The Jungle Book
-
వనమంత మానవత్వం
‘మన మధ్యే పెరగినా వాడికీ జీవితం ఉండాలి. మనుషుల మధ్య జీవించాలి’ అని అడవిలోని జంతువులన్నీ అనుకున్నాయి.‘మీలోనే మనుషులు కనపడుతున్నారు. నాకు మీరే జీవితం’ అని అడవిలోనే ఉండిపోయాడు మోగ్లీ.వనమంత మానవత్వాన్ని మన కళ్లకు కట్టింది ‘ది జంగిల్ బుక్’. మీరు 90ల కాలం నాటి పిల్లలా? అయితే, జంగల్ బుక్ అని పేరు వినగానే మీ చెవుల్లో ఓ పాట సందడి చేస్తుండాలి. ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై పతా చలా హై... అరె చడ్డీ పెహన్‌కే ఫూల్ కిలాహై..’ అంటూ ఓ కుర్రాడు అటవీ జంతువులతో కలిసి చేసే విన్యాసాలూ కళ్ల ముందు మెదులుతూ ఉండాలి. ఆ విన్యాసాలను అప్పటి పిల్లలందరూ కళ్లప్పగించి చూశారు. ఇప్పటికీ కిడ్స్ చానెల్స్‌లో నాటి జంగిల్‌బుక్ వీరుడు మోగ్లీ అల్లరి చేస్తూనే ఉన్నాడు. 90 ల కాలంలో దూరదర్శన్‌లో ఏడాది పాటు వచ్చిన ఈ సీరియల్ అప్పటి పిల్లలకు ఓ మంచి ఫ్రెండ్ అయ్యింది. వన్యమృగాలున్న అడవిలో ఒంటరిగా ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడు అక్కడి జంతువుల్లో ఒకడిగా పెరగడం.. అబ్బురంగా చూశారు. ఆ అటవీ ప్రపంచంలో తామూ తిరిగారు. వన్యప్రాణులతో దోస్తీ కట్టారు. ఆటలు ఆడారు. పాటలు పాడారు. నాటి–నేటి పిల్లల ప్రియనేస్తం మోగ్లీని మరో మారు పరిచయం చేసుకుందాం. మొట్టమొదటి యానిమేషన్ సీరియల్ అప్పట్లో పిల్లల కోసం ప్రత్యేక ఛానళ్లేవీ లేవు. పిల్లల కోసం ప్రత్యేకించి ప్రోగ్రాములూ లేవు. అప్పుడొచ్చింది జంగిల్‌బుక్. దూరదర్శన్‌లో సోప్ సీరియల్స్ స్టార్ట్ అయిన తొమ్మిదేళ్లకు ఎంటర్ అయ్యింది ఈ యానిమేషన్ సీరియల్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పిల్లలతో పాటు పెద్దలనూ తన ముందు కూచోబెట్టింది. మూలం రడ్ యార్డ్ ఆంగ్ల రచయిత్ రడ్ యార్డ్ కిప్లింగ్ జంగిల్‌బుక్ సృష్టికర్త. రడ్యార్డ్ ఇండియాలో పుట్టి, ఇంగ్లండ్‌లో పెరిగిన వ్యక్తి. 1894లో ‘ది జంగిల్ బుక్’ రాశాడు. ఈ పుస్తకం ఆధారంగా మోగ్లీ స్టోరీస్‌ను వాల్ట్ yì స్నీ అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ పరిచయం చేసింది. 1989లో జపాన్‌లో మొదటిసారి వచ్చిన ఈ యానిమేషన్ సీరియల్ అదే సంవత్సరం హిందీ డబ్బింగ్‌తో మన దేశంలో ప్రసారమై ఎంతగానో ప్రాచుర్యం పొందింది. 52 ఎపిసోడ్లతో ఏడాది పాటు పెద్దలనూ, పిల్లలను అలరించింది ఈ సీరియల్. మోగ్లీ అనే పిల్లవాడి కథ చాలా చిన్నగా ఉన్నప్పుడు తల్లితండ్రి నుంచి తప్పిపోయి దట్టమైన అడవికి చేరుకుంటాడు మోగ్లీ. ఒకచోట పడి ఉన్న మోగ్లీని బగీరా అనే నల్ల పులి కనిపెడుతుంది. మోగ్లీని అకెలా, అలెగ్జాండర్ అనే తోడేళ్ల దగ్గరికి తీసుకెళ్తుంది బగీరా. అకేలాకి చిన్న చిన్నపిల్లలు ఉంటారు. తన పిల్లలతో పాటు మోగ్లీని కూడా పెంచుతుంటుంది. రోజూ తోడేలు పిల్లలతో ఆడుకుంటూ పెరుగుతుంటాడు మోగ్లీ. బగీరా అనే నల్ల పులి, బాలూ అనే ఎలుగుబంటి, కా అనే పైథాన్..లు మోగ్లీ స్నేహితులు. జంతువులతో ఆడుకుంటూ, జంతువుల మధ్య ఉండటంతో త్వరగానే అడవి జీవులతో కలిసిపోతాడు మోగ్లీ. ‘కా’ టీచర్‌గా మోగ్లీకి కొండలు, చెట్లు ఎక్కడం, ఊడలు పట్టుకొని ఊగడం.. వంటి ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇస్తుంది. ఒక రోజు అర్ధరాత్రి అడవిలోని జంతువులన్నీ గాఢనిద్రలోకి జారుకుంటాయి. రాత్రిపూట మనుషుల్ని తినే షేర్‌ఖాన్ అనే పులి అడవిలోకి చొరపడుతుంది. ముందుగానే పసిగట్టిన బగీరా మోగ్లీ గురించి ఆలోచిస్తుంది. అడవిలో ఉంచడం మంచిది కాదని, మనుషులున్న చోటుకు చేర్చాలని మోగ్లీని తీసుకొని బయల్దేరుతుంది. మోగ్లీని తినాలనే ప్రయత్నం చేస్తున్న షేర్‌ఖాన్ నుంచి బగీరా కాపాడుతుంది. ఒకానొక సమయంలో మోగ్లీకి అడవిలో గుర్తింపు సమస్య ఎదురవుతుంది. విలన్లయిన జంతువుల నుంచి ప్రమాదం ఉంటుందని, మనుషులు ఉన్న చోటుకి చేరుస్తామని మోగ్లీ స్నేహితులు చెబుతారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా అడవిలోనే ఉంటానంటాడు మోగ్లీ. అడవి జంతువులతోనే జీవిస్తుంటాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది ది జంగిల్‌బుక్. మోగ్లీ వయసు సుమారు 6 నుంచి 10 ఏళ్ల మధ్యన ఉంటుంది. అడవిలో ఎన్నో సాహసవిన్యాసాలు చేస్తుంటాడు. మోగ్లీ పనులు ఒక్కోసారి ఆలోచించేలా, మరోసారి నవ్వు తెప్పించేలా ఉంటాయి. జంతువుల పట్ల ప్రేమగా ఉంటాడు. ఇవన్నీ ఆ వయసు పిల్లలను బాగా కట్టిపడేశాయి. పెద్దలను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. కల్మషం లేని ప్రేమకు ముగ్దులవనిది ఎవరు. ఒక్క మన దేశంలోనే కాదు, ‘ది జంగిల్ బుక్’ ప్రపంచ దేశాల్లోని పిల్లలందరికీ పరిచయమే. -
రూ. 200 కోట్ల కలెక్షన్ల క్లబ్‌కు చేరువలో..
ముంబై: భారత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' అరుదైన రికార్డుకు చేరువవుతోంది. మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి హాలీవుడ్ చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించిన ఈ సినిమా.. 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన తొలి హాలీవుడ్ సినిమాగా మరో రికార్డు నెలకొల్పనుంది. భారత్‌లో ఈ సినిమాకు ఇప్పటివరకు 180 కోట్ల రూపాయల (నెట్) కలెక్షన్లు వచ్చాయి. ఏప్రిల్ 8న ఈ సినిమా దేశంలో విడుదలైంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలకు దీటుగా ప్రదర్శితమవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. -
ఆల్‌టైమ్ రికార్డు.. రూ. 240 కోట్లు కలెక్షన్లు
ముంబయి: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు 240 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూలు చేయగా, నెట్ కలెక్షన్లు 173 కోట్ల వరకు వచ్చాయి. సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. ఏప్రిల్ 8న ఈ సినిమా దేశంలో విడుదలైంది. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలకు దీటుగా ప్రదర్శితమవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. -
'బిగ్' బ్రదర్ ను ఆపగలరా?
‘ది జంగిల్ బుక్’ వసూళ్లు- ఇండియాలో ఇప్పటికే రూ. 150 కోట్లు దాటాయి. త్వరలో 200 కోట్లు దాటుతుందని అంచనా. ఇండియాలో ఇది15వ బిగ్గెస్ట్ గ్రాసర్ షారుఖ్ ‘ఫ్యాన్’ వసూళ్ళు- ఇండియాలో ఇప్పటికి రూ. 80 కోట్లే. నాగార్జున ‘ఊపిరి’ తెలుగు, తమిళాల్లో కలిపి వరల్డ్ వైడ్ ఇప్పటికి రూ. 50 కోట్ల పైగా షేర్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ వరల్డ్ వైడ్ ఇప్పటికి రూ. 50 కోట్ల పైగా షేర్ విజయ్ పోలీస్ (తేరి) ఇప్పటికి సుమారు రూ. 5 కోట్లు ఇరవై ఏళ్ళ క్రితం ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా రిలీజైనప్పుడు అమెరికా అన్నయ్య చూసి ఇండియాలో ఉన్న తమ్ముడికి కథ చెప్పాడు. అప్పుడు తమ్ముడనుకున్నాడు- ‘అన్నయ్య ఎంత అదృష్టవంతుడు. మనకంటే ముందే మంచి మంచి సినిమాలు చూసేస్తున్నాడు’ అని. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. హాలీవుడ్ సినిమాలు వారం, పదిహేను రోజుల ముందే ఇండియాలో రిలీజవుతున్నాయి. అంటే తమ్ముడు సినిమా చూసేసి, ‘బిగ్ బ్రదర్’ అమెరికాకి కథ చెప్తున్నా డన్న మాట. ఇది చాలా గ్రేట్ అనుకొని ఇండియా వాళ్లమంతా చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడే ‘బిగ్’ ట్విస్ట్. ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్‌ను కొల్లగొట్టడానికే ఈ వ్యూహం అంతా. అది అమెరికా బాబూ... ఏమైనా దోచేస్తుంది. ఈ సమ్మర్లో ఇండియాలో అతి పెద్ద హిట్ సినిమా ఏంటి? బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’? పోనీ, ఉత్తరాదిలోనూ రిలీజైన దక్షిణాది హీరో పవన్‌కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’? తమిళ ‘ఇళయ దళపతి’ (యూత్ స్టార్) విజయ్ నటించిన ‘తేరి’ (తెలుగులో ‘పోలీస్’)? ఇవేవీ కావు... ఈ సమ్మర్లో - ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది మొత్తం మీద - ఇప్పటి దాకా అతి పెద్ద హిట్ సినిమా ‘ది జంగిల్ బుక్’. ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళ, హిందీల్లో డబ్బింగై దేశవ్యాప్తంగా రిలీజైన ఈ హాలీవుడ్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విశేషం ఏమిటంటే - డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని హాలీవుడ్లో కన్నా వారం రోజుల ముందే ఇండియాలోని జనం ముందుకు తీసుకురావడం! గత చరిత్ర చూస్తే - అమెరికాలో రిలీజైన కొద్ది వారాల తరువాత కానీ హాలీవుడ్ సినిమాలు భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు వచ్చేవి కావు. కానీ, అంతర్జాతీయ బాక్సాఫీస్ పెరిగిపోవడంతో స్టూడియోలు ఇప్పుడు రెండు వేర్వేరు రిలీజ్ డేట్ల వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా, చైనా లాంటి మార్కెట్లలో దీన్ని స్పష్టంగా అనుసరిస్తున్నాయి. కొన్నేళ్ళుగా భారతీయ మార్కెట్‌పై కన్ను అమెరికాలో కన్నా ముందే ఇండియాలో కోట్ల కొద్దీ వసూళ్ళను తాజా ‘ది జంగిల్ బుక్’ కొల్లగొట్టింది. అయితే, అమెరికాలో కన్నా ముందే ఇక్కడ హాలీవుడ్ సినిమా రిలీజ్ అవడం ఇదే తొలిసారి కాదు. గమనిస్తే, ఇలా మన దగ్గరే ముందర రిలీజవుతున్న హాలీవుడ్ చిత్రాల సంఖ్య కొన్నేళ్ళుగా పెరుగుతూ వస్తోంది. ‘ది ఎవెంజర్స్’ సిరీస్‌లో మొట్టమొదటి పార్ట్‌ను 2012లో డిస్నీ సంస్థ అమెరికాలో కన్నా ముందే ఇండియాలో రిలీజ్ చేసింది. 2011 చివరలో రిలీజైన ‘మిషన్ ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రొటోకాల్’ సినిమా కోసమైతే హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తొలిసారిగా ఇండియాకు వచ్చారు. ముంబయ్‌లో స్పెషల్ ప్రమోషనల్ ప్రీమియర్ వేస్తే, దాదాపు 1500 మంది ఫ్యాన్స్‌తో కలసి చూడడానికి క్రూజ్ ముంబయ్‌కి వచ్చారు. అమెరికాలో కన్నా వారం రోజుల ముందే ఇక్కడ ఆ సినిమా రిలీజైంది. ఆ మధ్య వార్నర్ బ్రదర్స్ వారి ‘హాబిట్ 3’, ‘జర్నీ2- ది మిస్టీరియస్ ఐలండ్’, డిస్నీ సంస్థ తీసిన ‘ఎవెంజర్స్ - ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ఇంకొద్దిగా వెనక్కి వెళితే ‘ట్రాన్స్ఫార్మర్స్ - డార్క్ ఆఫ్ ది మూన్’, ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’, ఫాక్స్ స్టార్ వారి ‘క్రానికల్స్ ఆఫ్ నార్నియా - వాయేజ్ ఆఫ్ ది డాన్ ట్రీడర్’, యానిమేషన్ చిత్రం ‘రియో’ కూడా అమెరికా కన్నా ముందే భారత్‌కు వచ్చేశాయి! ‘ది ఎడ్వంచర్స్ ఆఫ్ టిన్టిన్ - ది సీక్రెట్ ఆఫ్ ది యూనికార్న్’ అయితే, అమెరికాలో కన్నా ఏకంగా ఆరు వారాల ముందు ఇక్కడ రిలీజైంది. మార్కెట్ లెక్కల్ని బట్టి మారుతున్న డేట్స్ ఇండియాలో సినిమాకు వెళ్ళడమనేది కుటుంబం, స్నేహితులు - అంతా కలసి బయటకెళ్ళి విహారంలా జరుపుకొనే పండగ లాంటిది. అందుకే, పిల్లల పరీక్షలు, బాలీవుడ్ భారీ రిలీజ్లు, సెలవులెప్పుడున్నాయి, క్రికెట్ లాంటి ఆటల పోటీలు ఎప్పుడున్నాయి లాంటి మార్కెట్ లెక్కలు కూడా హాలీవుడ్ చిత్రాల రిలీజ్ డేట్స్‌ను మార్చేస్తున్నాయి. ‘ది జంగిల్ బుక్’ కథ ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితం. ఏప్రిల్ మొదటి వారానికల్లా పిల్లల పరీక్షలు అయిపోతాయి కాబట్టి, వేసవి సెలవుల్లో వీలైనన్ని ఎక్కువ రోజుల్ని సొమ్ము చేసుకోవాలని ‘జంగిల్ బుక్’ సినిమాను అమెరికాలో కన్నా ముందే ఇక్కడ రిలీజ్ చేసేశారు. రానున్న ‘ఇన్ఫెర్నో’ సినిమా రెండు వారాల ముందే ఇండియన్ ఆడియన్స్‌ను పలకరించనుంది. టామ్ హాంక్స్, ఇర్ఫాన్ ఖాన్లు నటిస్తుంటే, అకాడెమీ అవార్డ్ గెలిచిన దర్శకుడు రాన్ హోవర్డ్ తీస్తున్న ‘ఇన్ఫెర్నో’ అమెరికా (రిలీజ్ రానున్న అక్టోబర్ 28) కన్నా రెండు వారాల ముందే అక్టోబర్ 14న ఇండియాలో రిలీజవుతోంది. ఇర్ఫాన్ ఖాన్ భారతీయ సంతతి వాడు కావడం అందుకు ఒక కారణం. కాగా, దీపావళికి వస్తున్న భారీ బాలీవుడ్ చిత్రాలతో పోరును తప్పించుకోవడానికి ముందే ‘ఇన్ఫెర్నో’ను రిలీజ్ చేయాలనుకోవడం రెండో కారణం. అయితే, హాలీవుడ్ సినిమాలన్నిటికీ ఇదే మంత్రం పనిచేయదు. కేవలం నూటికి 5 నుంచి 10 సినిమాలు మాత్రమే ఇలా ఇక్కడ ముందుగా రిలీజవుతున్నాయి. అయితే, హాలీవుడ్‌కు ఆనందదాయకమైన విషయం ఏమిటంటే - జేమ్స్ కామెరాన్ ‘అవతార్’ ఒకప్పుడు భారత్‌లో రూ. 145 కోట్ల మేర మొత్తం వసూలు చేస్తే అదో పెద్ద విషయం. కానీ, ఇవాళ ఇండియాలో వంద కోట్ల మార్కు దాటే హాలీవుడ్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే రూ. 150 కోట్లు దాటేసిన ‘జంగిల్ బుక్’ తాజా అంచనాల ప్రకారం మనదేశంలోనే ఈజీగా 200 కోట్ల మైలురాయి దాటనుంది. మన దేశ సినీ మార్కెట్లో ఇవాళ్టికీ స్థానిక సినిమాల వాటాయే ఎక్కువ (దాదాపు 90శాతం). కానీ, హాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తి ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతున్నట్లు నిపుణుల అంచనా. ఇన్ని సానుకూలతలున్నప్పుడు హాలీవుడ్ సినిమా మన దగ్గర ముందు రిలీజవడమే కాదు... కేవలం మనల్ని దృష్టిలో పెట్టుకొనే హాలీవుడ్ సినిమాలు తీసే రోజూ త్వరలోనే వస్తుందేమో! -
రికార్డు స్థాయిలో రూ. 148 కోట్ల కలెక్షన్లు
ముంబయి: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఏప్రిల్ 8న దేశంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 148 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సినిమా విడుదలై 20 రోజులు అవుతున్నా ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలతో పోటీని తట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. -
పిల్లల సినిమాకు రూ.132 కోట్ల కలెక్షన్లు
ముంబయి: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్లు రూ. 150 కోట్లకు చేరువవుతున్నాయి. మూడు వారాల్లో ఈ సినిమా రూ. 132.96 కోట్లు వసూలు చేసినట్టు సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మూడో వారాంతంలోనూ 'ది జంగిల్ బుక్' జోరు తగ్గలేదు. శుక్రవారం రూ.3.58 కోట్లు, శనివారం 6.65 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అక్షయ్ కుమార్ 'ఎయిర్ లిఫ్ట్' కలెక్షన్లను అధిగమించి హిందీలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ ప్రపంచవ్యాప్తంగానూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. -
ఓపెనింగ్ కలెక్షన్లు.. రూ. 680 కోట్లు
ముంబై: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. భారత్ కంటే ఆలస్యంగా నార్త్ అమెరికాలో విడుదలైన ఈ సినిమాకు 680 కోట్ల రూపాయల ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక భారత్‌లో ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా పది రోజుల్లో 100 కోట్ల మార్క్ దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1588 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా భారత్ సహా 15 దేశాల్లో 8వ తేదీ విడుదల కాగా, నార్త్ అమెరికాలో 15న విడుదలైంది. హాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు విశ్లేషకుల ప్రశంసలు, హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. యువకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీని.. జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. -
రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసింది
ముంబై: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' రికార్డు సృష్టిస్తోంది. భారత బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. పది రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్ల మార్క్ దాటింది. విడుదలైన తర్వాత రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. శుక్రవారం 8.02 కోట్లు, శనివారం 8.51 కోట్లు, ఆదివారం 10.67 కోట్ల రూపాయలను వసూలు చేసింది. పది రోజుల్లో 101.82 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలతో పోటీని తట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. ఏప్రిల్ 8న భారత్ లో ఈ సినిమా విడుదలైంది. -
ఇండియాలో రికార్డు బద్దలుకొడుతున్న ది జంగిల్ బుక్
ముంబయి: ఇండియన్ బాక్సాపీసు వద్ద హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' రికార్డు సృష్టిస్తోంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ వారం రోజుల్లో దాదాపు రూ.70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఎప్పుడో 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. మొత్తం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అడవిలో ఓ నల్లపిల్లికి దొరికిన పిల్లాడిని తిరిగి మనుషులతో జత చేసే క్రమంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలే ఈ జంగిల్ బుక్. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. ఒక్క గురువారమే ఈ చిత్రం దేశ వ్యాప్తంగా దాదాపు పది కోట్లు వసూలు చేసి మొత్తం వారం రోజుల వసూళ్లలో రూ.74.08 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 8న భారత్ లో ఈ సినిమా విడుదలైంది. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. -
త్వరలో... జంగిల్‌బుక్-2
అమెరికాలో రిలీజ్ కాక ముందే సంచలనం మన దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు నాట ఇప్పుడు జనమంతా చెప్పుకుంటున్న సినిమా - ‘ది జంగిల్ బుక్’. అమెరికాలో ఈ 15న రిలీజ్ కానున్న ఈ హాలీవుడ్ చిత్రం ఇక్కడ మాత్రం అంత కన్నా ఒక వారం ముందే మొన్న ఉగాది నాడు రిలీజైంది. 1967లో వాల్ట్‌డిస్నీ సంస్థ నుంచి కార్టూన్ యానిమేషన్ చిత్రంగా వచ్చి, బుల్లి, వెండితెరలపై ఆకట్టుకున్న ఈ కథ ఇప్పుడు అధునాతన లైవ్ యాక్షన్ -యానిమేషన్ (కంప్యూటర్ గ్రాఫిక్స్ హైబ్రిడ్) రూపంలో పిల్లల్నీ, వారితో పాటు పెద్దల్నీ ఆకర్షిస్తోంది. ఇంగ్లీష్‌లోని ఈ హాలీవుడ్ చిత్రం తాలూకు హిందీ, తెలుగు, తమిళ తదితర భారతీయ భాషా డబ్బింగ్‌లకు భారతీయ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మన దేశంలో దాదాపు 1700 థియేటర్లలోవిడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ళలో పెను సంచలనం. ఇప్పటికే రికార్డ్ కలెక్షన్స్! అమెరికాలో ఈ వారం రిలీజ్! చాలా ఏళ్ళ క్రితం రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన నవల - ‘ది జంగిల్ బుక్’. అడవిలోని పసిబాలుడు మోగ్లీని తోడేళ్ళు పెంచడం, ఎలుగుబంటి, కొండ చిలువ లాంటి రకరకాల అడవి జంతువులతో అతని స్నేహం మధ్య ఈ కథ తిరుగుతుంది. భారతీయ సంతతికి చెందిన నీల్‌సేథీ ఈ సినిమాలో మోగ్లీ పాత్ర పోషించగా, హైదరాబాద్‌కు చెందిన ఏడోతరగతి కుర్రాడు పదేళ్ళ సంకల్ప్ ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. నిజానికి, పెద్ద నగరాల్లో ఇంగ్లీషే తప్ప ఈ ప్రాంతీయ భాషా వెర్షన్ల ప్రదర్శనలు తక్కువగా వేస్తున్నారు. దాంతో, ఉన్న ఒకటీ, అరా థియేటర్లలో రోజుకు ఒకటి, రెండు ఆటలతో టికెట్లు దొరక్క జనం అసంతృప్తితో వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితేనేం, త్రీడీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఒక్క మన దేశంలో తొలి రోజే సుమారు రూ.10.09 కోట్ల వసూళ్ళు వచ్చాయి. రెండో రోజున వసూళ్ళ స్థాయి ఇంకా పెరిగి, రూ.13.5 కోట్లు వచ్చాయి. మూడో రోజు రూ. 16.6 కోట్లు వసూళ్ళయ్యాయి. అన్నీ కలిపి, రిలీజైన తొలి వారాంతానికే రూ. 40 కోట్ల పైగా ఆర్జించింది. గత ఏడాది రిలీజైన హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ అప్పట్లో తొలి మూడు రోజులకే రూ. 48 కోట్లు వసూలు చేసింది. దాని తరువాత మన దేశంలో తొలి మూడు రోజులకే ఇంత భారీ వసూళ్ళు సాధించిన రెండో హాలీవుడ్ చిత్రం -‘ది జంగిల్ బుక్’! ఈ ఊపులో తొలివారంలోనే థియేటర్లలో రూ. 50 కోట్ల మార్కు దాటేయనుంది. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా మన దేశంలో అతి పెద్ద బాక్సాఫీస్ హిట్ ఇదే! స్కూల్ పిల్లలకు సెలవులు కూడా వచ్చేస్తుండడంతో, ఈ సినిమా కొద్దిరోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తుందని మార్కెట్ వర్గాల కథనం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు రెంటిలోనూ కలిపి ఇప్పటికే ఈ చిత్రం 3.17 కోట్ల డాలర్లు (మన లెక్కలో రూ. 200 కోట్ల పైగా) వసూలు చేసి, సంచలనం రేపుతోంది. వార్నర్ బ్రదర్స్ పోటీ ‘జంగిల్ బుక్’ వాయిదా! నిజానికి, డిస్నీ సంస్థతో పాటు వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా ఇదే ‘జంగిల్ బుక్’ కథతో ఒక సినిమా చేసే పనిలో ఉంది. మోషన్ క్యాప్చర్ విధానంలో ఆండీ సెర్కిస్ దర్శకత్వంలో ‘జంగిల్ బుక్ - ఆరిజిన్స్’ పేరిట తీయాలనుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 6కు రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, తాజాగా దాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేశారు. 2018 అక్టోబర్ 19కి రిలీజ్ చేసేలా, నిర్మించాలని భావిస్తున్నారు. దాంతో, వాల్ట్‌డిస్నీ, వార్నర్ బ్రదర్స్ స్టూడియోల మధ్య పోటీలో ఒక రకంగా డిస్నీ సంస్థది ఇప్పుడు పైచేయి అయింది. రెండో పార్ట్‌కీ అదే టీమ్ మొత్తానికి, గతంలో తీసిన ‘అలైస్ ఇన్ వండర్ల్యాండ్’, ‘మ్యాలెఫిషెంట్’, ‘సిండెరెల్లా’ల ఫక్కీలో ఇప్పుడీ ‘ది జంగిల్ బుక్’ కూడా భారీ హిట్టవడంతో డిస్నీ సంస్థ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇంకా రిలీజైనా కాక ముందే వాల్ట్‌డిస్నీ సంస్థ ‘ది జంగిల్ బుక్’ చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ తొలి భాగానికి దర్శకత్వం వహించిన ‘ఐరన్‌మ్యాన్’ చిత్ర ఫేమ్ జాన్ ఫావ్రీవ్ సారథ్యంలోనే ఈ రెండో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన అసలు కథను ఆధారంగా చేసుకొని ‘టాప్‌గన్2’ చిత్ర స్క్రీన్‌ప్లే రచయిత జస్టిన్ మార్క్స్ తాజా ‘జంగిల్ బుక్’కు సినీ రచన చేశారు. ఇప్పుడు త్వరలోనే నిర్మించాలనుకుంటున్న రెండోభాగానికి సైతం రచన చేయాల్సిందిగా ఆయనతో ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నాయి. నిజానికి, డిస్నీటూన్ స్టూడియోస్ సంస్థ గతంలో 2003లోనే ‘జంగిల్ బుక్-2’ అంటూ యానిమేషన్ చిత్రం తీసి, నేరుగా డి.వి.డి. విడుదల చేసింది. అయితే, ఇప్పుడు తీసిన సరికొత్త లైవ్ యాక్షన్ చిత్రం సీక్వెల్ కోసం ఆ యానిమేషన్ కథను వాడకపోవచ్చు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘జంగిల్ బుక్’ కథలు, నవలల నుంచి బోలెడన్ని అంశాల్ని తవ్వితీసి, స్క్రిప్ట్ తయారు చేసే అవకాశం ఉంది. ‘అవతార్’తో పోలుస్తున్న విమర్శకులు అత్యధిక శాతం ఫోటో రియలిస్టిక్ సి.జి.లతో తయారైన ఈ ‘ది జంగిల్ బుక్’ పార్ట్1 సినిమాను లాస్ ఏంజెల్స్‌లో తీశారు. నీల్ సేథీ నటించిన మోగ్లీ పాత్ర మినహా మిగతా జంతువుల పాత్రలు, వాటి హావభావాలన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించిన వర్కే! ఈ 3డి యానిమేషన్ చూసిన విమర్శకులు అదిరిపోయి, దీన్ని ‘అవతార్’ సినిమా తాలూకు సి.జి. వర్క్స్‌తో పోలుస్తున్నారు. అయితే, షేర్‌ఖాన్, బాలూ, బఘీరా లాంటి జంతువుల పాత్రలన్నిటికీ ప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు తమ గాత్రంతో ప్రాణం పోసి, కథాకథనంలోని భావోద్వేగాల్ని ప్రేక్షకులు అనుభవించేలా చేశారు. మొత్తానికి, ఒక హాలీవుడ్ సినిమా హాలీవుడ్లో రిలీజ్ కాకుండానే ఇన్ని కోట్ల వసూళ్ళు, ఇంత భారీ జనాదరణ పొందడం, అప్పుడే సీక్వెల్ ఆలోచనతో సిద్ధం కావడం విశేషమే కదూ! -
హిందీ వర్షన్‌కు టాప్ స్టార్స్ డబ్బింగ్
ప్రస్తుతం అంతర్జాతీయ సినీ అభిమానులను ఆకర్షిస్తున్న సినిమా 'ద జంగిల్ బుక్'. 90లలో కార్టూన్ టివి సీరీస్‌గా అలరించిన ఈ అడ్వంచరస్ యాక్షన్ స్టోరీని ఇప్పుడు సినిమాగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను ఇండియాలోనూ అదే స్థాయిలో భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమాలోని పాత్రలకు బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు నిర్మాతలు. ఇర్ఫాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, ఓం పురి, నానాపటేకర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు 'ద జంగిల్ బుక్' సినిమాలోని ఫైతాన్, బాలూ, భగీరా, షేర్ ఖాన్ పాత్రలకు గాత్రధానం చేస్తున్నారు. ఈ సినిమాలో మోగ్లీ పాత్రలో నటించిన బాలనటుడు నీల్ సేతీ కూడా భారతీయ మూలాలు కలిగిన నటుడు కావటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. జాన్ ఫ్వారూ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8న భారత్ లో రిలీజ్ అవుతోంది. -
అక్కడ కన్నా ముందే... ఇక్కడ!
‘ది జంగిల్ బుక్’... అడవిలో చిక్కుకుపోయిన మౌగ్లీ అనే పసిబాలుణ్ణి తోడేళ్ళ కుటుంబమంతా కలసి పెంచే ఈ కథ తెలియనివారూ, యానిమేషన్ చిత్రంగా చూడనివారూ ఉండరు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాయగా ప్రపంచ ప్రసిద్ధమైన ఈ సాహస కథలకు డిస్నీ సంస్థ కొత్తగా ఇచ్చిన వెండితెర రూపం మరికొద్ది రోజుల్లో ఏప్రిల్ ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ - అమెరికన్ అయిన 12 ఏళ్ళ నీల్ సేథీ ఈ చిత్రంలో ప్రధానపాత్ర మౌగ్లీని పోషిస్తున్నారు. లైవ్ యాక్షన్‌తో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా సృష్టించిన జంతువులు, అటవీ వాతావరణంతో ఈ కథను ఇప్పుడు తెరకెక్కించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కథాకథన విధానాలు దానికి తోడయ్యాయి. విశేషం ఏమిటంటే, ఎన్నేళ్ళయినా వన్నె తరగని ఈ కథా చిత్రం అమెరికా కన్నా ఓ వారం ముందుగానే మన దేశంలోని థియేటర్లలో రిలీజవుతోంది. ‘‘ఇండియాలోని ‘ది జంగిల్ బుక్’ అభిమానులకు మరెన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉన్నాయి’’ అని డిస్నీ ఇండియాలోని ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ‘ఐరన్ మ్యాన్’ ఫేమ్ జోన్ ఫేవ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. హిందీలో ప్రియాంకా చోప్రా... ఓంపురి... నానా పాటేకర్... కాగా, ‘గాంధీ’ పాత్రధారి ఇండియాలోనూ ప్రసిద్ధుడైన బెన్ కింగ్స్లే, అలాగే బిల్ ముర్రే, స్కార్లెట్ జొహాన్సన్ తదితరులు ఈ చిత్రంలోని రకరకాల జంతువుల పాత్రలకు ఇంగ్లీషులో గళం అందించడం విశేషం. కాగా, హిందీ వెర్షన్లో కొండచిలువ పాత్ర ‘కా’కు ప్రియాంకా చోప్రా, ఎలుగుబంటి ‘బాలూ’ పాత్రకు ఇర్ఫాన్, తోడేలు ‘రక్ష’ పాత్రకు షెఫాలీ షా గాత్రదానం చేస్తున్నారు. కాగా, కీలకమైన నల్ల చిరుత పాత్రకు ఇంగ్లీషులో బెన్కింగ్స్లే, హిందీలో ఓంపురి గాత్రధారులు. టైగర్ షేర్‌ఖాన్ పాత్రకు నానా పాటేకర్ హిందీలో జీవం పోస్తున్నారు. ‘జంగిల్ బుక్’లోని మౌగ్లీ, బాలూ, బఘీరా, షేర్‌ఖాన్ లాంటి పాత్రల చుట్టూ జరిగే సాహస కథలు భారతీయులకు చాలా ఇష్టం. అందుకే తగ్గట్లే ఇప్పుడీ సినిమా మన దగ్గర ముందుగా రిలీజ్ కావడం చెప్పుకోదగ్గ విశేషం. -
వెండితెర మీద మోగ్లీ సాహసాలు
దశాబ్దాలుగా బుల్లితెర మీద సంచలనాలు నమోదు చేసిన కార్టూన్ షో 'ది జంగిల్ బుక్' త్వరలో వెండితెర మీద సందడి చేయనుంది, ఇప్పటి వరకు యానిమేషన్ క్యారెక్టర్ల రూపంలో మాత్రమే కనిపించిన ఈ ఎడ్వెంచరస్ ఫాంటసీ స్టోరి ఇప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్లతో రానుంది. ఐరన్ మేన్ లాంటి యాక్షన్ సినిమాలను అందించిన దర్శకుడు జాన్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారత్‌లో వేసవి కానుకగా ఏప్రిల్ 15లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మరో అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. భారతీయ సినిమా అభిమానులకు సుపరిచితుడైన మోగ్లీ పాత్రలో భారతీయ మూలాలున్న నటుడు నీల్ సేథి నటిస్తున్నాడు. మోగ్లీ అతని తల్లిదండ్రుల పాత్రలు తప్ప మిగతా అన్ని జంతువులు 3డి యానిమేషన్లో రూపొందించారు. ఇక సినిమాలో కనిపించనున్న జంతువులకు హాలీవుడ్ స్టార్స్ బిల్ ముర్రే, బెన్ కింగ్స్లే, స్కార్లెట్ జాన్సన్ లాంటి వారు డబ్బింగ్ చెప్పటం కూడా సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. వాల్ట్ డిస్నీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
ది జంగిల్ బుక్ : ట్రైలర్ వాల్ట్ డిస్నీ పిక్చర్స్ విడుదల చేసిన ‘ది జంగిల్ బుక్ ’ చిత్రం టీజర్ ఇది. సినిమా 2016 ఏప్రిల్ 15న రిలీజ్ అవుతోంది. జాన్ ఫారో డెరైక్ట్ చేస్తున్న ఈ 3డి కామెడీ అడ్వెంచర్ ఫాంటసీ ఫిల్మ్‌కు జస్టిన్ మార్స్క్ స్క్రిప్ట్ అందించారు. 1967లో ఇదే పేరుతో డిస్నీ పిక్చర్స్ నిర్మించిన చిత్రానికి ఇది లైవ్ యాక్షన్ రీమేక్. రుడ్యార్డ్ కిప్లింగ్ 1894లో రాసిన ‘ది జంగిల్ బుక్’ ఈ రెండు చిత్రాలకూ ఆధారం. తాజా జంగిల్ బుక్‌లో బాల కథానాయకుడు మోగ్లీగా నీల్ సేథీ నటిస్తున్నాడు. అడవిలో తోడేళ్ల ఆలన, లాలనతో పెరుగుతున్న చిన్నారి మోగ్లీ చేసే సాహసాలే ఈ చిత్ర కథాంశం. తూంగవనం : ట్రైలర్ కమలహాసన్, త్రిష నటించిన తమిళ చిత్రం ‘తూంగవనం’ ట్రైలర్ ఇది. తెలుగులో ‘చీకటి రాజ్యం’గా తయారవుతోంది. తూంగవనం అంటే స్లీప్‌లెస్ ఫారెస్ట్. విశ్రమించని అరణ్యం. 2011లో విడుదలైన ఫ్రెంచి సినిమా ‘స్లీప్‌లెస్ నైట్’కు ఇది రీమేక్. రెగ్యులర్ సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో ఉండవని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఎట్ ద సేమ్ టైమ్... చూసి తీరవలసిన సినిమా అని కూడా అనిపిస్తుంది. మాదక ద్రవ్యాల మాఫియాకు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు మధ్య సాగే పోరాటంలో కుటుంబ అనుబంధాలు ఎలా నలిగిపోతాయో ఈ చిత్రం చెబుతుంది. షాందార్ : వీడియో సాంగ్ షాహిద్ కపూర్, అలియా భట్ నటించిన ‘షాందార్’ చిత్రంలోని ‘షామ్ షాందార్’ పాటను జీ మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోను చూసిన వారు సినిమా రిలీజ్ కోసం అక్టోబర్ 22 వరకు వేచి ఉండడం కాస్త కష్టమైన విషయమే. ఫుల్ జోష్‌తో సాగుతుందీ సాంగ్. డాన్స్‌లో అలియాను డామినేట్ చేశాడు షాహిద్. అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాటను అమిత్ త్రివేదీ ఆలపించాడు. ‘షాందార్’ అంటే ఫాబ్యులస్. వెరీ గుడ్. ఎక్స్లెంట్ అని అర్థం. ఈ పాటను దృశ్యీకరించిన తీరులో షాందార్ అంతా కనిపిస్తుంది. సినిమాను వికాస్ బల్ డెరైక్ట్ చేస్తున్నారు. లేడీ గాగా : టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు ‘ది హంటింగ్ గ్రౌండ్’ అనే డాక్యుమెంటరీ చిత్రం కోసం అమెరికన్ సింగర్ లేడీ గాగా... సహగాయని, గీత రచయిత్రి అయిన డయానే వారెన్‌తో కలిసి రాసి, పాడిన పాట ‘టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు’. క్యాంపస్ రేప్ ఇందులోని థీమ్. ఈ ఏడాది ఆరంభంలో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ నుంచి అనధికారికంగా ఈ సాంగ్ లీక్ అయింది. ఇప్పుడు దీనినే అధికారికం చేసి మూడు రోజుల క్రితమే ఈ సింగిల్ ట్రాక్‌ను విడుదల చేశారు. వీడియోకు, లిరిక్కు అసాధారణమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి కాలేజీ అమ్మాయి, అబ్బాయి చూసి తీరవలసిన ట్రాక్ ఇది. లేడీ ఆస్ట్రాలజర్ స్లాప్స్ బాబా టీవీ చానెల్స్‌లో డిబేట్ ప్రోగ్రామ్‌లు వేడి వేడిగా సాగుతుంటాయి. అప్పుడప్పుడు ఆ వేడి కాస్త ఎక్కువై మాటలు మితిమీరి చేతల్లోకి వెళ్లిపోతాయి. అందుకొక ఉదాహరణ ఈ వీడియో. ఐబిఎన్7 ఛానెల్లో ‘ఆజ్ కా ముద్దా’ (నేటి టాపిక్) అనే ఈవెనింగ్ డిబేట్ లైవ్ వస్తుంటుంది. అందులో పాల్గొన్న లేడీ ఆస్ట్రాలజర్ దీపా శర్మ నిగ్రహం కోల్పోయి, సహవాది అయిన మరో ఆస్ట్రాలజర్ ధరమ్ గురు ఓమ్ జీ మహరాజ్ చెంప పగలగొట్టారు. అయితే ఆయనేమీ రెండో చెంప చూపలేదు. దీపను తనూ చెంపదెబ్బ కొట్టారు. ఆవేళ్టి తమ భవిష్యత్తును వాళ్లిద్దరూ ఊహించలేకపోయినట్లున్నారు. సత్యా నాదెళ్ల డెమో ఫెయిల్యూర్: ఫన్నీ వీడియో మైక్రోసాఫ్ట్ రూపొందించిన పర్సనల్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్... ‘కార్టానా’ మహా తెలివైనది. అందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అడిగిన ప్రశ్నలకన్నింటికీ సమాధానాలు చెబుతుంది. కానీ ఆ కంపెనీ సీయీవో సత్యా నాదెళ్ల ప్రశ్నలనే అది సరిగా అర్థం చేసుకోలేకపోయింది! గత బుధవారం ఒక పబ్లిక్ ఈవెంట్లో నాదెళ్ల తన ‘కార్టానా’ను టెస్ట్ చేశారు. ‘షో మీ మై మోస్ట్ ఎట్-రిస్క్ ఆపర్చునిటీస్’ అని అడిగారు. కార్టానా కామ్‌గా ఉండిపోయింది. నాదెళ్ల మరో రెండుసార్లు క్వొశ్చన్ రిపీట్ చేశారు. నాలుగోసారి వచ్చిన ఆన్సర్ వచ్చి ఏంటో తెలుసా? టు బై మిల్క్ అని. ఇక నవ్వులే నవ్వులు. -
భారతీయ సంతతి కుర్రాడితో మళ్ళీ ‘జంగిల్ బుక్’
నటన అంటే ఏమిటో కూడా తెలియని ఈ పదేళ్ళ పిల్లాడు త్వరలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. వాల్ట్ డిస్నీ సంస్థ తీయనున్న ‘ది జంగిల్ బుక్’లో ప్రధాన పాత్ర మోగ్లీగా నటించే బంగారు అవకాశం న్యూయార్క్‌లో జన్మించిన భారతీయ - అమెరికన్ అయిన నీల్ సేథీని వరించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని వెతికాం. న్యూయార్క్ నుంచి న్యూజిలాండ్ వరకు, లండన్ నుంచి కెనడా వరకు, అమెరికా, భారతదేశం... మూలమూలలా వెదికిన తర్వాత పదేళ్ళ నీల్ సేథీని ఏకగ్రీవంగా ఎంపిక చేశాం’’ అని దర్శకుడు జాన్ ఫేవ్రౌ తెలిపారు. అడవిలోని జంతువులు పెంచి పెద్ద చేసిన ఓ పసివాడి కథగా రుడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన ‘ది జంగిల్ బుక్’ సుప్రసిద్ధం. ఈ కథ గతంలో యానిమేషన్ రూపంలో అలరించింది. కాగా, ఇప్పుడు లైవ్ - యాక్షన్, యానిమేషన్ల సమ్మిళిత రూపంగా 3డిలో ఈ సినిమా తీయనున్నారు. ఈ చిత్రంలో సేథీ ఒక్కడే మౌగ్లీగా నటిస్తున్నాడు. అతణ్ణి పెంచే అడవి జంతువుల పాత్రలన్నీ యానిమేషన్, గ్రాఫిక్సే. ఈ పాత్రలకు బెన్ కింగ్స్లే లాంటి ప్రసిద్ధులు గాత్రదానం చేయనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఒక సినిమా సక్సెస్ కావాలంటే నటీనటుల ఎంపిక బాగుండాలి. మోగ్లీ పాత్రకు సరిగ్గా సూటయ్యే కుర్రాడు దొరికాడు. నీల్ సేథీలో ప్రతిభ, ఆకర్షణ రెండూ ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు. మరి, ఈ భారతీయ సంతతి కుర్రాడు రేపు తెరపై ఎంతగా ఆకట్టుకుంటాడో చూడాలి.