JNTU Engineering College
-
జేఎన్టీయూ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
► తొలుత ఆ స్థలంలో పారిశ్రామికవాడంటూ ఉత్తర్వులు జారీ ► విపక్షాల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ : ఇచ్చిన హామీలను విస్మరించడం..స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారడం ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. నరసరావుపేట వద్ద గతంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు కేటాయించిన భూమిని పారిశ్రామిక వాడకు కేటాయిస్తూ ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి జూన్ ఆరో తేదీ నాటికి యూటర్న్ తీసుకుంది. అదే భూమిని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు కేటాయిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడులో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు శతాబ్ది ఉత్సవాల సమయంలో హామీ ఇచ్చారు. ఆ ఉత్తర్వులు రాక ముందే కళాశాలకు సేకరించిన భూమిని పారిశ్రామికవాడగా గుర్తిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 21న మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల వెనుక పారిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి లక్షలు దండుకునేందుకు నరసరావుపేట నియోజకవర్గ ముఖ్యనేత తనయుడు కీలక భూమిక పోషించినట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి. కాసు హయాంలోనే ప్రయత్నాలు ఇక్కడ జేఎన్టీయూ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటి జేఎన్టీయూ వైస్ చాన్సలర్ తులసీరామచంద్ర ప్రభు తదితరులు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సహకరించారు. గుంటూరు జిల్లా యంత్రాంగం 76 ఎకరాలను సేకరించగా, యూనివర్సిటీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సానుకూలంగా నివేదిక పంపారు. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు రావడమే తరువాయి అన్న తరుణంలో సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు మరుగున పడింది. నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు జేఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు సత్వరం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇందుకు భిన్నంగా ఆ కళాశాలకు కేటాయించిన భూమికి అదనంగా మరో 32 ఎకరాలను కలుపుతూ 108 ఎకరాలను పారిశ్రామికవాడగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోటలో వ్యూహం ఆ భూమిని పారిశ్రామికవాడగా గుర్తించడం వెనుక పెద్ద పన్నాగమే ఉందని విమర్శలు వచ్చాయి. విద్యా సంస్థకు ఆ భూమిని కేటాయించడంతో పెద్దగా లాభం ఉండదనే ఉద్దేశంతో నరసరావుపేట నియోజకవర్గ ముఖ్యనేత తనయుడు దానిని పారిశ్రామిక వాడకు కేటాయించే విధంగా ఉత్తర్వులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి ఒక్కో యూనిట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర నిర్ణయించినట్టు ఆరోపణలు వినిపించాయి. -
బినామీ పేర్లతో పనుల పందేరం
► టెండర్లు లేకుండా రూ.74.31లక్షలు ఖర్చు ► అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా.. కొనసాగింపు ► పట్టనట్టు వ్యవహరిస్తున్న యూనివర్సిటీ ఉన్నతాధికారులు జేఎన్టీయూ : జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న సివిల్ ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి మాటున లక్షలాది రూపాయలు దారి మళ్లిస్తున్నారు. బినామీ పేర్లతో టెండర్లు కట్టబెట్టి పనులు చేయిస్తున్నారు. నిబంధనలన్నీ పక్కనబెట్టి అయినవారికి పనులు అప్పగించేస్తున్నారు. అయినా తమకేమీ పట్టనట్టు వర్సిటీ ఉన్నతాధికారులు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధారాళంగా ఖర్చు పెట్టినా.. క్యాంపస్ కళాశాలలో రూ.50 వేలు పైబడి చేసే ఏ అభివృద్ధి పనికైనా తప్పనిసరిగా టెండర్లు పిలవాలి. వీటిని కూడా వర్సిటీలోని డిక్స్ (డెరైక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్) పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. జేఎన్టీయూ క్యాంపస్ కళాశాలలోని ఇద్దరి టెక్నికల్ అసిస్టెంట్లకు డీఈ (సివిల్), ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులను అదనంగా కేటాయించారు. అంటే టెక్నికల్ అసిస్టెంట్లు గాను, డిప్యూటీ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గాను ఏకకాలంలో వ్యవహరించే వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ డిక్స్ పర్యవేక్షణలో విధులు నిర్వహించాలి. కానీ ఇవేవీ పట్టనట్టు జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్, సివిల్ డిప్యూటీ ఇంజినీర్ ఇష్టారాజ్యంగా అభివృద్ధిపనులు చేసుకొని బిల్లులు మంజూరు చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు, పరికరాల కొనుగోళ్లకు సంబంధించి రూ.74.31 లక్షల బిల్లులు మంజూరు అయ్యాయి. మీనమేషాలు లెక్కిస్తున్న ఉన్నతాధికారులు జేఎన్టీయూ క్యాంపస్ కళాశాలలో అక్రమ మార్గాలలో పనులు చేస్తున్నట్లు తెలిసినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా వారినే కొనసాగిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఒక డిప్యూటీ ఇంజినీరు (టెక్నికల్ అసిస్టెంట్ అదనపు బాధ్యతలు ) లక్షలాది రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేస్తుంటే ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంపై వర్సిటీలో చర్చనీయాంశమైంది. -
టెండర్లు ప్రహసనమేనా?
- పూర్తికాని నాచుపల్లి జేఎన్టీయూ హాస్టళ్ల టెండర్లు - పాతవారికి కట్టజెప్పేందుకు అధికారుల యత్నాలు - అన్నీ అవకతవకలే : టెండర్‌దారులు కొడిమ్యాల : నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టళ్ల నిర్వహణకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ అంతా ప్రహసనంగానే కనిపిస్తుంది. పాతవారికే అప్పగించేందుకు కళాశాల అధికారులు కుట్రలు చేస్తున్నారని టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. అధికారుల వైఖరి సైతం వీరి ఆరోపణలకు బలం చూకూరుస్తున్నారుు. 2015-16 విద్యాసంవత్సరానికి బాలురు, బాలికల హాస్టళ్లు, క్యాంటీన్ల నిర్వహణకు గతనెల 27న టెండర్లు ఆహ్వానించారు. బాయ్స్‌హాస్టల్‌కు 10, గర్ల్స్‌హాస్టల్‌కు 10, క్యాంటీన్‌కు 3 టెండర్లు దాఖలయ్యా యి. నిబంధనల ప్రకారం తక్కువ కోట్‌చేసిన వారికి టెండర్ ఖరారు చేయాలి. టెండర్లలో పాల్గొనదలిచిన వారు 14 రకాల డాక్యుమెంట్లు సమర్పించాలి. పరిశీలన సమయంలో అధికారులు ముందుగా టెక్నికల్ బిడ్‌ను ఓపెన్ చేసి అన్ని సరిగ్గా ఉన్న వాటినే అనుమతించాలి. కానీ ఇక్కడి అధికారులు మాత్రం ఫైనాన్షియల్ బిడ్‌ను మాత్రమే పరిశీలించారు. టెండర్దారులందరూ 14 రకాల డాక్యుమెంట్లు సమర్పించారో, లేదో పట్టించుకోలేదు. ఫైనాన్షియల్ బిడ్‌ను పరిశీలించిన అధికారులు తక్కువ కోట్ చేసిన వారికే టెండర్ ఇస్తున్నట్లు ప్రకటించనూ లేదు. దీంతో వీరి వైఖరిపై పలు అనుమానాలు కలుగుతున్నారుు. పాతవారికి ఇప్పించేందుకే ఆలస్యమా? బాయ్స్‌హాస్టల్ నిర్వహణ బాధ్యతలు మారుతున్నప్పటికీ, ఏడేళ్లుగా గర్ల్స్‌హాస్టల్ నిర్వహణ ను వివిధ సంస్థల పేరుతో ఒకే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈసారి కూడా అతనికే అప్పగించేందుకు కళాశాల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. గర్ల్స్‌హాస్టల్‌కు అత్యల్పంగా ఆంజనేయ ఫర్మ్ తరఫున ఒక్క విద్యార్థినికి రూ.44.89 చొప్పున, బాయ్స్‌హాస్టల్‌కు అత్యల్పంగా సరోజ ఫర్మ్ తరఫున ఒక్క విద్యార్థికి రూ.55 చొప్పున టెండర్లు వచ్చాయి. తమకు అనుకూలమైన వ్యక్తి వీటికన్నా ఎక్కువ మొత్తాన్ని కోట్ చేయడంతో అతనికే టెండర్దక్కేలా చేసేందుకు అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని మిగతా టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. గతేడాది కూడా బాయ్స్‌హాస్టల్ టెండర్ పొందిన వ్యక్తికి గర్ల్స్‌హాస్టల్ నిర్వహణ బాధ్యతలు, గర్ల్స్‌హాస్టల్ టెండర్లు పొందిన వ్యక్తికి బాయ్స్‌హాస్టల్ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల అభిప్రాయంపై అనుమానాలు టెండర్దారులకున్న అర్హతలను విద్యార్థుల సమక్షంలో చర్చించామని, బాయ్స్, గర్ల్స్‌హాస్టల్ రెండు టెండర్లనూ మణికంఠ ఏజన్సీకే ఇవ్వాలని విద్యార్థులు తీర్మానించారని ప్రిన్సిపాల్ ఎన్వీ రమణ తెలిపారు. అరుుతే మణికంఠ ఏజెన్సీ వారే గతేడాది గర్ల్స్హాస్టల్ను నిర్వహించారు. మిగతావారి కంటే అత్యధికంగా గర్ల్స్‌హాస్టల్‌కు రూ.50, బాయ్స్‌హాస్టల్‌కు రూ.62 కోట్‌చేశారు. వీరికి అనుకూలంగా వ్యవహరించేందుకే టెండర్ల వ్యవహారంలోకి విద్యార్థుల అభిప్రాయం అనే కొత్తసూత్రాన్ని అధికారులు తీసుకొచ్చారని మిగతా వారి నుంచి ఆరోపణలు వస్తున్నారుు. కళాశాల అధికారులు మాటల్లో చెబుతున్న పారదర్శకతను ఆచరణలో చూపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. టెండర్ ఖరారు గురించి ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే దాటవేస్తున్నాడని, యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కొందరు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా విద్యార్థులే మెస్ బిల్లు చెల్లిస్తున్నందున.. వారిని టెండర్ల ప్రక్రియలో ఇన్వాల్వ్ చేశామన్నారు. రెండురోజుల్లో యూనివర్సిటీ ఉన్నతాధికారుల వద్దకు టెండర్ ఫారాలు తీసుకెళ్లి ఫైనల్ చేస్తామని తెలిపారు.