సెల్ఫీ @ 16
ప్రపంచానికి ఇప్పుడు సెల్ఫీల పిచ్చి పట్టుకుందిగానీ అమెరికాలోని అలాస్కా ప్రాంతానికి చెందిన జొనాథన్ కెల్లర్ మాత్రం 16 ఏళ్ల క్రితం నుంచి ఇదే పనిలో ఉన్నాడు. 1999 నుంచి ప్రతిరోజూ ఒక ఫొటో తీసుకోవడం మొదలెట్టాడు. అంతటితో ఆగలేదు. తాను తీసుకున్న ఫొటోలన్నింటినీ వీడియోలోకెక్కించాడు.
22 ఏళ్ల వయసులో తొలిసారి తీసిన ఫొటోతో ఇటీవల తీసిన ఫొటోని పోల్చి చూస్తే ఎన్నో మార్పులు కనిపించాయట. అప్పటి పాలబుగ్గల జొనాథన్ ఇప్పుడు కాస్తా గడ్డం బాబు అయ్యాడు. ఈ ఫొటోలన్నింటినీ ఓ వీడియోలోకి ఎక్కించి దానికి ‘లివింగ్ మై లైఫ్ ఫాస్టర్’ అని నామకరణం చేసేశాడు.