joint survey
-
జాయింట్ సర్వే !
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్విందర్ సింగ్ వోరా ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుతో కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఏర్పడనున్న ముంపుపై ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే జాయింట్ సర్వే నిర్వహించగా, తదుపరిగా క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల తో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించి డీమార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని వోరా ఆదేశించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాని కి సంబంధించి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై బుధవారం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులై న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రా ష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎప్పటికైనా సర్వే చేయాల్సిందే: వోరా పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ ఎప్పటికైనా 150 అడుగులే ఉంటుందని, దీనివల్ల తెలంగాణలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఎప్పుడైనా సర్వే చేసి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వే జరగకపోవచ్చని, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణ కోరిన మేరకు జాయింట్ సర్వే చేయాల్సిందేనని సూచించారు. జాయింట్ సర్వేను సమన్వయం చేయాలని పీపీఏ ను ఆదేశించారు. 150 అడుగుల నిల్వతో ఏర్పడే ముంపుతో పాటు ప్రాజెక్టు కారణంగా ముర్రెడువాగు, కిన్నెరసాని వాగులకు ఉండే ముంపును గుర్తించి నివేదిక సమర్పిస్తే, ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ, తెలంగాణతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ కోరి న మేరకు.. పోలవరం ప్రాజెక్టుతో మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుపై జాయింట్ సర్వే విషయంలో మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకుందా మని చెప్పారు. కాగా పోలవరం ప్రాజెక్టుతో సీడబ్ల్యూసీ సర్వేలో తేలిన దానికి మించి తమ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉందని ఒడిశా నీటిపారుదల శాఖ సీఈ అశుతోష్ దాస్ పేర్కొన్నారు. ఐఐటీ రూ ర్కెలా అధ్యయన నివేదికలో ఇది తేలిందన్నారు. ఈ నివేదికపై అధ్యయనం చేసి తదుపరి సమావేశంలో చర్చిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం, పీపీఏ సీఈఓ అతుల్ జైన్, సీఈ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.ఎలాంటి పురోగతి లేదు: తెలంగాణ గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు జాయింట్ సర్వేకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు తెలియజేశారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని, కాగితాలకే పరిమితమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై జాయింట్ సర్వే చేయాల్సిందేనని ఆయన కోరారు. మరోవైపు జాయింట్ సర్వేకు తెలంగాణ సహకరించడం లేదని, సర్వే రెండు వాగులకే పరిమితం చేయాల్సి ఉండగా, ఏడు వాగులు సర్వే చేయాలని కోరుతోందని ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరావు చెప్పారు. అయితే ముర్రెడువాగు, కిన్నెరసాని వాగుల జాయింట్ సర్వేకు పూర్తిగా సహకరించిన విషయాన్ని తెలంగాణ ఈఎన్సీ గుర్తు చేశారు. -
ఉమ్మడి సర్వే జరపాల్సిందే!.. పోలవరం అథారిటీ భేటీలో వాడీవేడి చర్చ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నిల్వ సామర్థ్యం 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తే రాష్ట్రంలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ పునరుద్ఘాటించింది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు గోదావరికి ఇరువైపులా తెలంగాణ పరిధిలో 892 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టుగా తమ ఇంజనీర్లు తేల్చారని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేను.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు పరిమితం చేయకుండా 892 ఎకరాల్లో చేపట్టాలని డిమాండ్ చేసింది. బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) భేటీలో పోలవరం ముంపు ప్రభావంపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్‌కుమార్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. వాగుల ప్రవాహానికి బ్యాక్‌వాటర్ అడ్డంకి పోలవరంతో తెలంగాణలో 300ఎకరాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని, దీనిపై అధ్యయనం జరిపి నివా రణ చర్యలు తీసుకుంటామని 2020 జనవరిలో జరిగిన 11వ పీపీఏ భేటీలో ఏపీ కూడా ఒప్పుకుందని మురళీధర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే కోసం ఇటీవల క్షేత్రస్థాయి పర్య టనకు వచ్చిన ఏపీ అధికారులు.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఉండనున్న ప్రభావంపైనే అధ్యయనం చేస్తామ న్నారని తెలిపారు. 892 ఎకరాల ముంపుపై అధ్యయనం చేయాలని తాము కోరగా, ఏపీ ప్రభుత్వ అనుమతి తీసు కుని మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారని వివరించారు. తెలంగాణలోని 35 వాగుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్‌వాటర్ అడ్డంకిగా మారడంతో పరిసర ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం జరిగిందన్నారు. గత జూలైలో వచ్చిన వరదలతో 103 గ్రామాలు ప్రభావితం కాగా, 40,446 ఎకరాలు ముంపునకు గుర య్యాయని చెప్పారు. పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మరో 46 గ్రామాల పరిధిలోని 9,389 ఎకరాలు ముంపునకు గురి అవుతాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం అధ్యయనం చేయించాలని కోరారు. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని వరద జలాలను గోదావరిలోకి పంపింగ్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదని, దీనికి ఎవరూ అంగీకరించలేదని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర, తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అన్ని రాష్ట్రాల తో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని మాత్రమే సూ చించిందని చెప్పారు. అయితే రెండు సమావేశాల్లో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని, ఇందుకోసం త్వరలోనే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ సీఎంలతో సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం పేర్కొందని తెలిపారు. తెలంగాణకు నచ్చినట్టుగా నివేదికలు వచ్చేవరకు అధ్యయనం చేయాలా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం.. తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం -
8 నుంచి సంయుక్త సర్వే!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణ రాష్ట్రంలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఈ నెల 8 నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖలు సంయుక్త సర్వే నిర్వహించనున్నాయి. పోలవరం డ్యాంలో ఎఫ్ఆర్ఎల్ 150 మీటర్ల మేరకు గరిష్ట స్థాయిలో నీళ్లను నిల్వ చేస్తే బ్యాక్‌వాటర్ వల్ల తెలంగాణలో 890 ఎకరాలు, 203 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఇటీవల తెలంగాణ నిర్వహించిన సర్వేలో తేలింది. మరోవైపు పోలవరం బ్యాక్ వాటర్‌తో కిన్నెరసాని నది ఎగువన 18 కి.మీల వరకు, ముర్రెడు వాగు ఎగువన 6 కి.మీల వరకు ముంపు పభ్రావం ఉంటోందని ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌రెడ్డి వేసిన కేసు విషయంలో ఎన్జీటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి నిర్థారించడానికి సంయుక్త సర్వే జరపాలని పీపీఏ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ఉప నదులతో పాటు మరో 34 ఉప నదులు/వాగులపై పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఉండనున్న ప్రభావంపై సర్వే జరపాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ ఉప నదుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్‌వాటర్ అడ్డంకిగా మారుతోంది. దీంతో ఈ ఉపనదులు/వాగుల్లో ప్రవాహం వెనక్కి తన్నుతుండడంతో పరిసర ప్రాంతాలు ముంపునకు గురి అవుతాయని ఇప్పటికే ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి లేఖలు రాసింది. పోలవరంతో గోదావరి నది పొడవునా ఉండనున్న ముంపు ప్రభావంపై సర్వే జరిపించాలని తెలంగాణ కోరుతోంది. వరద రక్షణ గోడల విషయంలో తెలంగాణ డిమాండ్ పట్ల పోలవరం అథారిటీ సానుకూలంగా స్పందించింది.. గోదావరికి ఇరువైపులా కరకట్టలు నిర్మించేందుకు కానున్న వ్యయంపై అంచనాలను సమర్పించాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరినట్టు తెలిసింది. సంయుక్త సర్వేలో తేలిన విషయాల ఆధారంగా ముంపు ప్రాంతాల్లోని బాధితులకు పునరావాసం కల్పించే అంశంపై పీపీఏ నిర్ణయం తీసుకోనుంది. -
మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి
♦ 101 మీటర్ల ఎత్తులో 240 హెక్టార్ల ముంపు నిర్ధారణ ♦ మహారాష్ట్ర అధికారులతో సీఎంఓ సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ముంపుపై తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల అధికారుల ఉమ్మడి సర్వే కొలిక్కి వచ్చింది. మొత్తంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 101 మీటర్ల ఎత్తులో మహారాష్ట్ర ప్రాంతంలో 240 హెక్టార్ల ముంపు ఉంటుందని ఈ సర్వేలో తేలింది. అధికారికంగా నిర్ణయించిన ముంపు ప్రాంతం చాలా తక్కువగా ఉన్నందున 101 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం మహారాష్ట్రని కోరనుంది. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే తమ్మిడిహెట్టి ఎత్తుపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య అవగాహ న కుదిరింది. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకారం తెలి పింది. అయితే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డపై మాత్రం తేలలేదు. కిందటిసారి అధికారుల స్థాయిలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, జాయింట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు అంగీకరిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగా సర్వే చేసిన అధికారులు 102 మీటర్ల నుంచి వివిధ ఎత్తులో ఉండే ముంపును తే ల్చారు. 102 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో 399 హెక్టా ర్లు, 101.5 మీటర్ల ఎత్తులో 315 హెక్టార్లు, 101 మీటర్ల ఎత్తులో 240హెక్టార్లు, 100 మీటర్ల ఎత్తులో 83 హెక్టార్ల ముంపును నిర్ధారించారు. ఇందులో 101.5మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున ఈ ఎత్తులను పరిశీలించాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఒకవేళ 101.5 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తే బ్యారేజీ నిల్వ సామర్థ్యం 21.75 టీఎంసీలు ఉండనుండగా, 101 మీటర్లకు పరిమితమైతే అది 19.73 టీఎంసీలుగా ఉండనుంది. త్వరలో ఒప్పందాలు మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి రావడం, తమ్మిడిహెట్టిపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్న నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణాలపై ఈ నెలాఖరులోగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఒప్పందం జరిగే అవకాశాలున్నాయి. అధికారుల స్థాయిలో కసరత్తు ముగిసిన దృష్ట్యా, ముఖ్యమంత్రుల స్థాయిలో ఏర్పా టైన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహారాష్ట్ర సీఎం సమయం ఇచ్చిన వెంటనే ఒప్పందాల ప్రక్రియ ముగించి, మేడిగడ్డ బ్యారేజీ శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
భూ తగాదా
►రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయ లోపం ► భూవివాదంలో 25 వేల ఎకరాలు ► రెండు శాఖల మధ్య నలుగుతున్న 8 వేల మంది లబ్ధిదారులు ► పరిష్కారం చూపాలని వేడుకోలు నెన్నెల : రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం లబ్ధిదారులకు శాపంగా మారింది. రెవెన్యూ అధికారు లు పంచిన భూములను సాగు చేయకుండా అటవీశాఖతో అధికారులు అడ్డుకుంటున్నారు. రెవెన్యూ అధికారులేమో పంచిన భూములపై పూర్తిస్థాయి హక్కులు ఉంటాయని తెలుపుతున్నారు. కానీ, అటవీ శాఖ అధికారులు ఆ భూములు రిజర్వు ఫారెస్టు కిందకి వస్తాయని అందులో పంటలు ఎలా సాగు చేస్తారని పేర్కొంటున్నారు. ఈ రెండు శాఖల మధ్య భూవివాదంలో జిల్లాలో దాదాపు 8 వేల మందికి సంబంధిం చిన 25 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ రెండు శాఖల మధ్య లబ్ధిదారులు సమిధలవుతున్నారు. దశాబ్దాలుగా వామపక్షాలు పేదల పక్షాన పోరాడితే అధికారులు కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కానీ, భూ సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. కాగా, ప్రభుత్వ శాఖల్లో సరైన రికార్డులు లేకపోవడం వివాదాలకు కారణంఅవుతుంది. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేక పోవడమే కారణంగా కనిపిస్తుంది. వివాదంలో 25 వేల ఎకరాలు జిల్లాలోనే అత్యధికంగా ప్రభుత్వ భూములున్న నె న్నెల మండలంలో దాదాపు 7,600 ఎకరాల భూ మి చిక్కుల్లో చిక్కుకుని ఉంది. నెన్నెల మండలం సింగాపూర్‌లో సర్వే నంబర్ 34, 36లలో 950 ఎకరాలు, కొంపెల్లి, పొట్యాల, కొత్తూర్ శివార్లలోని సర్వే నంబరు 4/2, 4/3లలో 600ఎకరాలు, కొ నంపేట సమీపంలోని చీమరేగళ్ల వద్ద 700 ఎకరా లు, నెన్నెల, బొప్పారం వద్ద గల సర్వే నంబరు 671, 672,674లలో 1,200 ఎకరాలు, సీతానగర్లోని సర్వే నంబరు 1లో 400 ఎకరాలు, జైపూర్ మండలం గుత్తేదారిపల్లి శివారులోని సర్వే నంబరు 368, 369/12లో 200 ఎకరాలు, వేమనపల్లి మండలం గోధుంపేట శివారు సర్వే నంబరు 3లో 350 ఎకరాలు. చామనపల్లి శివారులోని సర్వే నంబరు 61లో 100 ఎకరాలు, సూరారంలో మరో 200 ఎక రాలు, చెన్నూర్ మండలం కన్నెపల్లి, బుద్ధారం, సంకారం, గ్రామాలకు అనుకొని ఉన్న సర్వే నంబ రు 354లో 800 ఎకరాలు, మందమర్రి మండలం సారంగపల్లి శివారు సర్వే నంబరు 33లో 220 ఎకరాలు, భీమిని మండలం రెబ్బెన శివారు సర్వే నం బరు 247లో 250 ఎకరాలు, ఆనందాపూర్ శివారు సర్వే నంబరు 101లో 120 ఎకరాలు, మెట్పల్లిలో ని సర్వే నంబరు 20, 22లలో 150 ఎకరాలు, జజ్జరెల్లిలోని సర్వే నంబరు88/89లో 400ఎకరాల భూ మి వివాదంలో ఉంది. కోటపల్లి మండలం కొండంపేట, పార్‌పల్లిలో దాదాపు 800ఎకరాలు, సిర్పూర్ మండలంలో 6,800 ఎకరాలు, ఉట్నూర్‌లో 4,300 ఎకరాలు, కౌటాలలో 3,600 ఎకరాలు, రెబ్బెనలో 2,900 ఎకరాలు, దహెగాంలో 580 ఎకరాల భూ ములు వివాదంలో ఉన్నాయి. తాండూర్, బెజ్జూర్, సిర్పూర్(టి), ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కడెం, ఖా నాపూర్, ఇంద్రవెల్లి మండలాల్లో కూడా సమస్య తీ వ్రంగా ఉంది. భూమి తమదంటే తమదని ఇరుశాఖల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో వేలాది ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. జాయింట్ సర్వేపై జాప్యం ఆర్భాటంగా పట్టాలు అందజేసిన అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆ తర్వాత ప్రజల సమస్యలను ప ట్టించుకోవడం లేదు. కేటాయించిన భూములు ఏ శాఖకు చెందుతాయో నిర్ధారించాల్సిన జాయింట్ సర్వే నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూమి మోఖా(పొజీషన్) ఎ క్కడుందనేది చూపకపోవడంతో లబ్ధిదారులు ఆ నంబరులో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దున్నడం ప్రారంభించారు. రైతులు సర్వే నంబరు ఆధారం గా ప్రభుత్వ భూమిలోనే సాగు చేసుకుంటున్నారు. కొన్నాళ్లు సాగు చేసుకున్నాక ఈ భూములు రిజర్వు ఫారెస్టుకు చెందినవని అటవీశాఖ అడ్డుకుంటుంది. రికార్డుల్లో పీపీ ల్యాండుకే పట్టాలిస్తున్నామని రెవె న్యూ అధికారులు వాదిస్తున్నారు. పట్టాల పేరిట అ టవీ భూములను కబ్జా చేస్తున్నారని అటవీ అధికారులు ఆరోపిస్తున్నారు. అటవీ భూములు నిర్దారిం చేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దీంతో రిజర్వు ఫారెస్టు సరిహద్దులేవో తెలియడం లేదు. ప్రభుత్వం జిల్లాలో రక్షిత అటవీ ప్రాంతాన్ని గుర్తించినపుడు అందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయలేదు. దీంతో మిగులు భూములపై వివాదం కొనసాగుతోంది. -
‘ప్రాణహిత-చేవెళ్ల’కు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న బ్యారేజికి మహారాష్ర్ట ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలం నుంచి ఈ అనుమతి కోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రెండు రాష్ట్రాల అధికారులు నిర్వహించిన జాయింట్ సర్వే నివేదిక కూడా తుది రూపం దాల్చింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అనంతరం ఈ నివేదిక పై కేంద్రం ఆమోదముద్ర వేసిన వెంటనే బ్యారేజి పనులు మొదలు కానున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర, మన రాష్ట్ర సరిహద్దులో బ్యారేజిని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యారేజి నిర్మాణం వల్ల మహారాష్ర్టలోని భూభాగం ముంపునకు గురవుతుంది. అందుకోసం మహారాష్ర్ట ప్రభుత్వం ఈ బ్యారేజి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆమోదాన్ని తెలపాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికీ మహారాష్ర్టతో ఒప్పందం జరిగినా... ముంపు సమస్య ఉన్న బ్యారేజి నిర్మాణానికి ప్రత్యేక ఆమోదం అవసరం. ఇందుకోసం బ్యారేజి నిర్మించే ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు జాయింట్ సర్వేను నిర్వహించారు. గత రెండు మాసాల కిందట జరిగిన ఈ సర్వే నివేదిక కూడా సిద్ధమైంది. జాయింట్ సర్వే, ముంపు ప్రాంత గుర్తింపు ప్రక్రియ ముగియడంతో బ్యారేజి నిర్మాణానికి మహారాష్ర్ట ప్రభుత్వం తమ అనుమతిని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కాల్వల పనులతో పాటు, టన్నెల్ తవ్వకాన్ని కూడా మొదలు పెట్టారు. మహారాష్ర్టకు పరిహార చెల్లింపు పూర్తయిన తర్వాత బ్యారేజీ పనులను కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణకు జీవధార సుమారు రూ. 38 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతానికి సాగునీరు, మంచినీరు అందనుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. అలాగే హైదరాబాద్ నగర మంచినీటి అవసరం కోసం 30 టీఎంసీలను తరలించనున్నారు. మొత్తం 160 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నదికి ఉపనది అయిన ప్రాణహిత నుంచి లిప్టుల ద్వారా తరలించనున్నారు. ఇందుకోసం సుమారు 3,466 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. మొదట నిర్ణయించిన గడువు ప్రకారం 2013-14 లోపు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే పనులను ప్రారంభించడం ఆలస్యం కావడంతో ఈ గడువును 2018 వరకు పొడిగించారు.