దుర్గమ్మ సేవలో జస్టిస్ రమణ
ఇంద్రకీలాద్రి:
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను బహూకరించారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సిద్దా రాష్ట్ర రవాణామంత్రి సిద్దా రాఘవరావు బుధవారం దర్శించుకున్నారు.