భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా జూకంటి
సిరిసిల్ల : అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా జూకంటి జగన్నాథం ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ముంబయికి చెందిన సంగెవేని రవీంద్ర ఎన్నికైనట్లు రచయితల వేదిక ఆదివారం ప్రకటించింది. ఇప్పటివరకు అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా డాక్టర్ నలిమెల భాస్కర్, కార్యదర్శిగా మచ్చ ప్రభాకర్ కొనసాగారు. సిరిసిల్లకు చెందిన జగన్నాథం గతంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం అఖిలభారత స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోని తెలంగాణ రచయితలను ఒకవేదిక మీదకు తెచ్చేందుకు జూకంటి జగన్నాథం కృషి చేయనున్నారు.