న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడినుంచి గ్రహించారు? | న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడినుంచి గ్రహించారు? | Sakshi
Sakshi News home page

న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడినుంచి గ్రహించారు?

Published Thu, May 14 2015 5:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడినుంచి గ్రహించారు?

 1.    ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏ చట్టం ద్వారా కేటాయించారు?
     1) 1909 మింటోమార్లే సంస్కరణల చట్టం
     2) 1919 మాంటెంగ్ చెమ్స్‌పార్డ్ సంస్కరణల చట్టం
     3) 1935 భారత ప్రభుత్వ చట్టం
     4) ప్రజా ప్రాతినిధ్య చట్టం
 
 2.    రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది?
     1) 13-12-1947    2) 15-8-1947
     3) 26-11-1949    4) 26-1-1950
 
 3.    సరైన వాక్యం ఏది?
     1) రాజ్యాంగ రచనా సంఘం-బి.ఆర్ అంబేద్కర్
     2) ప్రాథమిక హక్కుల సంఘం-సర్దార్ పటేల్
     3)కేంద్ర వ్యవహారాల సంఘం-జవహర్‌లాల్ నెహ్రూ
     4) పైవన్నీ
 
 4.    ఉమ్మడి జాబితాను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
     1) అమెరికా    2) ఆస్ట్రేలియా
     3) కెనడా        4) ఐర్లాండ్
 
 5.    రాజ్యాంగ పీఠికలో 42 వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా చేర్చిన పదాలు?
     1) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర
     2) సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర
     3) సామ్యవాద, లౌకిక, సమగ్రత
     4) పైవేవీ కాదు
 
 6.    సరికాని వాక్యం ఏది?
     1) ప్రకరణ-17: అంటరానితనం నిషేధం
     2) ప్రకరణ-24: బాలకార్మికుల నిషేధం
     3) ప్రకరణ-25: మత స్వేచ్ఛ
     4) ప్రకరణ-22: వెట్టి చాకిరి నిషేధం
 
 7.    {పభుత్వ ఉద్యోగిని లేదా ప్రభుత్వ సంస్థను తన విధిని నిర్వర్తించాలంటూ జారీచేసే ఆజ్ఞ ఏది?
     1) హెబియస్ కార్పస్
     2) మాండమస్    3) సెర్షియోరరి
     4) కోవారెంటో
 
 8.    సంక్షేమ రాజ్య నిర్మాణానికి తోడ్పడేవి ఏవి?
     1) ప్రాథమిక హక్కులు    2) ప్రాథమిక విధులు
     3) నిర్దేశిక నియమాలు    4) పైవేవీ కావు
 
 9.    ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తోడ్పడిన అధికరణం?
     1) అధికరణం-47    2 అధికరణం-48
     3) అధికరణం-44    4) అధికరణం-41
 
 10.    {పస్తుతం రాజ్యాంగంలో ఉన్న విధుల సంఖ్య?
     1) 6    2) 7    3) 10    4) 11
 
 11.    రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’ సభ్యులు ఎవరు?
     1) పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు
     2) పార్లమెంటు మొత్తం సభ్యులు
     3) పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాల విధాన సభల సభ్యులు
     4) పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విధాన సభ సభ్యులు
 
 12.    సరైన వాక్యం కానిది ఏది?
     1) తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినది-జాకీర్ హుస్సేన్
     2) ఎక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినది-రాజేంద్ర ప్రసాద్
     3) ఏకగ్రీవంగా రాష్ర్టపతిగా ఎన్నికైంది-నీలం సంజీవరెడ్డి
     4) పైవన్నీ
 
 13.    రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి పంపిస్తారు?
     1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి
     2) ఉప రాష్ట్రపతికి    3) ప్రధానమంత్రికి
     4) అటార్నీ జనరల్‌కు
 
 14.    రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి చెప్పే ఆర్టికల్?
     1) 352    2) 356    3) 368    4) 370
 15.    కింది వానిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు?
     1) రాష్ట్ర గవర్నర్‌లు    2) త్రివిధ దళాధిపతులు
     3) ఎన్నికల క మిషనర్లు
     4) భారత దేశంలో పనిచేసే విదేశీ రాయబారులు
 
 16.    {పస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఎన్నో ఉప రాష్ట్రపతి?
     1) 11వ    2) 12వ    3) 13వ    4) 14వ
 
 17.    {పధాన మంత్రిగా తక్కువ కాలం పనిచేసిన వారు?
     1) వి.పి సింగ్    2) చరణ్ సింగ్
     3) దేవెగౌడ    4) అటల్ బిహరీ వాజ్‌పాయ్
 
 18.    సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ప్రధాని ఎవరు?
     1) జవహర్ లాల్ నెహ్రూ
     2) మొరార్జీ దేశాయ్    3) వి.పి సింగ్
     4) అటల్ బిహరీ వాజ్‌పాయ్
 
 19.    భారత దేశంలో అత్యున్నత న్యాయాధికారి?
     1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
     2) కేంద్ర న్యాయ శాఖామంత్రి
     3) ‘లా’కమిషన్ చైర్మన్
     4) అటార్నీజనరల్
 
 20.    కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య?
     1) పార్లమెంటు సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించరాదు
     2) లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించరాదు
     3) పార్లమెంటు సభ్యుల సంఖ్యలో 20 శాతానికి మించరాదు
     4) పరిమితి లేదు
 
 21.    మంత్రి మండలి సమష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
     1) ప్రధాన మంత్రి    2) రాష్ట్రపతి
     3) పార్లమెంటు    4) లోక్‌సభ
 
 22.    లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఎన్ని స్థానాలు కేటాయించారు?
     1) 79, 41        2) 84, 47
     3) 80, 40        4) 84, 44
 
 23.    తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు సంఖ్య?
     1) 7, 11        2) 8, 17
     3) 7, 17        4) 9, 18
 
 24.    రాజ్యసభ కాల పరిమితి?
     1) 2 ఏళ్లు        2) 5 ఏళ్లు
     3) 6 ఏళ్లు        4) పైవేవీ కావు
 
 25.    పార్లమెంటు ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవ రు?
     1) రాష్ట్రపతి        2) ఉప రాష్ట్రపతి
     3) స్పీకర్    4) రాజ్యసభ డిప్యూటీ స్పీక ర్
 
 26.    సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఎవరికి ఉంటుంది?
     1) లోక్‌సభ స్పీకర్    2) రాజ్యసభ చైర్మన్
     3) విధాన సభ స్పీకర్    4) విధాన పరిషత్ చైర్మన్
 
 27.    పార్లమెంటులో అతి ప్రాచీనమైన కమిటీ ఏది?
     1) ప్రభుత్వ ఖాతాల సంఘం
     2) ప్రభుత్వ అంచనాల సంఘం
     3) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
     4) జీత భత్యాలపై కమిటీ
 
 28.    రాష్ట్రపతితో ఎంత మంది సభ్యులు రాజ్యసభకు ఎంపికవుతారు?
     1) 14    2) 12    3) 2    4) పైవేవీ కావు
 
 29.    రాజ్యసభ ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు?
     1) కృష్ణమూర్తి    2) తంబిదొరై
     3) హమీద్ అన్సారీ    4) పీజే కురియన్
 
 30.    పదవిలో కొనసాగుతూ చనిపోయిన ఏకైక ఉప రాష్ర్టపతి ఎవరు?
     1) జాకీర్ హుస్సేన్    2) గోపాల్ స్వరూప్ పాఠక్
 
     3) కృష్ణకాంత్    4) వి.వి. గిరి
 31.    భారత ప్రధాన మంత్రి?
     1) ప్రత్యక్షంగా ఎన్నిక కాలేడు
     2) పరోక్షంగా ఎన్నిక కాలేడు
     3) రాష్ట్రపతి నియమిస్తారు
     4) స్పీకర్ నియమిస్తారు
 
 32.    న్యాయ శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు?
     1) రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ
     2) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
     3) కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
     4) పైవన్నీ
 
 33.    న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడినుంచి గ్రహించారు?
     1) అమెరికా    2) బ్రిటన్
     3) ఫ్రాన్స్        4) కెనడా
 
 34.    భారత సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
     1) ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు
     2) ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు
     3) ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు న్యాయమూర్తులు
     4) ప్రధాన న్యాయమూర్తి, ముఫ్పై మంది న్యాయమూర్తులు
 
 35.    సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత?
     1) 4 ఏళ్లు        2) 5 ఏళ్లు
     3) 6ఏళు        4) పైవేవి కావు
 
 36.    సరికాని వ్యాక్యం ఏది?
     1) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి -హెచ్.జె కానియా
     2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగువాడు- కె.సుబ్బారావు
     3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పని చేసిన వారు-నాగేంద్ర సింగ్
     4) సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-ఫాతిమా బీబీ
 
 37.    ఏ అధికరణం కింద రాష్ట్రపతి రాజ్యాంగ పరమైన సమస్య ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు?
     1) 72     2) 61    3) 123    4) 143
 
 38.    సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను అవసరాన్ని బట్టి పెంచే అధికారం ఎవరికి ఉంది?
     1) రాష్ట్రపతి        2) పార్లమెంటు
     3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
     4) న్యాయ శాఖ మంత్రి
 
 39.    న్యాయ సమీక్ష ద్వారా?
     1) ప్రాథమిక హక్కులను కాపాడవచ్చు
     2) రాజ్యాంగ ఆధిక్యతను పరిరక్షించవచ్చు
     3) శాసన, కార్యనిర్వాహక శాఖల ఆధిపత్యాన్ని నియంత్రించవచ్చు
     4) పైవ న్నీ
 
 40.    గవర్నర్ పదవీ కాలం ఎంత?
     1) 5 ఏళ్లు        2) 6 ఏళ్లు
     3) రాష్ర్టపతి విశ్వాసం ఉన్నంత వరకు
     4) పైవన్నీ
 
 41.    కింది వాటిలో సరైనది?
     1) గవర్నర్ పదవి చేపట్టిన మొదటి మహిళ సరోజినీ నాయుడు
     2) ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ శారద ముఖర్జీ
     3) గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగువాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య
     4) పైవన్నీ
 
 42.    గవర్నర్‌గా నియమించేందుకు ఉండాల్సిన కనీస వయసు ఎంత?
     1) 21 ఏళ్లు        2) 25 ఏళ్లు
     3) 30 ఏళ్లు        4) 35 ఏళ్లు
 
 43.    కింది వానిలో ఎవరిని నియమించే అధికారం గవర్నర్‌కు లేదు?
     1) హైకోర్టు న్యాయమూర్తులు
     2) మానవ హక్కుల కమిషన్ చైర్మన్
     3) ఎన్నికల కమిషనర్
     4) వైస్ ఛాన్సలర్స్
 
 44.    కింది వానిలో సరికాని వ్యాక్యం?
     1) ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు
     2) హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బి. రామకృష్ణారావు
     3) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది చంద్రబాబు నాయుడు
     4) శాసన సభలో సభ్యత్వం లేకుండా ముఖ్యమంత్రి అయింది కె.రోశయ్య
 
 45.    ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసింది ఎవరు?
     1) టంగుటూరి అంజయ్య
     2) దామోదర సంజీవయ్య
     3) నాదెండ్ల భాస్కర్‌రావు
     4) భవనం వెంట్రామిరెడ్డి
 
 46.    ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి మహిళ ఎవరు?
     1) షనోదేవి        2) సుచేత కృపలాని
     3) సరోజినీ నాయుడు    4) జయలలిత
 47.    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు?
     1) నీలం సంజీవరెడ్డి    2) కె.వి.రంగారెడ్డి
     3) దామోదర సంజీవయ్య
     4) బెజవాడ గోపాల్‌రెడ్డి
 
 48.    విధాన పరిషత్ లేని రాష్ట్రం?
     1) మధ్యప్రదేశ్    2) మహారాష్ట్ర
     3) బీహార్        4) కర్ణాటక
 
 సమాధానాలు
 1) 1    2) 3    3) 4    4) 2    5) 3
 6) 4    7) 2    8) 3    9) 2    10) 4
 11) 4    12) 4    13) 2    14) 2    15) 4
 16) 2    17) 2    18) 2    19) 4    20) 2
 21) 4    22) 2    23) 3    24) 4    25) 3
 26) 2    27) 1    28) 2    29) 4    30) 3
 31) 3    32) 4    33) 1    34) 2    35) 2
 36) 4    37) 4    38) 2    39) 4    40) 3
 41) 4    42) 4    43) 1    44) 4    45) 3
 46) 2    47) 2    48) 1
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement