K. Gopal
-
రూ.7 వేల కోట్ల విలువైన పొగాకు ఎగుమతి లక్ష్యం
రాజమండ్రి రూరల్: విదేశాలకు రూ. ఏడు వేల కోట్ల విలువైన పొగాకు ఎగుమతి లక్ష్యమని టుబాకో బోర్డు చైర్మన్ డాక్టర్ కె. గోపాల్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రిలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థలో బుధవారం జరిగిన వార్షిక పరిశోధనా సమావేశాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 103 దేశాలకు పొగాకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి లక్ష్యం కాగా 205 మిలియన్ కిలోలను బోర్డు కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో పొగాకు వేలానికి 19 ప్లాట్‌ఫారాలు ఉండగా ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు ప్లాట్‌ఫారాల్లో మాత్రమే వేలం జరుగుతోంద న్నారు. అక్కడ కూడా 15 రోజుల్లో వేలం పూర్తవుతుందన్నారు. గత రెండేళ్లుగా అనధికారిక పొగాకు అమ్మకాలను నిరోధించడంతో రైతులకు గిట్టుబాటుధర వచ్చిందన్నారు. నాణ్యతలో విదేశాలతో పోటీ పడేలా పండించాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలని సూచించారు. -
ఉత్తర్వుల వక్రీకరణలో.. ఆంతర్యమేమిటి రామచంద్రా..!
ఓటేరు చెరువును దారాదత్తం చేయడంలో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం ఏ-రిజిష్టర్ మేరకే పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను వక్రీకరించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలకు కట్టబెట్టిన వైనం సీఎంవో ఒత్తిడి మేరకే దుస్సాహసానికి పాల్పడ్డారంటోన్న అధికారవర్గాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకుని తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలో సర్వే నెంబరు 377లో 17.18 ఎకరాల ఓటేరు చెరువు శిఖం భూమిని కొట్టేయడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు పథకం వేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆ మాజీ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయన పంచన చేరి ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇప్పించుకున్నారు. ఎన్నికలకు ముందు సైకిలెక్కి చంద్రబాబుతో జతకట్టి కిరణ్ సర్కారు జారీచేసిన ఉత్తర్వులను ఇప్పుడు అమలు చేయించుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పును తుంగలో తొక్కుతూ రూ.350 కోట్ల విలువైన 17.18 ఎకరాల చెరువు శిఖం భూమిని సొంతం చేసుకోవడాన్ని ‘భూదోపిడీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ వెలికితీసిన విషయం విదితమే. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ సిద్ధార్థ జైన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి శేషయ్యను విచారణ అధికారిగా నియమించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలైన డి.వెంకట్రామనాయుడు మరో 12 మంది ఈ ఏడాది జనవరి 4న సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్లు ఇప్పించాలని అప్పటి రెవెన్యూమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని పరిశీలించాలని అప్పటి కలెక్టర్ కె.రాంగోపాల్‌కు జనవరి 10న రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్.మీనా పంపారు. ఆ వినతిపత్రంపై తిరుపతి రూరల్ తహశీల్దార్ జనవరి 24న, తిరుపతి ఆర్డీవో జనవరి 30న క్షేత్రస్థాయిలో విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. నివేదిక ప్రకారం 377 సర్వే నెంబరు పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం అని తేల్చి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇంతలోనే అంత తేడానా..! రెవెన్యూశాఖకు ఏ-రిజిష్టరే ప్రామాణికం. బ్రిటీషు అధికారులు 1886లో తొలిసారి భూములను సర్వే చేసి ఏ-రిజిష్టర్ రూపొందించారు. దీని ప్రకారం 377 సర్వే నెంబరు పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం. 1916లో సర్వే చేసినప్పుడు ఆ భూమిని ప్రభుత్వ బంజరుగా తప్పుగా పేర్కొనడాన్ని పసిగట్టిన అప్పటి చంద్రగిరి సబ్ కలెక్టర్ రీ-సర్వే చేసి 1925లో చెరువు శిఖంగానే తేల్చి ఏ-రిజిష్టర్‌లో పొందుపరిచారు. అది చెరువు శిఖం భూమేనని సాక్షాత్తూ తిరుపతి ఆర్డీవోనే హైకోర్టుకు పలు కేసుల్లో నివేదించారు. కలెక్టర్ రాంగోపాల్ ఫిబ్రవరి 12న పంపిన నివేదికపై రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా స్పందిస్తూ.. ‘భూమి రికార్డులకు తక్కిన రికార్డులకన్నా ఏ-రిజిష్టరే ప్రామాణికం. ఏ-రిజిష్టర్‌లో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేయండి’ అని ఆదేశిస్తూ మే 22న ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది. బీఆర్ మీనా జారీచేసిన ఉత్తర్వులను వక్రీకరించి అమలు చేసేలా ప్రభుత్వంలో కీలకనేతపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కీలకనేత సీఎంవోను ప్రభావితం చేసి.. రెవెన్యూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే భారీ ఎత్తున పచ్చనోట్లను వెదజల్లినట్లు రెవెన్యూ వర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. సీఎంవో ఒత్తిళ్లు.. పచ్చనోట్ల ప్రభావానికి లొంగిన రెవెన్యూ అధికారులు ఏ-రిజిష్టర్‌ను (రీక్లాసిఫై)పునః వర్గీకరించారు. అప్పుడొకటి.. ఇప్పుడొకటి.. ఫిబ్రవరి 12న కలెక్టర్ రాంగోపాల్ ప్రభుత్వానికి నివేదించిన ప్రకారం సర్వే నెంబరు 377లోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖమే. ఇందుకు 1886, 1925 ఏ-రిజిష్టర్లను ప్రామాణికంగా తీసుకున్నారు. దాని ప్రకారం ఆ భూమి ఏ ప్రైవేటు వ్యక్తులకు చెందినది కాదు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువు భూముల్లో పట్టాలు ఇవ్వకూడదు. దామినేడు చెరువు భూములను ఇందిరమ్మ ఇళ్లకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయడానికి అప్పటి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నిరాకరించడమే అందుకు తార్కాణం. కానీ.. పచ్చ నోట్లకు, సీఎంవో ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు 1916లో ఏ-రిజిష్టర్‌లో చేసిన తప్పుడు మార్పునే ప్రామాణికంగా తీసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీకి రూ.350 కోట్ల విలువైన చెరువు శిఖం భూమిని దారాదత్తం చేయడం గమనార్హం. ఇదే అంశంపై తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు మాత్రమే చేశామని సెలవిచ్చారు. ఆ ఉత్తర్వులను వక్రీకరించారు కదా అని ప్రశ్నిస్తే.. చంద్రగిరి, తిరుపతి రూరల్ తహశీల్దార్ కార్యాలయాల్లో ఏ-రిజిష్టర్లు అందుబాటులో లేవన్నారు. ఈ భూమిపై నడిచిన వివాదాల్లో హైకోర్టుకు రెవెన్యూ అధికారవర్గాలే ఏ-రిజిష్టర్ మేరకు ఆ భూమి చెరువు శిఖమేనని నిర్ధారించారు కదా అని ప్రశ్నిస్తే ఎలాంటి రికార్డుల్లేవని సమాధానం దాటవేశారు. -
పొగాకు ఎగుమతులతో 6 వేల కోట్ల ఆదాయం
పొగాకు బోర్డు చైర్మన్ కె.గోపాల్ గుంటూరు, న్యూస్‌లైన్ : పొగాకు ఎగుమతుల ద్వారా 2013-14 సంవత్సరంలో 6,059.31 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు పొగాకుబోర్డు చైర్మన్ కె.గోపాల్ చెప్పారు. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఎగుమతుల ద్వారా ఐదువేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో పొగాకు ఉత్పత్తులకు లక్ష్యాలను నిర్దేశించామని, ప్రతి సంవత్సరం 270నుంచి 280 మిలియన్ కేజీల పొగాకును ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. లక్షమంది రైతులు ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారని, 2.25 లక్షల ెహ క్టార్లలో వర్జీనియా పొగాకు ఉత్పత్తి చేశామన్నారు. వర్జీనియా పొగాకును సిగిరెట్ పొగాకు అని, ప్రీమియం వెరైటీ అని పిలుస్తారని చెప్పారు. ఉత్పత్తి చేసిన వర్జీనియా పొగాకులో 75శాతం ఎగుమతి చేశామని వెల్లడించారు. బోర్డు ఎగుమతి చేసిన పొగాకును 107దేశాల్లో 137 కంపెనీలు దిగుమతి చేసుకున్నాయని, పశ్చిమయూరప్కు 34శాతం, తూర్పు యూరప్‌కు 14శాతం, మధ్యప్రాచ్య దేశాలకు 11శాతం, ఆగ్నేయాసియాకు 20శాతం, ఆఫ్రికాకు 13శాతం, దక్షిణ అమెరికాకు 8శాతం, ఆస్ట్రేలియాకు ఒకశాతం ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే పొగాకు నాణ్యతతోపాటు శుభ్రంగా ఉండాలని ఇంటర్నేషనల్మార్కెట్ ఎదురు చూస్తోందని, రైతులనుంచి క్వాలిటీ ఉన్న పొగాకు వచ్చేలా పొగాకు బోర్డు చర్యలు తీసుకుందనీ చెప్పారు. తద్వారా మంచిరేటు వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో180 మిలియన్ కేజీలు ఉత్పత్తి అయ్యిందని, 19 వేలం కేంద్రాల ద్వారా 65 రోజుల్లో 75 మిలియన్ కేజీల పొగాకు మార్కెట్ అయ్యిందని చెప్పారు. .జూలై నెలాఖరునాటికి మిగిలిన పొగాకు అమ్మకాలు జరిగేలా చూస్తామని, వేలం కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ సిస్టం అన్ని చోట్లా ఉండటం వల్ల అమ్మకాలు త్వరగా జరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కిలో పొగాకుకు 171 రూపాయల ధర వచ్చిందని, హైగ్రేడ్ పొగాకు ఉత్పత్తి ఈ ఏడాది బాగా పెరిగి, లో గ్రేడ్ రేషియో తగ్గిందన్నారు. లో అండ్ మినిమమ్ గ్రేడ్‌కు కూడా డిమాండ్ బాగానే ఉన్నట్లు గోపాల్ చెప్పారు. -
ఎందుకింత నిర్లక్ష్యం?
=మూడేళ్లుగా కరువున్నా ఏం చేస్తున్నారు =చిగురు గోరు చిక్కుడు సాగుపై దృష్టి పెట్టండి =ఫౌల్ట్రీపై దృష్టి సారించండి =ప్రయోగాలన్నీ మదనపల్లె డివిజన్‌లోనే చేపట్టాలి =తూతూమంత్రంగా పనిచేయడం మానుకోండి =ఆత్మ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ కె.రాంగోపాల్ చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మూడేళ్లుగా జిల్లాలో కరువు తాండవిస్తున్నా రైతులకు భరోసా ఇచ్చే పంటలపై దృష్టి పెట్టకుండా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రాంగోపాల్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు నష్టపోతున్నారని తెలి సినా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించకుండా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. అజెండాలో తొలి అంశంగా చిగురు గోరు చిక్కుడు సాగుపై సుదీర్ఘ చర్చ జరిగింది. తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించే ఈ పంట జిల్లాలో సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందని శాస్త్రవేతలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా రాజస్థాన్‌లో ఎక్కువగా సాగయ్యే ఈ పంటకు సంబంధించి అధ్యయనం చేశామని, దీని విత్తనాలు టన్ను రూ.6200 నుంచి రూ.32 వేల వరకు పలుకుతాయని తెలిపారు. మన జిల్లాలో తక్కువ కాకుండా రూ.17 వేలకు విక్రయించ వచ్చునని, ఎకరాకు కనీసం 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేతలు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం కలిగించే పంటలపై దృష్టి పెట్టాలని అధికారులను హెచ్చరించారు. తూతూమంత్రంగా పనిచేయడం మానుకోవాలని హితవు పలికారు. చిగురు గోరు చిక్కుడును జిల్లాలో పెద్ద ఎత్తున సాగులోకి తేవడానికి మరోసారి రాజస్థాన్‌కు వెళ్లి పరిశీలించి రావాలని సూచించారు. 2015 రబీ సీజన్ నాటికి జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు ఈ పంటను సాగు చేసుకుని లాభాలు పొందడానికి అధికారులు కృషి చేయాలన్నారు. మామిడి, చెరుకు తదితర వ్యర్థాల ద్వారా ఇటు రైతులకు అటు వాటిని తిన్న పశువులకు నష్టం వాటిళ్లకుండా ఉండేందుకు కంపోస్టు తయారు చేయడానికి కాలుష్య నివారణ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. కోళ్ల పరిశ్రమ యూనిట్ ఏర్పాటు జిల్లాలో కోళ్ల పరిశ్రమకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ద్వారా తొలుత లక్ష కోళ్లతో ఫారం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ శాఖ జేడీని కలెక్టర్ ఆదేశించారు. పాడి ఆవున్న ప్రతి ఇంటిలో 5 నుంచి 10 కోళ్లను పెంచుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాకాలంలోపు కోళ్ల పరిశ్రమ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు నాబార్డు ద్వారా నిధులు సమీకరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచైనా టమాట సాగులో యాంత్రికీకరణ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. ప్రయోగాలన్నీ మదనపల్లె డివిజన్‌లోనే.. పంట ప్రయోగాలన్నీ ఇకపై మదనపల్లె డివిజన్‌లోనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పంట ప్రయోగాలకు పడమటి మండలాల్లోనే వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఆత్మ పీడీ అనంతరావు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ జేడీలు రవికుమార్, శ్రీనివాసరావు, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, నాబార్డు ఏజీఎం రవిబాబు, రైతులు జయచం ద్ర చౌదరి, బాలక్రిష్ణారెడ్డి, విజయచంద్రనాయు డు పాల్గొన్నారు.