july 31st
-
ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదా? లేదంటే కత వేరుంటది!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ ( ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ తప్పించుకోవడం మాత్రమే కాదు ఇతర బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా ఐటీ రిటర్స్ ఫైల్ చేస్తే వచ్చే లాభాలు, ఫైల్ చేయకపోతే వచ్చే నష్టాల గురించి ఒకసారి చూద్దాం. గడువు కంటే ముందే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలోని ప్రాముఖ్యత, ప్రయోజనాలు ♦ పన్ను చెల్లింపుదారులు ఏదైనా జరిమానా లేదా పెనాల్టీని నివారించడానికి గడువు ముగిసేలోపు ఐటీఆర్‌ను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాలి. ♦ ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వ్యక్తులు, ఉద్యోగుల ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ♦ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన వారికి గడువు అక్టోబర్ 31. పెనాల్టీ గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 10 వేల రూపాయల దాకా జరిమానా, ఇతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో జాప్యం జరిగితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 23ఘే కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా చెల్లించాలి. చట్టపరమైన చర్య ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు ఆలస్యమైనా లేదా డిఫాల్ట్ అయినా, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుంది. ఈ నోటీసులకు మనమిచ్చిన సమాధానంతో ఐటీ డిపార్ట్మెంట్ సంతృప్తి చెందకపోతే, ఏమైనా లోపాలు ఉన్నట్టు గమనిస్తే చట్టపరమైన కేసును కూడా ఎదుర్కోవాలి. రుణాలను పొందడం సులభం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్‌లో క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే, బ్యాంకులనుంచి రుణాలను పొందడం సులభమవుతుంది. లోన్లను అందించే సమయంలో ఆదాయానికి రుజువుగా ఐటీఆర్ స్టేట్మెంట్ కాపీని అందించాలని బ్యాంకులు కోరుతున్న సంగతి తెలిసిందే. సో.. అధికారిక రుణం కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ తప్పనిసరి. ఐటీఆర్ ఫైల్ చేయని వ్యక్తులు సంస్థాగత రుణదాతల నుండి రుణాలు పొందడం కష్టం కేరీ ఫార్వర్డ్ లాసెస్ గడువు తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నష్టాలను ఫార్వార్డ్ చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలు అనుమతిస్తాయి. ఇది పన్ను చెల్లింపు దారులు తమ భవిష్యత్ ఆదాయాలపై పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. త్వరగా వీసా కావాలంటే వీసాలను పొందే విషయంలో కూడా ఐటీఆర్ ఫైలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. త్వరగా వీసా పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్ ఫైలింగ్ క్రమం తప్పకుండా చేయాలి. వీసాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ హిస్టరీ సమర్పించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది. -
TS High Court: నెలాఖరు వరకు ఆన్లైన్లోనే విచారణ
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారానే కేసులను హైకోర్టు విచారించనుంది. అయితే కింది కోర్టుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో మినహా ఇతర అన్ని జిల్లా కోర్టుల్లో మాత్రం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ నెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఫుల్‌కోర్టు నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో 50 శాతం ఉద్యోగులే దశలవారీగా విధులకు హాజరుకావాలని ఆదేశించగా ఈ నెల 19 నుంచి 100 శాతం ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మహారాష్ట్రతో సరిహద్దులు ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కోర్టులు మాత్రం ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్ విచారణ కొనసాగించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ఈ నెల 19 నుంచి పాక్షికంగా విచారణ ప్రారంభించాలని ఆదేశించారు. గతేడాది మార్చి నెలాఖరు నుంచి హైకోర్టు న్యాయమూర్తులు ఆన్లైన్లోనే కేసులను విచారిస్తున్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టిన అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొందరు జడ్జీలు ఒక రోజు భౌతికంగా, మరోరోజు ఆన్లైన్లో కేసులను విచారించారు. మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో న్యాయమూర్తులంతా ఆన్లైన్ ద్వారానే కేసులను విచారిస్తున్నారు. -
31న ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ పరీక్షలు
జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ సంగారెడ్డి జోన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 31వ తేదిన నిర్వహించనున్న ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ తెలిపారు. కలెక్టరెట్లో శుక్రవారం రాత పరీక్ష నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 31న ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. సంగారెడ్డి, పటాన్చెరువు, రాంచంద్రపురంలో మొత్తం 34 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 14,609 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఆ రోజు ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా, మంచినీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైన గుర్తింపుకార్డును విధిగా తెచ్చుకోవాలన్నారు. ఎలక్ర్టానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యేవారు షూష్, జువెల్లరీ, ష్రగ్స్ ధరించకూడదన్నారు. పోలీసు బందోబస్తుతో పాటు ఇప్పటికే ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరెట్ పరిపాలనా అధికారి మహిపాల్‌రెడ్డి తదితరులున్నారు.