న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్రపతిపాలనను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీపార్టీ(ఏఏపీ) వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించింది. దీనిపై పది రోజుల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. కాంగ్రెస్, బీజేపీలకు నోటీసులు ఇవ్వాలన్న ఏఏపీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.
ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశమని రాజకీయ పార్టీలకు సంబంధం లేదని జస్టిస్ ఆర్ఎమ్ లోధా, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్ పేర్కొంది. ముఖ్యమంత్రి పదవి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.
పది రోజుల్లోగా స్పందించండి
Published Mon, Feb 24 2014 3:34 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement