Judicial review policy
-
దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో ఖజానాను అప్పటి ప్రభుత్వ పెద్దలు దోచేశారు. ప్రజా ధనాన్ని ఇలా దోపిడీ చేయకుండా అడ్డుకట్ట వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను తెచ్చింది. ఈ చట్టం ద్వారా టెండర్లలో పారదర్శకత, సూచనలు చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రవేశ పెట్టింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసింది. కానీ, ఇటీవలి ఎన్నికల్లో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమే మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ దోపిడీ పర్వానికి తెర తీస్తూ చంద్రబాబు కూటమి జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ప్రతిపాదనను బుధవారం మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రివ్యూ అడ్డునూ తొలగించుకుంది. మళ్లీ 2014–19 తరహాలోనే అడ్డగోలుగా అంచనాలు పెంచేసి.. కమీషన్లు ఎక్కువ ఇచ్చే కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్లు పిలిచి, కోరుకున్న కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి, మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చి, కమీషన్లు వసూలు చేసుకునేందుకు మళ్లీ సిద్ధమయ్యారని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.జ్యుడిషియల్ ప్రివ్యూకు నీతి అయోగ్ ప్రశంసలురాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్ట్రాస్టక్చర్ యాక్ట్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. ఆ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌తోనే రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే..విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఇప్పటిలానే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్లాది రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు. 2014 – 19 మధ్య బాబు సర్కారు దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..» గాలేరు–నగరి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి, దొడ్డిదారిన తన సన్నిహితుడైన సి.ఎం. రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు.»హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.99 లక్షల విలువైన పనులు, 3–బి ప్యాకేజిల్లో రూ.రూ.8.69 కోట్ల విలువైన పను మిగిలాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. 2–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేశారు. 3–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. ఈ రెండింటినీ సి.ఎం. రమేష్‌కే అప్పగించారు. ఇలా 2–బి ప్యాకేజీలో రూ.114.09 కోట్లు, 3–బి ప్యాకేజీలో 140.45 కోట్లు పెంచేసి, సి.ఎం.రమేష్‌కు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. »హంద్రీ–నీవా రెండో దశ 4–బి ప్యాకేజీలో 2014 నాటికి రూ.1.34 కోట్లు, 5–బీ ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటి కాంట్రాక్టర్లను కూడా 60–సీ నిబంధన కింద చంద్రబాబు తొలగించారు. 4–బి ప్యాకేజీ పనుల వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, తన సన్నిహితుడైన ఆర్.మహేశ్వరనాయుడు, ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.»వెలిగొండ రెండో టన్నెల్లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటిని చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. జీవో 22, జీవో 63ను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. వాటిని సి.ఎం. రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి, సి.ఎం. రమేష్ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఆ టన్నెల్ పనిని పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కాVŠ జీవో 22, జీవో 63ను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లను దోచిపెట్టినట్లు తేల్చడం బాబు అవినీతికి తార్కాణం.» 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్‌కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది. » ఇప్పుడూ అదే రీతిలో ఖజానాను కొల్లగొట్టేందుకు జ్యుడిషియల్ ప్రివ్యూను ప్రభుత్వం రద్దు చేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
మా లక్ష్మణరేఖ తెలుసు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖపై తమకు పూర్తిగా అవగాహన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా 2016లో మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్నదానిపై అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని న్యాయమూర్తి ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం బుధవారం వివరించింది. ఇలాంటి అకడమిక్ అంశాలపై కోర్టు తన సమయం వృథా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానమివ్వడం తమ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు సూచించింది. విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. -
న్యాయ సమీక్ష పేరుతో ప్రభుత్వాలను నడిపే ప్రయత్నం చేయకూడదు
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ సమీక్ష ముసుగులో ప్రభుత్వాలను నడపడానికి కోర్టులు ప్రయత్నించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఉత్తర కర్ణాటకలో ఎగువ కృష్ణా ప్రాజెక్టు భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిపుణుల సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే చర్యలపై కోర్టు జోక్యం తగదని జస్టిస్ ఎస్.దీక్షిత్, జస్టిస్ పి.కృష్ణ భట్ల ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘పాలన అనేది ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. న్యాయ సమీక్ష ముసుగులో కోర్టులు ప్రభుత్వాలను నడపడానికి ప్రయత్నించకూడదు. కేవలం సూచనల మేరకు ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ఆ పనుల్లో చిన్న తప్పులు ఎత్తిచూపడం, అప్రధానమైన అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపడం మా పని కాదు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి’’ అని పేర్కొన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. -
న్యాయ సమీక్షకు ఐదో షెడ్యూలు అతీతం
సాక్షి, న్యూఢిల్లీ: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజనులకు నూటికి నూరు శాతం రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని, రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలులో పేరా 5(1)ను అనుసరించి జారీ చేసే ఏ నోటిఫికేషన్ అయినా న్యాయ సమీక్షకు అతీతమని ఆధార్ సొసైటీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను రివ్యూ పిటిషన్‌గా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఐదో షెడ్యూలును అనుసరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల్లో గిరిజనులకు నూటికి నూరు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ 2000 జనవరి 10న జారీచేసిన జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేయజాలదని నివేదిస్తూ ఆధార్ సొసైటీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సొసైటీ తరఫు న్యాయవాదు లు అల్లంకి రమేశ్, హన్మంతరెడ్డి పిటిషన్ ఫైల్ చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సొసైటీ తరఫు న్యాయవాది ఎంఎన్ రావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ అంశాన్ని సమీక్షించేందుకు ఇతర మార్గాలు ఉండగా.. రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రశ్నించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు రిట్ పిటిషన్‌ను రివ్యూ పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకునేందుకు ధర్మాసనం సమ్మతిస్తూ.. ఇదే అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లకు జత చేసింది. ఈ రివ్యూ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. -
‘నిర్భయ’ దోషి పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న సభ్యులుగా ఉన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంపై న్యాయ సమీక్ష అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘క్షమాభిక్ష కోరుతూ సమర్పించిన అన్ని సంబంధిత పత్రాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరమని భావించేందుకు ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదు. అందువల్ల ఈ రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న పిటిషనర్ వాదనను కూడా కొట్టివేసింది. వినయ్ శర్మ ఆరోగ్యం సరిగ్గానే ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్స్‌లో స్పష్టంగా ఉందన్నారు. తిహార్ జైళ్లో తనను చిత్రహింసలు పెట్టారని, దాంతో తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఈ విషయాన్ని క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు పెట్టుకున్న పిటిషన్లో వినయ్ శర్మ పేర్కొన్నారు. జైళ్లో చిత్రహింసల కారణంగా మానసిక అనారోగ్యానికి గురయ్యా నని స్పష్టం చేసే అన్ని పత్రాలను రాష్ట్రపతి దృష్టికి కేంద్రం తీసుకువెళ్లలేదని ఆ పిటిషన్లో శర్మ ఆరోపించారు. అయితే, వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. డెత్ వారెంట్ జారీ చేయొచ్చు: నిర్భయ దోషులకు వేర్వేరు రోజుల్లో ఉరిశిక్ష విధించేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని తాజాగా డెత్ వారెంట్లను ట్రయల్ కోర్టు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, నలుగురు దోషుల్లో పవన్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోలేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. 17న ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభించే సమయానికి, పవన్ క్యూరేటివ్ పిటిషన్ వేస్తాడన్నారు. ఇక పవన్ వంతు.. నలుగురు దోషుల్లో.. పవన్ గుప్తా ఇంకా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయలేదు. పవన్‌కు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం కూడా ఉంది. కాగా, తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్షయ్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను కూడా రాష్ట్రపతి కొట్టేశారు. స్పృహ కోల్పోయిన జస్టిస్ భానుమతి నిర్భయ’ దోషులను వేర్వేరు రోజుల్లో ఉరి తీసేందుకు అనుమతించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ భానుమతి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కాసేపటికి మళ్లీ స్పృహలోకి వచ్చారు. వెంటనే ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ఆమెను తన చాంబర్లోకి తీసుకువెళ్లారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించారు. జస్టిస్ భానుమతి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడినుంచి గ్రహించారు?
1. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏ చట్టం ద్వారా కేటాయించారు? 1) 1909 మింటోమార్లే సంస్కరణల చట్టం 2) 1919 మాంటెంగ్ చెమ్స్పార్డ్ సంస్కరణల చట్టం 3) 1935 భారత ప్రభుత్వ చట్టం 4) ప్రజా ప్రాతినిధ్య చట్టం 2. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? 1) 13-12-1947 2) 15-8-1947 3) 26-11-1949 4) 26-1-1950 3. సరైన వాక్యం ఏది? 1) రాజ్యాంగ రచనా సంఘం-బి.ఆర్ అంబేద్కర్ 2) ప్రాథమిక హక్కుల సంఘం-సర్దార్ పటేల్ 3)కేంద్ర వ్యవహారాల సంఘం-జవహర్లాల్ నెహ్రూ 4) పైవన్నీ 4. ఉమ్మడి జాబితాను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? 1) అమెరికా 2) ఆస్ట్రేలియా 3) కెనడా 4) ఐర్లాండ్ 5. రాజ్యాంగ పీఠికలో 42 వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా చేర్చిన పదాలు? 1) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర 2) సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర 3) సామ్యవాద, లౌకిక, సమగ్రత 4) పైవేవీ కాదు 6. సరికాని వాక్యం ఏది? 1) ప్రకరణ-17: అంటరానితనం నిషేధం 2) ప్రకరణ-24: బాలకార్మికుల నిషేధం 3) ప్రకరణ-25: మత స్వేచ్ఛ 4) ప్రకరణ-22: వెట్టి చాకిరి నిషేధం 7. {పభుత్వ ఉద్యోగిని లేదా ప్రభుత్వ సంస్థను తన విధిని నిర్వర్తించాలంటూ జారీచేసే ఆజ్ఞ ఏది? 1) హెబియస్ కార్పస్ 2) మాండమస్ 3) సెర్షియోరరి 4) కోవారెంటో 8. సంక్షేమ రాజ్య నిర్మాణానికి తోడ్పడేవి ఏవి? 1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక విధులు 3) నిర్దేశిక నియమాలు 4) పైవేవీ కావు 9. ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తోడ్పడిన అధికరణం? 1) అధికరణం-47 2 అధికరణం-48 3) అధికరణం-44 4) అధికరణం-41 10. {పస్తుతం రాజ్యాంగంలో ఉన్న విధుల సంఖ్య? 1) 6 2) 7 3) 10 4) 11 11. రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’ సభ్యులు ఎవరు? 1) పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు 2) పార్లమెంటు మొత్తం సభ్యులు 3) పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాల విధాన సభల సభ్యులు 4) పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విధాన సభ సభ్యులు 12. సరైన వాక్యం కానిది ఏది? 1) తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినది-జాకీర్ హుస్సేన్ 2) ఎక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినది-రాజేంద్ర ప్రసాద్ 3) ఏకగ్రీవంగా రాష్ర్టపతిగా ఎన్నికైంది-నీలం సంజీవరెడ్డి 4) పైవన్నీ 13. రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి పంపిస్తారు? 1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2) ఉప రాష్ట్రపతికి 3) ప్రధానమంత్రికి 4) అటార్నీ జనరల్‌కు 14. రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి చెప్పే ఆర్టికల్? 1) 352 2) 356 3) 368 4) 370 15. కింది వానిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు? 1) రాష్ట్ర గవర్నర్లు 2) త్రివిధ దళాధిపతులు 3) ఎన్నికల క మిషనర్లు 4) భారత దేశంలో పనిచేసే విదేశీ రాయబారులు 16. {పస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఎన్నో ఉప రాష్ట్రపతి? 1) 11వ 2) 12వ 3) 13వ 4) 14వ 17. {పధాన మంత్రిగా తక్కువ కాలం పనిచేసిన వారు? 1) వి.పి సింగ్ 2) చరణ్ సింగ్ 3) దేవెగౌడ 4) అటల్ బిహరీ వాజ్పాయ్ 18. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ప్రధాని ఎవరు? 1) జవహర్ లాల్ నెహ్రూ 2) మొరార్జీ దేశాయ్ 3) వి.పి సింగ్ 4) అటల్ బిహరీ వాజ్పాయ్ 19. భారత దేశంలో అత్యున్నత న్యాయాధికారి? 1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2) కేంద్ర న్యాయ శాఖామంత్రి 3) ‘లా’కమిషన్ చైర్మన్ 4) అటార్నీజనరల్ 20. కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య? 1) పార్లమెంటు సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించరాదు 2) లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించరాదు 3) పార్లమెంటు సభ్యుల సంఖ్యలో 20 శాతానికి మించరాదు 4) పరిమితి లేదు 21. మంత్రి మండలి సమష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? 1) ప్రధాన మంత్రి 2) రాష్ట్రపతి 3) పార్లమెంటు 4) లోక్‌సభ 22. లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఎన్ని స్థానాలు కేటాయించారు? 1) 79, 41 2) 84, 47 3) 80, 40 4) 84, 44 23. తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు సంఖ్య? 1) 7, 11 2) 8, 17 3) 7, 17 4) 9, 18 24. రాజ్యసభ కాల పరిమితి? 1) 2 ఏళ్లు 2) 5 ఏళ్లు 3) 6 ఏళ్లు 4) పైవేవీ కావు 25. పార్లమెంటు ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవ రు? 1) రాష్ట్రపతి 2) ఉప రాష్ట్రపతి 3) స్పీకర్ 4) రాజ్యసభ డిప్యూటీ స్పీక ర్ 26. సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఎవరికి ఉంటుంది? 1) లోక్‌సభ స్పీకర్ 2) రాజ్యసభ చైర్మన్ 3) విధాన సభ స్పీకర్ 4) విధాన పరిషత్ చైర్మన్ 27. పార్లమెంటులో అతి ప్రాచీనమైన కమిటీ ఏది? 1) ప్రభుత్వ ఖాతాల సంఘం 2) ప్రభుత్వ అంచనాల సంఘం 3) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం 4) జీత భత్యాలపై కమిటీ 28. రాష్ట్రపతితో ఎంత మంది సభ్యులు రాజ్యసభకు ఎంపికవుతారు? 1) 14 2) 12 3) 2 4) పైవేవీ కావు 29. రాజ్యసభ ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు? 1) కృష్ణమూర్తి 2) తంబిదొరై 3) హమీద్ అన్సారీ 4) పీజే కురియన్ 30. పదవిలో కొనసాగుతూ చనిపోయిన ఏకైక ఉప రాష్ర్టపతి ఎవరు? 1) జాకీర్ హుస్సేన్ 2) గోపాల్ స్వరూప్ పాఠక్ 3) కృష్ణకాంత్ 4) వి.వి. గిరి 31. భారత ప్రధాన మంత్రి? 1) ప్రత్యక్షంగా ఎన్నిక కాలేడు 2) పరోక్షంగా ఎన్నిక కాలేడు 3) రాష్ట్రపతి నియమిస్తారు 4) స్పీకర్ నియమిస్తారు 32. న్యాయ శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు? 1) రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ 2) ప్రాథమిక హక్కుల పరిరక్షణ 3) కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం 4) పైవన్నీ 33. న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడినుంచి గ్రహించారు? 1) అమెరికా 2) బ్రిటన్ 3) ఫ్రాన్స్ 4) కెనడా 34. భారత సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 1) ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు 2) ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు 3) ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు న్యాయమూర్తులు 4) ప్రధాన న్యాయమూర్తి, ముఫ్పై మంది న్యాయమూర్తులు 35. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 1) 4 ఏళ్లు 2) 5 ఏళ్లు 3) 6ఏళు 4) పైవేవి కావు 36. సరికాని వ్యాక్యం ఏది? 1) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి -హెచ్.జె కానియా 2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగువాడు- కె.సుబ్బారావు 3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పని చేసిన వారు-నాగేంద్ర సింగ్ 4) సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-ఫాతిమా బీబీ 37. ఏ అధికరణం కింద రాష్ట్రపతి రాజ్యాంగ పరమైన సమస్య ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు? 1) 72 2) 61 3) 123 4) 143 38. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను అవసరాన్ని బట్టి పెంచే అధికారం ఎవరికి ఉంది? 1) రాష్ట్రపతి 2) పార్లమెంటు 3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 4) న్యాయ శాఖ మంత్రి 39. న్యాయ సమీక్ష ద్వారా? 1) ప్రాథమిక హక్కులను కాపాడవచ్చు 2) రాజ్యాంగ ఆధిక్యతను పరిరక్షించవచ్చు 3) శాసన, కార్యనిర్వాహక శాఖల ఆధిపత్యాన్ని నియంత్రించవచ్చు 4) పైవ న్నీ 40. గవర్నర్ పదవీ కాలం ఎంత? 1) 5 ఏళ్లు 2) 6 ఏళ్లు 3) రాష్ర్టపతి విశ్వాసం ఉన్నంత వరకు 4) పైవన్నీ 41. కింది వాటిలో సరైనది? 1) గవర్నర్ పదవి చేపట్టిన మొదటి మహిళ సరోజినీ నాయుడు 2) ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ శారద ముఖర్జీ 3) గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగువాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 4) పైవన్నీ 42. గవర్నర్‌గా నియమించేందుకు ఉండాల్సిన కనీస వయసు ఎంత? 1) 21 ఏళ్లు 2) 25 ఏళ్లు 3) 30 ఏళ్లు 4) 35 ఏళ్లు 43. కింది వానిలో ఎవరిని నియమించే అధికారం గవర్నర్‌కు లేదు? 1) హైకోర్టు న్యాయమూర్తులు 2) మానవ హక్కుల కమిషన్ చైర్మన్ 3) ఎన్నికల కమిషనర్ 4) వైస్ ఛాన్సలర్స్ 44. కింది వానిలో సరికాని వ్యాక్యం? 1) ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు 2) హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బి. రామకృష్ణారావు 3) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది చంద్రబాబు నాయుడు 4) శాసన సభలో సభ్యత్వం లేకుండా ముఖ్యమంత్రి అయింది కె.రోశయ్య 45. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు? 1) టంగుటూరి అంజయ్య 2) దామోదర సంజీవయ్య 3) నాదెండ్ల భాస్కర్‌రావు 4) భవనం వెంట్రామిరెడ్డి 46. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి మహిళ ఎవరు? 1) షనోదేవి 2) సుచేత కృపలాని 3) సరోజినీ నాయుడు 4) జయలలిత 47. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? 1) నీలం సంజీవరెడ్డి 2) కె.వి.రంగారెడ్డి 3) దామోదర సంజీవయ్య 4) బెజవాడ గోపాల్‌రెడ్డి 48. విధాన పరిషత్ లేని రాష్ట్రం? 1) మధ్యప్రదేశ్ 2) మహారాష్ట్ర 3) బీహార్ 4) కర్ణాటక సమాధానాలు 1) 1 2) 3 3) 4 4) 2 5) 3 6) 4 7) 2 8) 3 9) 2 10) 4 11) 4 12) 4 13) 2 14) 2 15) 4 16) 2 17) 2 18) 2 19) 4 20) 2 21) 4 22) 2 23) 3 24) 4 25) 3 26) 2 27) 1 28) 2 29) 4 30) 3 31) 3 32) 4 33) 1 34) 2 35) 2 36) 4 37) 4 38) 2 39) 4 40) 3 41) 4 42) 4 43) 1 44) 4 45) 3 46) 2 47) 2 48) 1