Jugaad
-
పిల్లలకు ఒత్తులు, దీర్ఘాలు నేర్పేందుకు.. ‘ఏం ఐడియారా బాబూ’ అంటున్న జనం!
నగరాల్లోని స్కూళ్లు హైటెక్గా మరిపోయాయి. గ్రామాల్లోని స్కూళ్లు ఇంకా ఆధునికతను సంతరించుకోలేదు. అయితే గ్రామీణ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అవసరమైన సులభ పద్ధతులను ఆవిష్కరించడంలో అక్కడి ఉపాధ్యాయులు ముందుంటున్నారనే పలు ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. పాటల రూపంలో చిన్నారులకు ఏబీసీడీలు నేర్పడం, పాఠాలు బోధించడం వంటివి చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక విద్యార్థి చేతితో ఒక కర్రపట్టుకుని కనిపిస్తాడు. ఆ కర్రకు పైభాగాన హిందీలో ‘క’ అనే అక్షరం రాసివుంటుంది. మరోవైపు బ్లాక్బోర్డుపై దీర్ఘాలు, ఒత్తులు రాసివుంటాయి. ఆ విద్యార్థి ‘క’ అక్షరాన్ని ప్రతీ దీర్ఘం, ఒత్తు ముందు చూపిస్తూ, దానిని ఉచ్ఛరిస్తుంటాడు. అనంతరం క్లాసులోని మిగిలిన విద్యార్థులు ఆ అక్షరాన్ని ఉచ్ఛరిస్తుంటారు. ఈ వీడియో రికార్డు స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో @Ankitydv92 పేరుగ గల అకౌంట్లో జూలై 27న షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 4 లక్షలకు మించిన వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్ దీనిని అద్భుతమైన క్రియేటివిటీ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: చేతులతో మలం ఎత్తుతూ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారంటే..? बढ़िया जुगड़ सेट किए हैं गुरु जी... प्रणाम 🙏 pic.twitter.com/Szh1Wb94kb — Ankit Yadav Bojha (@Ankitydv92) July 27, 2023 -
పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!!
ఒక బైకుపై ఆరుగురు వ్యక్తులు ఒకరిని ఒకరు అంటకుండా వెళ్లడం సాధ్యమా? ఫజిల్లా ఉందే.. ఇదేలా సాధ్యమౌతుంది.. ఇదేనా మీ సమాధానం. ఐతే ఈ వీడియో వైపు ఓ లుక్కెయ్యండి. బైకుకు వెనక భాగంలో ఒక నెచ్చెన కట్టి, దానికి రెండు టైర్లు అమర్చారు. బైకు నడిపే వ్యక్తి కాకుండా ఇంకా ఐదుగురు, వారి లగేజీలతోసహా ఆ నిచ్చెనపై హాయిగా కూర్చున్నారు. ఇంతమంది కూర్చోగా ఇంకా కావల్సినంత స్థలం మిగిలి ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డుపై వేరే వెహికల్లో ప్రయాణించే వారు ఈ సన్నివేశాన్ని రికార్డు చేశారు. దీనికి సంబంధించిన ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. ఒకే పనిని ఎప్పుడూ ఒకేలా ఎందుకు చెయ్యాలి.. ఇలా కూడా చేయొచ్చని వీళ్లు నిరూపించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ రేట్ల దృష్ట్యా ఐడియా అదుర్స్ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఐడియా భలే ఉందిగానీ, సేఫ్టి చూసుకోండి గురూ అని మరికొందరు సూచిస్తున్నారు. పాపం ట్రాఫిక్ పోలీసుల కంటబడితే వీళ్ల పరిస్థితి ఏంటో అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. View this post on Instagram A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde) -
బాధితులకు సృజనాత్మక సహాయం!
మనసుంటే మార్గం దొరుకుతుందంటారు. తమిళనాడులో వర్షం, వరద బాధితులను జనం ఆదుకుంటున్న తీరు చూస్తే సరిగ్గా అదే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతి త్వరగా బాధితులను ఎలా ఆదుకోవచ్చన్న విషయాన్ని ఆలోచించి ఆ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. కొందరు డబ్బు, ఆహారం వంటివి అందిస్తుంటే...మరి కొందరు ఉడతాభక్తిగా తమ సృజనను ఉపయోగించి, స్వచ్ఛందంగా సహాయపడుతున్నారు. వరద ముప్పు నుంచి బాధితులను ఒడ్డున పడేయడమే కాక... సౌకర్యాలను కల్పించి ఆదుకుంటున్నారు. ఇళ్ళలోసైతం నీరు చేరిన పరిస్థితుల్లో వారిని బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం, ఇతర సంస్థలు పడవలను అందుబాటులోకి తెచ్చినా... అవి లేని ప్రాంతాల్లో స్థానికంగా, సులభంగా దొరికే డ్రమ్ములు, వెదురు కర్రలను వినియోగించి కొందరు సాయపడుతున్నారు. ఇళ్లు కూలి ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకోడానికి వారికి వెదురుతో గుడిసెలు కట్టి పునరావాసం కల్పిస్తున్నారు. గూడు కోల్పోయి రోడ్డున పడ్డవారికి 'సేలం సిటిజెన్స్ ఫోరమ్' ఈ వెదురు ఇళ్లను అందుబాటులోకి తెస్తోంది. 96 చదరపు అడుగుల వైశాల్యం, సోలార్ లైట్లతో నిర్మించే ఈ ఇంట్లో నలుగురు నివాసం ఉండొచ్చు. అలాగే కరెంటు అందుబాటులో లేని ప్రదేశాల్లో.. ఛార్జింగ్ చేసుకునే అవకాశం లేక మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా ఛార్జింగ్ చేసేందుకు కొందరు తమ సృజనను వినియోగిస్తున్నారు. సిల్వర్ నాణేలు, బ్యాటరీలు అందుబాటులోకి తెచ్చి మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నారు. అలాగే చీకట్లో దీపాలుగా కొవ్వొత్తులకు బదులు క్రేయాన్స్ స్టిక్స్ ను అందిస్తున్నారు. ఇవి కనీసం ఇరవై నిమిషాలపాటు నిలకడగా వెలగడంతో బాధితులకు తక్షణ అవసరం తీరుతోంది. మరోవైపు వరద కారణంగా ఎటువంటి ఇన్ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ముందుజాగ్రత్తగా ఔషధ మూలికలు, ఆకులతో తయారుచేసిన సిద్ధ వైద్యానికి సంబంధించిన నీలవెంబు కషాయాన్నిబాధితులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక బ్యాంకుల్లో బ్యాలెన్సులున్నా డబ్బు తీసుకునేందుకు ఏటీఎంలు పనిచేయక ఇబ్బందులు పడుతున్న వారి కోసం కొన్ని బ్యాంకులు మొబైల్ ఏటీఎంలను ఏర్పాటుచేశాయి. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతూ అవసరానికి డబ్బును అందిస్తున్నాయి.