justice R M Lodha
-
ప్రతిభ ఆధారంగానే చీఫ్ జస్టిస్ ఎంపిక
న్యూఢిల్లీ: ప్రతిభ ఆధారంగా భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం జరగాలని సీనియారిటి ప్రాతిపదికన కాదని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. సీనియారిటి ఉన్న వారికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి ఇవ్వాలని రాజ్యాంగబద్దమైన లేదా శాసనసంబంధమైన నిబంధన ఏదీ లేదని ఆయన తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిభ కనబరిచిన వారిని నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ఆయన సూచించారు. సీజేఐ నియామకానికి అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలు న్యాయవ్యవస్థకు నష్టం కలిగిస్తున్నాయని కట్జూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఏం లోదా- సెప్టెంబర్ 27న పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పది రోజుల్లోగా స్పందించండి
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్రపతిపాలనను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీపార్టీ(ఏఏపీ) వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించింది. దీనిపై పది రోజుల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. కాంగ్రెస్, బీజేపీలకు నోటీసులు ఇవ్వాలన్న ఏఏపీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశమని రాజకీయ పార్టీలకు సంబంధం లేదని జస్టిస్ ఆర్ఎమ్ లోధా, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్ పేర్కొంది. ముఖ్యమంత్రి పదవి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.