J&K
-
రైతాంగం కోసం రూ.879 కోట్ల భారీ ప్రాజెక్టు
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. రూ.879.75 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆవిష్కరించింది. నిర్థేశిత ఉత్పత్తులకు క్లస్టర్లను అభివద్ధి చేసి అన్నదాతల ఆదాయాభివృద్ధి, పంట చేతికి వచ్చిన తర్వాత ఎదుర్కొనే నష్టాల నివారణే లక్ష్యంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ చేపట్టినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే ఐదేళ్లలో గుర్తించిన ఐదు ఉత్పత్తుల ధర, నాణ్యత, బ్రాండింగ్, స్థిరత్వాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా, వాల్యూ అడిషన్లలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 17 జిల్లాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల అభివృద్ధి ప్రాజెక్టు ప్రోగ్రామ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఆయా జిల్లాల్లో మార్కెటింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్టేక్ హోల్డర్ల అభివృద్ధి, అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాం కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బడ్టెట్ లో రూ.879.75 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల 7,030 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రతియేటా రూ.1,436.04 కోట్ల ఆదాయం లభించే 34 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మాజీ డీజీ మంగల్ రాయ్ నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది.పంట అనంతర నష్టాలు, సవాళ్లను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుందని అంటున్నారు అడిషనల్ చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లోహ్. -
జమ్మూ లో కర్ఫూ ఎత్తివేత
శ్రీనగర్: రెండు వారాల ఘర్షణల అనంతరం జమ్ము కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫూని ఎత్తివేశారు. శ్రీనగర్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు నాలుగు జిల్లాల్లో నిషేధాజ్ఞలను ఎత్తివేశారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని జిల్లాల్లో కర్ఫూ అమల్లో ఉంది. పరిస్థితి కొంచెం మెరుగు పడిందని భావించిన ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. బందిపొరా, బారాముల్లా, బద్గమ్, గందర్బల్ జిల్లాలతో పాటు శ్రీనగర్ లోని కొన్నిప్రాంతాల్లో కర్ఫూని ఎత్తివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ఫూ ఎత్తివేసినా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పౌరులు గుంపులుగా సంచరించడానికి వీళ్లేదని అధికారులు తెలిపారు. కర్ఫ్యూ లోయలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో, అనంతనాగ్ , కుల్గామ్ , కుప్వారా , పుల్వామా మరియు షోపియాం జిల్లాల్లో అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జులై 9 న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ వానీ ని భద్రతాదళాలు హతమార్చిన నాటి నుంచి ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో 45 మంది మృతి చెందారు.3,400 మంది గాయపడ్డారు. రాజ్ నాథ్ కశ్మీర్ పర్యటన: రెండురోజులు పర్యటన నిమిత్త రాజ్ నాథ్ ఈరోజు ఉదయం శ్రీనగర్ చేరుకున్నారు. ఈ రోజు ప్రభుత్వ అధికారులు, సామాజిక సంఘాలు, పలు రాజకీయపక్షాలతో సమావేశమవనున్నారు. రేపు కూడా రాజ్ నాథ్ పలువురితో చర్చలు జరుపనున్నారు. -
ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మరో సారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది. భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారుల తెలిపిన సమాచారం ప్రకారం.. దక్షిణ కశ్మీర్లోని పల్వామా జిల్లా నెవా ఏరియాలోని ఒక ఇంటిలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆర్మీ సిబ్బంధి వారిని లొంగిపొమ్మని ఆదేశించారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో కాల్పులకు దిగినట్టు ఇందులో ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్టు తెలిపారు. -
ఇంటర్నెట్ సేవలు మళ్లీ బంద్
► విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కానిస్టేబుల్ ప్రయత్నం ► జమ్ములో తీవ్ర ఉద్రిక్తత.. నిందితుడి అరెస్టు జమ్మూలో పురాతన శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనతో చెలరేగిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చల్లబడక ముందే మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఓ సస్సెండ్ అయిన జమ్మూకాశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్... స్థానిక ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నానక్ నగర్ లోని శివాలయ ధ్వంసానికి ఓ వ్యక్తి ప్రయత్నించడం మరోసారి అలజడి రేగింది. దీంతో మూడు రోజులుగా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. జమ్మూలో గురువారం జరిగిన పురాతన శివాలయ ధ్వంసం ఘటన మరువక ముందే మరో అలజడి రేగింది. సస్పెండెడ్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ నానక్ నగర్ లోని ఆలయంలోకి వెళ్ళి అక్కడి శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయధ్వంసం ఘటన తెలియడంతో స్థానికులు నిరసనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. అంతకు ముందు రూప్ నగర్ లో జరిగిన ఆలయ ధ్వంసానికి, తాజా ఘటనకు ఏదైనా సంబంధం ఉందా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే రెండు రోజులుగా ఆందోళనలతో ఉన్న జమ్మూలో నేడు కొంత ప్రశాంత వాతావరణం కనిపించింది. వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ కూడా ఎప్పట్లాగే కనిపించింది. అయితే స్థానికంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు మాత్రం కొనసాగడం లేదు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు స్తంభించిపోయాయి. దక్షిణ కాశ్మీర్ లో అమరనాథ్ యాత్ర సందర్భంలోనే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రణాళికా బద్ధంగా దేవాలయాలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అయితే నిందితుడు నానక్ నగర్ ఆలయధ్వంసానికి పాల్పడే ముందు సెల్ ఫోన్ లో ఇతరులతో విషయాన్ని వివరించినట్లు జమ్ము డివిజినల్ కమిషనర్ పవన్ కొత్వాల్ తెలిపారు. నానక్ నగర్ ఆలయంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ అలియాస్ మింటా గా గుర్తించామని, అతడు ఘటనకు ముందు మాట్లాడిన సెల్ ఫోన్ సంభాషణను బట్టి అతడ్ని ఆదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఫోన్ లో అవతలి వ్యక్తితో సింగ్... చెప్పిన పని పూర్తయిందని, తన ఖాతాలో డబ్బు జమచేయమని చెప్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం సింగ్ ను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జమ్ము డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సిమరన్ దీప్ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన ప్రభుత్వం జమ్మూలో మాత్రం మూడోరోజూ నిలిపివేతను కొనసాగిస్తోంది. అంతకుముందు జరిగిన నిరసన ప్రదర్శనలలో వేర్పాటువాదులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ఎగరేశారు. -
పోలీస్ స్టేషన్లో మహిళపై రేప్
శ్రీనగర్: రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారిపై ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జమ్మూ,కశ్మీర్ లోని చోటుచేసుకుంది. అఖ్ నూర్ సబ్ డివిజన్ లోని కౌర్ పోలీసు స్టేషన్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఇందుకు సాటి మహిళా పోలీసు సహకరించడం మరో దారుణం. అత్యాచారం జరిగిందని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలికి ఈ చేదు అనుభవం ఎదురైంది. తమ కూతురును 15 రోజుల క్రితం నిరేప్ చేసి ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వారం క్రితం ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ కుతరలించారు. -
పీడీపీ - బీజేపీ సంకీర్ణానికి ఇబ్బందులు
-
పీడీపీ- బీజేపీ డీల్ ఓకే
జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు పీడీపీ- బీజేపీ మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి ఒకటిన పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం 87 స్థానాలున్న కశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ 28, బీజేపీ 25 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నాయి. తొలిసారిగా కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం కానుంది. కాగా బీజేపీ-పీడీపీ చెరో ఆరు మంత్రి పదవులు తీసుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీ దక్కించుకోనుంది. మరోవైపు లాంఛనాలు ముగిసిన తరువాత పీడీపీ అధ్యక్షుడు మహబూబ్ ముఫ్తీ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ను కలుస్తారని సమచారం. అనంతరం ఒప్పంద వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
జమ్మూ కశ్మీర్లో హంగ్?