kaapu reservations
-
చంద్రబాబుకు ముద్రగడ లేఖ
సాక్షి, తూర్పు గోదావరి : కాపు రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలని సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈబీసీ కోటాలో తమ జాతికి ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ బిల్లు పంపారని, బీసీల ప్రాతిపదికగా ఇస్తున్న ప్రయోజనాలు తమకు వర్తిసాయా అని ఆ లేఖలో చంద్రబాబును ప్రశ్నించారు. 2017లో తీర్మానం చేస్తూ.. కేంద్రానికి పంపిన బీసీ-ఎఫ్ అమలు చేస్తారా? లేక 2019 ఈబీసీ బిల్లు అమలు చేస్తారో స్పష్టతనివ్వాలని కోరారు. 2019 బిల్లు మీరు ఇచ్చిందా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఇచ్చిందా చెప్పాలంటూ ప్రశ్నించారు. అసలు కాపులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం ఉందా అని మండిపడ్డారు. రిజర్వేషన్ తరగతులకు అందే ప్రయోజనాలు తమ జాతికి అందేంతవరకు తన ఉద్యమం ఆగదని అన్నారు. -
‘అప్పుడు దళితులు.. ఇప్పుడు కాపుల వంతు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని అటెకెక్కించింది చంద్రబాబేనని మండిపడ్డారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ పేరుతో నాడు దళితులను మోసం చేసిన బాబు, నేడు కాపులను మోసం చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ చేయడం చేతగాని చంద్రబాబు కాపులకు ఏం ఒరగబెడతాడని ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బాబు చేసే ప్రతి పనీ ఓట్లు, సీట్లు కోసమే ఉంటుందని అన్నారు. ఏపీ, తెలంగాణాల్లో టీడీపీ అంతరించిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
కాపు ఓట్లతోనే చంద్రబాబు సీఎం అయ్యారు
-
వైఎస్ జగన్ మాటిస్తే తప్పే మనిషి కాదు
-
'ముద్రగడతో చర్చలకు వెళ్లడం లేదు'
రాజమండ్రి: కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టనున్న కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో మాట్లాడతామని టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కేవలం దీక్ష విరమించాలని ఆయనకు సూచించేందుకు మాత్రమే ఆయనను కలవనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవోల ద్వారా కాపులకు రిజర్వేషన్లు కల్పించినా న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. కమిషన్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తేనే వేటికైనా న్యాయం జరుగుతుందని టీడీపీ నేత అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని శుక్రవారం ఉదయం ఆమరణ దీక్ష చేపట్టనున్న ముద్రగడ పద్మనాభానికి నచ్చచెబుతామని తోట త్రిమూర్తులు వివరించారు.