Jury decision
-
Nikitha Umesh: స్ట్రాంగ్‌గా ఉంటేనే మనుగడ
సాధారణంగా ఇళ్లలో ఆడవాళ్లే వంటలు చేస్తారు. వృత్తిపరంగా చూస్తే మగ చెఫ్‌లే ఎక్కువ కనిపిస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న చెఫ్ నిఖితా ఉమేష్‌ను అడిగితే... ‘‘నేను చెఫ్‌గా ఈ వృత్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ‘గిన్నెలు కడగడానికి వెళుతున్నావా’ అని వ్యంగ్యంగా అన్నవాళ్లే ఇప్పుడు నా వంటలు రుచి చూసి చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’’ అని వివరించారు. మాస్టర్ చెఫ్ ఇండియా (తెలుగు) జ్యూరీ ప్యానెల్లో స్థానం దక్కించుకున్న నిఖిత ఉమేష్ ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘చదువుకునే రోజుల్లో టీవీలో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా చూసేదాన్ని. ఇంట్లో రకరకాల వంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ ఆసక్తితోనే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. దుబాయ్, సింగపూర్లలో శిక్షణ కోసం రెండేళ్లపాటు పనిచేశాను. పేస్ట్రీ ప్రొఫెషనల్ అండ్ మాస్టర్ చాకోలేటియర్గా హైదరాబాద్‌లో ఏడేళ్లు పని చేశాను. అలా హైదరాబాద్ పేస్ట్రీ చెఫ్‌గా, క్యుజిన్ డిజైనర్‌గా పేరొచ్చింది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో మావారితో కలిసి మూడు పేస్ట్రీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాను. ఏ రంగమైనా మనల్ని మనం నిత్యం నిరూపించుకుంటూనే ఉండాలి. అందులోనూ ఆహారం విషయానికి వస్తే మరీ ప్రత్యేకం. ఇంట్లో తిన్నవారు ఆ వంట రుచి చెప్పేంతవరకు వంట వండినవారు ఒక తెలియని ఒత్తిడిని పీలవుతుంటారు. అలాగే, మేం ప్రతి రోజూ మా పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎంతోమందికి చేరవవుతుంటాం. కాబట్టి, ఈ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. నైపుణ్యంతోపాటు రుచిగా అందించాలనే భావన కూడా మమ్మల్ని గెలిపిస్తుంటుంది. వర్క్ బాగుంటేనే... ఐటీసీ హోటల్స్‌లో చెఫ్‌గా వర్క్ చేసినప్పుడు నా వయసు 22 ఏళ్లే. టీమ్‌లో పద్దెనిమిది మంది చెఫ్స్ ఉండేవారు. అందరూ మగవాళ్లే. అందులో సీనియర్స్ కూడా ఉండేవారు. నా వర్క్ బాగుంటేనే వారందరూ నన్ను గౌరవిస్తారు. ఈ విషయంలో ఎప్పుడూ నేను అలర్ట్‌గా ఉండేదాన్ని. వారికి తగిన సూచనలు ఇస్తూ ఏడేళ్లు పనిచేశాను. ఈ వర్క్‌లో శారీరక శ్రమతో పాటు టైమ్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కుటుంబం కూడా సపోర్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. నిజానికి ఇళ్లలో వంటలు చేసేవాళ్లు ఆడవాళ్లే కానీ. హోటల్స్‌లో వృత్తిపరంగా చెఫ్‌లుగా ఉన్న మహిళల శాతం మాత్రం తక్కువగానే ఉంది. కొత్తగా నేర్చుకుంటూ.. నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. అమ్మ ప్రభ డిఫెన్స్‌లో సీనియర్ అడ్మిన్ ఆఫీసర్, నాన్న ఉమేష్ ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు రాదు. మాస్టర్ చెఫ్ ఇండియా అవకాశం వచ్చాక తెలుగు నేర్చుకున్నాను. అందుకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. చెఫ్ కమ్యూనిటీ నుంచి ఎవరో నన్ను రికమండ్ చేసి ఉంటారు. ఆ విధంగా నాకు జ్యూరీలో సభ్యురాలిగా ఉండే అవకాశం లభించింది. పనిలో చూపించే శ్రద్ధ, తపన మనల్ని విజయమార్గంలో తప్పక నడిపిస్తుంది’’ అని వివరించారు ఈ మాస్టర్ చెఫ్. ఆమె అనుభవ పాఠాలు మరికొందరికి విజయ సోపానాలు అవుతాయి కదా... – నిర్మలారెడ్డి -
‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్
గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించడపై జ్యూరీ అధినేత ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అతడి కామెంట్స్‌పై పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రెటీల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీరీ పండిట్ల బాధల పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘గుడ్ మార్నింగ్.. నిజాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి వ్యక్తుల చేత అబద్ధాలు చెప్పిస్తుంది’ అంటూ తనదైన శైలిలో నడవ్ లాపిడ్ చురక అట్టించారు. చదవండి: హీరోల క్యారవాన్ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ అంతేకాదు తన ట్వీట్‌కి క్రియేటివ్ కాన్షియస్నెస్(#CreativeConsciousness) అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. కాగా నడవ్ లాపిడ్ వ్యాఖ్యలపై ఇప్పటికే నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. GM. Truth is the most dangerous thing. It can make people lie. #CreativeConsciousness — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 29, 2022 ‘कश्मीर फ़ाइल्स’ का सच कुछ लोगो के गले में एक काँटे की तरह अटक गया है।वो ना उसे निगल पा रहे है ना उगल! इस सच को झूठा साबित करने के लिए उनकी आत्मा,जो मर चुकी है, बुरी तरह से छटपटा रही है।पर हमारी ये फ़िल्म अब एक आंदोलन है फ़िल्म नहीं।तुच्छ #Toolkit गैंग वाले लाख कोशिश करते रहें।🙏 pic.twitter.com/ysKwCraejt — Anupam Kher (@AnupamPKher) November 29, 2022 -
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ‘అదో చెత్త సినిమా’
పణజీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్ ఫైల్స్ చూసి మేమంతా షాకయ్యాం. చాలా డిస్టర్బయ్యాం. ఫక్తు ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా అది’’ అంటూ సోమవారం ముగింపు వేడుకల సందర్భంగా వేదికపైనే కడిగి పారేశారు. అసలా సినిమాను ఇఫీ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శనకు ఎలా అనుమతించారంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరుల సమక్షంలోనే నిర్వాహకులను నిలదీశారు. ‘‘ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి. కానీ 15వ సినిమా కశ్మీర్ ఫైల్స్ చూసి అక్షరాలా షాకయ్యాం. కళాత్మక స్పర్థకు వేదిక కావాల్సిన ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అలాంటి చౌకబారు సినిమాను ప్రదర్శించడం అస్సలు సరికాదు. అందుకే నా అభ్యంతరాలను, అభిప్రాయాలను వేదికపై ఉన్న అందరి ముందే వ్యక్తం చేస్తున్నా’’ అన్నారు. 1990ల్లో కశ్మీర్ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, ఫలితంగా లోయనుంచి వారి భారీ వలసలు నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన కశ్మీర్ ఫైల్స్ ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో నిలిచింది. అయితే పలు వివాదాలకూ ఇది కేంద్ర బిందువుగా నిలిచింది. వాస్తవాలను వక్రీకరించారంటూ సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. లపిడ్ ఇజ్రాయెల్‌కు చెందిన సినీ దర్శకుడు. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినీ అవార్డుల గ్రహీత. కేన్స్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీ సభ్యునిగా చేశారు. -
జైలుకి హార్వీ వెయిన్‌స్టీన్
తమపై లెంగిక వేధింపులు జరిపాడు అంటూ హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు పలువురు హాలీవుడ్ నటీమణులు. దాంతో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా హార్వీ వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమే అంటూ జ్యూరీ తేల్చింది. పన్నెండు మంది (ఏడుగురు మగవాళ్లు, ఐదుగురు ఆడవాళ్లు) సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ జ్యూరీ ఐదురోజులపాటు సమీక్షించి వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలు తేల్చారు. ఈ కేసులో వెయిన్‌స్టీన్‌కి ఐదేళ్ల నుంచి 25 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందట. మార్చి 11న వెయిన్‌స్టీన్ జైల్‌కి వెళ్లనున్నారు. అయితే ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ‘‘వెయిన్‌స్టీన్ గురించి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్లకి, ఇన్ని రోజులు ఆ బాధను అనుభవించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మీ ధైర్యం ప్రపంచంలో ఎందరో మహిళలకు పబ్లిక్ సర్వీస్లాంటిది. మరోసారి అందరికీ థ్యాంక్స్’’ అన్నారు నటి ఆఫ్లే జూడ్. వెయిన్‌స్టీన్ గురించి తొలిసారి బాహాటంగా ఆరోపణ చేశారామె. ఆ తర్వాత మిగతావాళ్లు బయటికొచ్చారు. -
ఆందోళనలతో అట్టుడుకుతోన్న అమెరికా!
న్యూయార్క్: ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ 9న మైఖేల్ బ్రౌన్ అనే 18 ఏళ్ల నల్లజాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గుసన్ పోలీసు అధికారి డారెన్ విల్సన్ తప్పేమీ లేదని అమెరికన్ గ్రాండ్ జూరీ తేల్చడంతో ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి పలు భవనాలకు నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. లాస్ ఏంజిల్స్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, ఓక్లాండ్, డెల్వుడ్, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రజలు సంయమనం పాటించాలని అధ్యక్షుడు ఒబామా విజ్ఞప్తి చేశారు. అమెరికాలో బొమ్మ తుపాకి కలిగి ఉన్న 12 ఏళ్ల బాలుడు తమిర్ రైస్‌ను క్లైవ్లాండ్ పోలీసులు ఈ నెల 22 శనివారం కాల్చారు. 23న మృతి చెందాడు. అసలు తుపాకీ అనుకొని కాల్చామని ఆ పోలీసులు తాపీగా చెప్పారు. పోలీసుల అత్యుత్సాహంపై అగ్రరాజ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిర్ రైస్‌ను పోలీసులు కాల్చి చంపడం కలకలం రేపుతోంది. గ్రౌండ్లో తమిర్ జనాల వైపు బొమ్మ తుపాకీని చూపిస్తూ సరదగా ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులెవరో పోలీసులకు చెందిన 911 నెంబర్‌కు ఫోన్ చేశారు. గ్రౌండ్‌కు వచ్చిన పోలీసులు బాలుడు తన ప్యాంట్లో నుంచి మాటి మాటికీ గన్‌తీసి పెడుతుండటం చూశారు. అయితే అతడి చేతిలో ఉన్న గన్ ఒరిజినలా, డూప్లికేటా అన్నది మాత్రం ఆలోచించలేదు. వచ్చీ రాగానే తమిర్‌ను లొంగిపొమ్మంటూ హెచ్చరించారు. చేతులు ఎత్తాలని హెచ్చరించినా వినిపించుకోవడం లేదంటూ కాల్పులు జరిపారు. గాయాలతో విలవిలలాడుతూ కిందపడిపోయిన తమిర్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం చనిపోయాడు. బాలుడి మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కలకలం రేపిన ఈ ఘటన అగ్రరాజ్యంలో అభద్రతా భావాన్ని వెల్లడిస్తోంది. **