jvv
-
జేవీవీ కార్యక్రమాలు ఆదర్శనీయం
–ఆర్డీఓ వెంకటాచారి –ముగిసిన రాష్ట్ర మహాసభలు నల్లగొండ కల్చరల్ : జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని ఆర్డీఓ వెంకటాచారి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిసాయి. రెండవ రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల్లో పెనవేసుకుపోయిన మూఢ విశ్వాసాలను పారదోలుతూ వారిని చైతన్యం చేయడంలో జేవీవీ 30 ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మూఢ నమ్మకాలను రూపుమాపాలంటే ప్రతి ఒక్కరికీ సైన్స్ పట్ల అవగాహన కలిగివుండాలన్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఇలాంటి సభలు దోహదపడుతాయని పేర్కొన్నారు. జేవీవీ నిర్వహించే కార్యక్రమాలకు తన సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. అనంతరం జేవీవీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి.ఎం.మనోహర్‌ప్రసాద్, డాక్టర్ హెహెచ్.మోహన్‌రావు, డాక్టర్ మెహతాబ్ఎస్ బాబ్జి, అధ్యక్షుడిగా ఫ్రొఫెసర్ ఆదినారాయణరావు, ఉపాధ్యక్షుడిగా ఫ్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, ఫ్రొఫెసర్ బీఎన్.రెడ్డి, అందె సత్యం, ఎ.నాగేశ్వర్రావు, డాక్టర్ వి.ప్రభావతి, రామరాజు, ప్రధాన కార్యదర్శిగా టి.శ్రీనాథ్, కోశాధికారిగా ఎస్.జితేంద్ర, కార్యదర్శులుగా నర్సింహులు, టి.రాజు, ఎ.వెంకటరమణారెడ్డి, డాక్టర్ మమత, ఎన్.అరుణకుమార్, కస్తూరి ఎన్నికయ్యారు. సబ్ కమిటీ కన్వీనర్లుగా విద్య ఎల్వీఎన్.రెడ్డి, ఆరోగ్యం, డాక్టర్ రమాదేవి, సమత, ఝాన్సీరాణి, శాస్త్ర ప్రచారం ఫ్రొఫెసర్ కోయా వెంకటేశ్వర్రావు, ప్రచురణలు హరిప్రసాద్, చకుముఖి పి.ఆనంద్‌కుమార్, పర్యావరణం కె.బి. ధర్మప్రకాశ్, సామాజిక న్యాయం సర్వేశ్వర్రావు, సాంస్కృతిక ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు ప్రొఫెసర్ రామచంద్రయ్య, టి.రమేష్, లక్ష్మారెడ్డి, నాగేశ్వర్రావు, రమాదేవి, సతీష్, ఎన్. రత్నకుమార్, శ్రీనివాస్‌రాజు, మమత, బీఎన్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జేవీవీ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్ సత్యనారాయణరెడ్డి నల్లగొండ టూటౌన్ : ఈ నెల 25, 26వ తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న జన విజ్ఞాన వేదిక రెండో రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను శుక్రవారం కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పారదోలుతూ ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె సత్యం, జిల్లా అధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, ఎ.గోవర్దన్, ఎన్.భీమార్జున్‌రెడ్డి, పి.సైదులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వినాయకులనే పూజిద్దాం
జేవీవీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ నెల్లూరు(అర్బన్): మానవాళి ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టివిగ్రహాలనే పూజిద్దామని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జిల్లా కాలుష్యనియంత్రణ మండలి సహకారంతో స్థానిక ఫత్తేఖాన్‌పేటలోని రైతు బజార్లో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ మాట్లాడారు. రసాయనాలు వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జలచరాలు మరణిస్తున్నాయన్నారు. ఆ నీటిని తాగిన ప్రజలకు కేన్సర్ వస్తుందన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఉచితంగా 10వేల మట్టి విగ్రహాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ప్రజాసైన్సువేదిక రాష్ట్ర నాయకుడు నూనె నారాయణ మాట్లాడుతూ మన దేశ సంప్రదాయానికి అనుగుణంగా మట్టి వినాయకులనే పూజిద్దామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రమోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో రూ.15 విలువైన మట్టి విగ్రహాలను రూ.5కే రైతుబజార్లో అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, న్యాయవాది నన్నేసాహెబ్, కార్పొరేటర్లు రాజేష్, రాజానాయుడు, నూనె మల్లికార్జున, పెంచలయ్య, నాగేశ్వరరావు, జేవీవీ నాయకులు గాలిశ్రీనివాసులు, శ్రీధర్, చక్రపాణి పాల్గొన్నారు. -
అణు కుంపటి వద్దు
నెల్లూరు(అర్బన్): ప్రపంచదేశాలు వదిలించుకోవాలని చూస్తున్న అణుకుంపటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొవ్వాడలో ఒకటి, నెల్లూరు –ఒంగోలు సరిహద్దులో మరొకటి ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని బొట్టుపెట్టి మరీ పిలవడం దారుణమని జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు పి.బుజ్జయ్య పేర్కొన్నారు. కావలి సమీపంలో ఏర్పాటయ్యే అణుకుంపటిని అడ్డుకోవాలంటూ ఆదివారం ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, వీఆర్సీ, చిల్డ్రన్స్ పార్కు తదితర ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బుజ్జయ్య మాట్లాడారు. హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుతో క్షణంలో 3.40 లక్షలమంది మరణించారని గుర్తు చేశారు. అలాంటి అణుకుంపటిని రాకుండా అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ ఆరోగ్య సబ్‌కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్, నగర అధ్యక్షుడు పోతంశెట్టి విద్యాచరణ్, డీవైఎఫ్ఐ నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. పోర్టు నిర్మించండి కావలిఅర్బన్: ప్రజల ప్రాణాలను బలిగొనే అణువిద్యుత్ కేంద్రం కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అభివృద్ధి చెందే పోర్టును నిర్మించాలని దళిత మోర్చా నాయకులు, రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు వరలక్ష్మిలు తెలిపారు. స్థానిక బాలకృష్ణారెడ్డినగర్‌లో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నాయపాళెం సమీపంలో తలపెట్టిన అణువిద్యుత్ నిర్మాణ కేంద్రాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ రామాయపట్నం పోర్టు కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో మాట్లాడుతూ కృషి చేస్తున్నారని తెలిపారు. పోర్టును నిర్మిస్తే రెండు జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో గోసాల చార్లెస్, గుర్రం చిట్టిబాబు, ఎస్కే సిరాజ్, ఎస్కే జమీల, ఎస్కే సలార్ పాల్గొన్నారు. -
నేడు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సదస్సు
విద్యారణ్యపురి : జన విజ్ఞాన వేదిక(జేవీవీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 6న ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్లో సదస్సును నిర్వహిస్తున్న ట్లు వేదిక జిల్లా అధ్యక్షుడు డి.ప్రభాకరచారి, ప్రధాన కార్యదర్శి వేల్పుల రా జు ఒక ప్రకటనలో తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం ను అంతర్జాతీయ అపరాల సంవత్సరం–2016 గా ప్రకటించిందని, దీనిని పురస్కరిం చుకొని ఈ సదస్సున నిర్వహించబోతున్నామన్నారు.ఈ సదస్సులో ప్రధా న వక్తగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, విద్యావిభాగం కన్వీనర్ కే బీ ధర్మప్రకాష్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. -
మూర్ఛ రోగులు ఒంటరిగా ఉండరాదు
మూర్ఛ రోగులు వంట, ఈత, ప్రయాణం, ఎల్తైన ప్రదేశాల్లో ఒంటరిగా ఉండరాదని ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.గోపాలం శివన్నారాయణ అన్నారు. జన విజ్ఞానవేదిక, కదిరి శాఖ సీఆర్సీలో మూర్ఛ రోగులకు నిర్వహించిన వైద్య శిబిరానికి ఆయన హాజరై రోగులను పరీక్షించారు. రాయచోటి, పులివెందుల, కర్ణాటక, మొలకల చెరువు నుంచి సుమారు 160 మంది హాజరయ్యారు. మళ్లీ వైద్యశిబిరం సెప్టెంబర్ 18న జరుగుతుందని, జేవీవీ జిల్లా కోశాధికారి బీ.నరసారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జేవీవీ ఉపాధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేంద్రరెడ్డి, సబ్ యూనిట్ మలేరియా సూపర్వైజర్ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.