jnusu president
-
జేఎన్‌యూ దాడి ఘటనలో కీలక పరిణామం
-
జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేతపై కేసు
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థి సంఘం నేత ఐషే ఘోష్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల దాడికి ఒక రోజు ముందు ఈనెల 4న వర్సిటీ సర్వర్ రూమ్‌ను ధ్వసం చేశారనే ఆరోపణలపై ఐషే ఘోష్ సహా ఎనిమిది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హాస్టల్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేయడంతో పాటు సెమిస్టర్ రిజిస్ర్టేషన్ ప్రక్రియను అడ్డుకునేందుకు వారు సాంకేతిక సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ గార్డుపైనా ఆమె దాడి చేశారని అభియోగాలు నమోదయ్యాయి. కాగా యూనివర్సిటీ అధికారులు ముసుగులు తొడిగిన సెక్యూరిటీ గార్డులచే సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేయించి విద్యార్ధులపై దాడులకు ఉసిగొల్పారని, విద్యార్థి సంఘం నేత ఐషూ ఘోష్‌పై దాడి చేశారని జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించింది. చదవండి : జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం.. -
జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడి
-
‘ముసుగు దుండగులను గుర్తిస్తా’
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం చీఫ్ ఐషే ఘోష్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం సాయంత్రం క్యాంపస్‌లోకి ప్రవేశించి హాకీస్టిక్‌లు, ఇనుపరాడ్లతో తమపై దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. దుండగుల దాడిలో తలపై గాయాలైన ఘోష్ తాను కోలుకున్న అనంతరం ఏబీవీపీ దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏబీవీపీ సభ్యులపై తాము సమిష్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. విద్యార్ధులపై ఇనుప రాడ్లతో దాడి చేసిన వారిలో కొందరి ముఖాలను తాను గుర్తుపట్టగలనని, ఘర్షణలు చెలరేగిన క్రమంలో పెనుగులాటలో కొందరి ముసుగులు చెదిరిపోయాయని చెప్పారు. దుండగుల దాడిలో దాదాపు 30 మంది జేఎన్‌యూ విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఐషూ ఘోష్ తలపై తీవ్ర గాయమై రక్తమోడుతూ ఆదివారం రాత్రి టీవీల్లో కనిపించారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల హింసాకాండపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. చదవండి : జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ -
నన్ను తీవ్రంగా కొట్టారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింసలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తల పగిలింది. ప్రస్తుతం ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల దాడి సందర్భంగా తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుండగా.. ఆయిషీ ఘోష్ విలపిస్తూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు తనను కిరాతకంగా కొట్టారని ఈ వీడియోలో ఆమె విలపిస్తూ పేర్కొన్నారు. ‘తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. నేను మాట్లాడే స్థితిలో కూడా లేను. దాడులు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న నన్ను తీవ్రంగా కొట్టారు’ అని ఆమె వీడియోలో పేర్కొన్నారు. జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్ గూండాలు దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ముసుగు మూక వీరంగం జేఎన్‌యూలో మసుగు మూకల వీరంగానికి సంబంధించి తాజా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్‌లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల అనంతరం ముసుగులు ధరించిన వ్యక్తులు క్యాంపస్‌లో సంచరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖానికి ముసుగులు తొడిగి.. జీన్స్‌ప్యాంట్లు, జాకెట్లు ధరించి.. చేతిలో కర్రలతో గుంపుగా దుండగులు క్యాంపస్‌లో సంచరిస్తూ.. కర్రలతో బెదిరిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. చదవండి: సిగ్గుతో తలదించుకుంటున్నా! -
ముసుగులతో విద్యార్థులపై దాడి
-
బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జేఎన్యూకు వెళ్లాడు. వర్సిటీకి చేరుకున్న విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకు తోటి వర్సిటీ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని కోర్టు నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. ఆరు నెలల బెయిల్ మంజూరు కావడంతో కొన్ని షరతులతో విడుదలయ్యాడు. ఫిబ్రవరి 12న కన్హయ్య అరెస్టయిన విషయం విదితమే. -
కన్హయ్యకు షరతులతో బెయిల్
విచారణకు సహకరించాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశం ♦ విచారణ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదు ♦ రూ. 10 వేల చొప్పున బాండు, పూచీకత్తు ఇవ్వాలి ♦ విద్యార్థుల సిద్ధాంతాలు ఏవైనా రాజ్యాంగానికి లోబడాలి న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నా కుమారుడు ఉగ్రవాది కాదు: కన్హయ్య తల్లి ‘‘నా కుమారుడు ఉగ్రవాది కాదు. ఈ విషయాన్ని ప్రపంచమంతా త్వరలో తెలుసుకుంటుంది. అతడిపై నాకు విశ్వాసముంది. తనను ఇరికించిన ప్రత్యర్థులతో అతడు పోరాడుతాడు’’ అని కన్హయ్య తల్లి మీనాదేవి పేర్కొన్నారు. తన కుమారుడికి బెయిల్ మంజూరు కావటం పట్ల ఆమె బీహార్ నుంచి పీటీఐ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ప్రతి తల్లికీ ఆమె బిడ్డ గొప్పే. అతడు తప్పు చేస్తే శిక్షించండి.. కానీ అతడిని ఉగ్రవాది అనొద్దు’’ అని చెప్పారు. కన్హయ్యకు బెయిల్ రావటం తమకు శుభవార్త అని.. వర్సిటీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నామని జేఎన్‌యూ రిజిస్ట్రార్ భూపీందర్ జుట్షి బుధవారం పీటీఐతో పేర్కొన్నారు. జేఎన్‌యూ విద్యార్థుల హర్షాతిరేకాలు... కన్హయ్యకు బెయిల్ మంజూరైందన్న వార్త తెలియగానే.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ ఎదుట గుమిగూడి ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆనందోత్సాహం వెల్లువెత్తింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకటన కోసం అక్కడే వేచిచూశారు. కన్హయ్యకు బెయిల్ గొప్ప ఊరట అని.. ఇంకా జైలులోనే ఉన్న ఉమర్, అన్బిరన్ల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని జేఎన్‌యూఎస్‌యూ ఉపాధ్యక్షురాలు షీలారషీద్ పేర్కొన్నారు. దేశ వ్యతిరేక ర్యాలీపై తీవ్ర ఆగ్రహం పార్లమెంటు దాడి కేసులో దోషిగా నిర్ధారితుడై ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌గురు, 1971లో విమానం హైజాక్ చేసిన కేసులో దోషిగా నిర్ధారితుడై ఉరిశిక్షకు గురైన మక్బూల్భట్ల ఫొటోలు, పోస్టర్లు ప్రదర్శిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టిన తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ నినాదాల్లో ప్రతిఫలించిన విద్యార్థుల మనోభావాలపై.. ఆ ఫొటోలు, పోస్టర్లు పట్టుకుని ఫొటోల ద్వారా రికార్డుల్లో నమోదైన విద్యార్థి లోకం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. ‘‘కన్హయ్య జేఎన్‌యూలో పీహెచ్డీ చేస్తున్న మేధో వర్గానికి చెందిన వ్యక్తిగా కోర్టు గుర్తిస్తోంది. అతడు ఎటువంటి రాజకీయ సిద్ధాంతం లేదా అనుబంధాన్నయినా కలిగివుండొచ్చు.. అయితే అది భారత రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి. భారత పౌరుల వాక్స్వాతంత్య్రం.. రాజ్యాంగంలోని 19(2) అధికరణ కింద సహేతుక నియంత్రణలకు లోబడి ఉంటుంది’’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. -
కన్హయ్యను జైల్లో ఎలా చూస్తున్నారు?
దేశద్రోహం కేసులో అరెస్టయ్యి, ప్రస్తుతం రిమాండు ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ను అక్కడ జైల్లో ఎలా చూస్తున్నారు? అతడికి ఎలాంటి ఆహారం ఇస్తున్నారు.. ఈ వివరాలపై జాతీయ మీడియా దృష్టిపెట్టింది. తీహార్ జైలు అంటే దేశంలోనే అత్యంత పటిష్ఠమైన భద్రత కలిగినదని అంటారు. అక్కడ కూడా కన్హయ్య భద్రత విషయంలో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ అతడిని ఒక ఐసోలేషన్ సెల్లో ఉంచారు. అంటే, ఆ సెల్లోకన్హయ్య తప్ప వేరెవ్వరూ ఉండరన్న మాట. అతడికి అందించే ఆహారాన్ని కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పటియాలా హౌస్ కోర్టులో కన్హయ్యను ప్రవేశపెట్టే సమయంలో తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో తీహార్ జైల్లో కూడా అతడికి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడో నెంబరు జైల్లో అతడిని పెట్టారు. జైలులో ఉండే సిబ్బందితో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు పోలీసు సిబ్బంది బృందం 24 గంటలూ అతడిని కాపు కాస్తోంది. అతడి భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని గట్టిగా ఉత్తర్వులిచ్చారు. ఇప్పటివరకు కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ముగ్గురినీ విడివిడిగా ప్రశ్నించిన పోలీసులు.. శుక్రవారం మాత్రం ముగ్గురినీ కలిపి విచారించారు.