‌హోల్డర్స్ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఫోన్ ప్రవేశపెట్టారు. జీరోకే జియో ఫోన్ అందించనున్నట్టు తెలిపారు. అయితే తొలుత కస్టమర్లు రూ.1500 కట్టి ఈ ఫోన్‌ను కొనుక్కోవాలి, అనంతరం వీటిని కంపెనీ మూడేళ్ల తర్వాత రీఫండ్‌చేయనుంది. ఈ స్కీమ్ మొదటిసారి 4జీని వాడే యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుందని, రెవెన్యూ మార్కెట్ షేరును పొందడంతో జియోకు ఎంతో సాయపడుతుందని ఫిచ్ నివేదించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 2జీ హ్యాండ్సెట్లను ఇది చాలా త్వరగా రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. జియో ఒకవేళ మరిన్ని ఆఫర్లను ప్రకటిస్తే, వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ తిరుగులేని సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంటుందని ఫిచ్ చెప్పింది. ఇతర కంపెనీలు కూడా ధరలు తగ్గింపు, డిస్కౌంట్లు, ప్రమోషన్లు చేపడతారని ఫిచ్ తెలిపింది. ఎక్కువ ధరలతో ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం తక్కువగా ఉంది. దీంతో ఏడాది ఏడాదికి ఇండస్ట్రీ రెవెన్యూలు 15.6 శాతం పడిపోతున్నాయని ఫిచ్ తన నివేదికలో వెల్లడించింది. -
రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న రిలయన్స్
ముంబై : ఫ్లాట్‌గా ట్రేడవుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మరలాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో షేర్లు మద్దతుతో సెన్సెక్స్ 119.15 పాయింట్లు లాభాల్లోకి ఎగిసి 32,023 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్ల లాభంతో 9,904 వద్ద ట్రేడవుతున్నాయి. నేటి సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. గురువారం మార్కెట్ అవర్స్ తర్వాత ప్రకటించిన అదరగొట్టే లాభాలు, నేటి ఏజీఎంలో ఫీచర్ ఫోన్ వివరాలు ఈ కంపెనీ షేర్లకు బూస్ట్ ఇచ్చాయి. 3.9 శాతం మేర పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు, తొమ్మిదన్నర ఏళ్ల గరిష్టంలో రూ.1,588 వద్ద నమోదవుతున్నాయి. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ను లాంచ్‌చేసిన ముఖేష్ అంబానీ, ఈ డివైజ్‌తో 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగాదారులకు డేటా సేవలను మరింత దగ్గర చేయనున్నామని చెప్పారు. అంతేకాక తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులను జియో సర్వీసుల్లోకి మారేలా ఈ ఫీచర్ ఫోన్ దోహదం చేస్తుందని తెలిపారు. ఆయిల్ నుంచి టెలికాం వరకు మార్కెట్లో తన హవా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లోనూ విశ్లేషకుల అంచనాలను మించింది. రూ.9,108 కోట్ల రికార్డుస్థాయి కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది. ఇవన్నీ నేటి మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకుపోవడానికి సహకరిస్తున్నాయి. 2008 జనవరి తర్వాత ఇవే అత్యధిక గరిష్టస్థాయిలు. మరోవైపు టెలికాం దిగ్గజాలు జియో ఫీచర్ ఎఫెక్ట్‌కు భారీగా కుప్పకూలాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్‌లు 4.1 శాతం, 7.3 శాతం కిందకి పడిపోయాయి. -
జియో ఫీచర్ ఫోన్ ఉచితం: అంబానీ
ముంబై: వార్షిక సాధారణ సమావేశంలో ఆవిష్కరించిన జియో ఫీచర్ ఫోన్‌ను భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. అయితే వారు జియో ఖాతాదారులయి ఉండాలని చెప్పారు. ఫీచర్ ఫోన్ తీసుకునే వారు సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నగదును మూడేళ్ల అనంతరం (36 నెలల తర్వాత) కస్టమర్లకు రిఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబానీ ప్రకటించారు. ఆగస్ట్ 24 నుంచి ఈ ఫీచర్ ఫోన్లు బుకింగ్స్ చేసుకోవచ్చునని చెప్పారు. అయితే సెప్టెంబర్ 1నుంచి జియో ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ జియో ఫోన్ వినియోగదారులకు వాయిల్ కాల్స్ పూర్తిగా ఉచితం. డేటా ప్యాక్ రూ.153కే నెల రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా అందుబాటులోకి రానుంది. నెలకు రూ.309తో జియో టీవీ సౌకర్యం కల్పించామని, జియో ఫోన్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉందని వివరించారు. ఎమర్జెన్సీలో లొకేషన్ షేర్ చేసే ఆప్షన్ ఉండటం విశేషం.