kadiyam nursery
-
కడియం నర్సరీలో వెరైటీగా.. హ్యాపీ న్యూ ఇయర్
2024కి వీడ్కోలు చెబుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తూర్పు గోదావరి జిల్లా కడియంలోని పల్లా వెంకన్న నర్సరీలో వేలాది మొక్కలతో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2025’ అంటూ అక్షరాకృతులను మొక్కలతో అలంకరించారు.పల్లా వెంకన్న నర్సరీ రైతు పల్లా సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) కుమారులు, నర్సరీ యువ రైతులు వెంకటేశ్, వినయ్ తీర్చిదిద్దిన ఈ ఆకృతుల మధ్య ఫొటోలు తీయించుకోవడానికి సందర్శకులు పోటీపడుతున్నారు. 50 మంది కార్మికులు 4 రోజుల పాటు శ్రమించి వేల మొక్కలతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ మొక్కల కూర్పును సందర్శకుల కోసం జనవరి 18 వరకు నర్సరీలో ఉంచనున్నారు. వైజాగ్‌లో న్యూ ఇయర్ జోష్నూతన సంవత్సర వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. విశాఖపట్నం బీచ్‌లో నృత్యకారిణులు విభిన్నంగా కొత్త ఏడాది ఆగమనాన్ని స్వాగతించారు. వైజాగ్ నగరంలో చాలా ప్రాంతాల్లో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. సెల్ఫీలు, ఫొటోలతో వైజాగ్ వాసులు సందడి చేశారు. ఆటపాటలతో హ్యపీ న్యూ ఇయర్ జరుపుకున్నారు. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో గోదారి ‘కళ’కళలుకొత్తపేట: ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో గోదారి ‘కళ’కళలు కనువిందు చేయనున్నాయి. అక్కడ జరిగే ‘జై మా భారతి నృత్యోత్సవం’లో పాల్గొనే అవకాశం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 100 మంది గరగ నృత్యం కళాకారులకు లభించింది. గణతంత్ర వేడుకలకు దేశవ్యాప్తంగా 29 జానపద, 22 గిరిజన కళారూపాల ప్రదర్శనలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ప్రదర్శనల్లో ప్రముఖ జానపద సంప్రదాయ ప్రదర్శనలుగా ఖ్యాతి పొందిన గరగ నృత్యం, వీరనాట్యం కళారూపాలకు కేంద్ర సాంస్కృతిక శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెల గ్రామానికి చెందిన గరగ నృత్యం, వీరనాట్యం కళాకారుడు కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ ఆధ్వర్యాన శివపార్వతి గరగ నృత్యం కళాకారులు 100 మంది డిసెంబర్ 28న ఢిల్లీ పయనమయ్యారు. చదవండి: బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు' -
కడియం నర్సరీలకు రతన్ టాటా ప్రశంసలు
Kadiyam Nursery Owner Veerababu Margani Met Ratan Tata: కడియం విశిష్టతలు ఎల్లలు దాటుతున్నాయ్. గతంలో ముకేశ్ అంబానీ సైతం పెద్ద ట్రక్కుల్లో ఇక్కడి నుంచి చెట్లను తీసుకెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది, ఇప్పుడు ఈ జాబితాలో మరో పారిశ్రామికవేత్త రతన్ టాటా చేరారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలను టాటా గ్రూప్ సంస్థ చైర్మన్ రతన్ టాటా ప్రశంసలు అందించారు. కడియం గౌతమీ నర్సరీ అధినేత వీరబాబు మార్గాని కుటుంబ సభ్యులు ముంబైలోని రతన్ టాటా స్వగృహంలో కలిశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మర్గానిక కుటుంబ సభ్యులు కడియం నర్సరీలు విశిష్టతను రతన్‌టాటాకు వివరించారు. నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేస్తూ విశ్వవ్యాప్తంగా కడియం రైతులు గుర్తింపు పొందడాన్ని ఆయన అభినందించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా విశేష గుర్తింపు పొందిన రతన్ టాటా కలవడం ఎంతో ఆనందంగా ఉందని వీరబాబు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: మీకెందుకయ్యా కార్లు అన్న ‘ఫోర్డ్’.. ఇండియా సత్తా చూపిన రతన్‌టాటా -
కడియం నర్సరీలో ఖరీదైన మొక్కలు
కడియం నుంచి అంబానీ పార్కుకు రెండు చెట్లు తరలించారా.. ఒక్కో దాని ఖరీదు పాతిక లక్షల రూపాయలట.. రెండు రోజుల నాటి ఈ వార్త అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. మొక్కల్లో ఇంత ఖరీదైనవి ఉంటాయా? అని ఒక్కసారిగా దీనిపై చర్చ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలోకి ఒక్కసారి తొంగిచూస్తే ఇలాంటి విశేషాలున్న మొక్కలు లేదా చెట్లు ఎన్నో కనిపిస్తాయి. ఆనందాన్ని.. ఆశ్చర్యాన్ని పంచుతాయి. రూపంతో పాటు, ధరలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి మరి.. ఈ తరహా ప్రత్యేక మొక్కలను కడియం ప్రాంత నర్సరీ రైతులు దేశ విదేశాల నుంచి తీసుకువస్తున్నారు. అక్కడి వాతావరణాన్ని ఇక్కడ కృత్రిమంగా కల్పించి మరీ పెంచి అభివృద్ధి చేస్తున్నారు. విలాసవంతమైన ఈ మొక్కలను అభివృద్ధి చేయడం అందరి రైతులు వల్లా సాధ్యం కాదండోయ్.. ఆసక్తి, స్థోమత ఉన్న రైతులు మాత్రమే వీటిని అభివృద్ది చేస్తున్నారు. సంపన్నులే వీటిని కొనుగోలు చేస్తుంటారు. కడియం నర్సరీలో ఇలాంటి కొన్ని మొక్కల గురించి తెలుసుకుందామా.. లక్కీ.. ఆలివ్ ఇటీవల అంబానీ పార్క్‌కు కడియం నుంచి తరలించిన చెట్టు పేరు ఆలివ్. పాశ్చాత్య దేశాల్లో అదృష్టాన్ని తెచ్చేదిగా దీన్ని భావిస్తుంటారు. వందల ఏళ్ల వయసున్న ఈ చెట్టును పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. స్పెయిన్ నుంచి తీసుకువచ్చిన ఆలివ్ ప్లాంట్స్ కడియం నర్సరీలో లభిస్తున్నాయి. 150 నుంచి 210 సంవత్సరాల వరకు వయసున్న వీటిని అమ్మకానికి పెట్టారు. ధర రూ.25 లక్షల వరకూ ఉంటుంది. మన దేశంలో ఆవునెయ్యికి ఎంత ప్రాధాన్యం ఉందో. ఆలివ్ మొక్కల నుంచి తీసిన నూనెకు కూడా కొన్ని దేశాల్లో అంతే ప్రాధాన్యం ఇస్తారని వీటిని అభివృద్ధి చేస్తున్న రైతులు చెబుతున్నారు. (చదవండి: ఒక్కో మొక్క రూ.25 లక్షలు!) ఆకారమే అందం ఫైకస్ కుటుంబానికే చెందిన ఈ మొక్క రూపు చూడగానే హత్తుకుంటుంది. ఆకర్షణీయంగా ముచ్చటగొలుపుతుంది. ఆసియా దేశాలైన చైనా, తైవాన్, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో వీటిని పెంచుతుంటారు. కడియంలోని రైతులు వీటిని దిగుమతి చేసుకుంటున్నారీ మధ్య. మరింతగా అభివృద్ధి పరుస్తున్నారు. మొక్క వయస్సును బట్టి ధరలు ఉంటాయి. 15 ఏళ్ల వయసుంటే రూ.లక్ష వరకు ఉంటుంది. (చదవండి: ప్రపంచ పటంలో ఉలవపాడు మామిడి..) కొమ్మకొమ్మకో గుబురు ఫైకస్ కుటుంబానికే చెందిన మరో రకం మొక్క మల్టీహెడ్ బోన్సాయ్.. సాధారణంగా మొక్క ఒకే గుబురుగా ఎదుగుతుంది. ఈ మొక్క మాత్రం ప్రతి కొమ్మకూ ఒక గుబురుగా ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. చూపరులను కట్టి పడేస్తుంది. దీని ధర కూడా దాదాపు రూ.లక్ష వరకు ఉంటుంది. ఈ తరహా బోన్సాయ్ కూడా మన కడియం నర్సరీలో దొరుకుతుంది. ఇంపోర్టెడ్ ఫైకస్ కండలు తిరిగిన దేహం మాదిరిగానే కన్పించే ఈ మొక్కను ఇంపోర్టెడ్ ఫైకస్ అని వ్యవహరిస్తున్నారు. ఇది కూడా విదేశీ అతిధే. ఎంతో నైపుణ్యంతో అల్లినట్లు కొమ్మలను ఒకదానికొకటి అతుక్కుని అందంగా కనువిందు చేస్తుంది. ఈ మొక్క ఫైకస్ కుటుంబానికి చెందినదే. పదేళ్ల వయసున్న మొక్కల నుంచి మన కడియం ప్రాంత నర్సరీల్లో లభ్యమవుతున్నాయి. వీటి ధర కూడా రూ.3 లక్షల నుంచి ప్రారంభమతుంది. వయసును బట్టి ధర పెరుగుతుంది. ఇవే కాకుండా బోన్సాయ్ వృక్షాలు, కజిరినా వంటి మంచు ప్రాంత మొక్కలు, బిస్మార్కియా వంటి ప్రత్యేక మొక్కలు కూడా కడియంలో కొలువుతీరాయి. మోరింగా.. మజాకా.. మునగ జాతికి చెందిన ‘మోరింగా’ మొక్క కూడా ఆఫ్రికా ఖండం నుంచి ఇక్కడకు వచ్చింది. ఆఫ్రికా ప్రాంతంలో ఈ మొక్క ఆకుల్లో ఔషధ గుణాలున్నాయని భావిస్తారు. వీటి పొడిని ఆహారంలో కూడా తీసుకుంటారు. ప్రస్తుతం అలంకరణ మొక్కల జాబితాలోనే ఈ మొక్కను మనవాళ్లు పరిగణిస్తున్నారు. ఇప్పుడిప్పుడే దీనికి డిమాండ్ పెరుగుతోంది. దాని ఎత్తే గమ్మత్తు ఏదో నియమం పెట్టుకున్నట్టు ఏడాదికి ఒకే ఒక సెంటీ మీటర్ మాత్రమే ఎత్తు పెరుగుతుందీ మొక్క. దాని పేరు యూకా రోస్ట్రేటా. అంతే కాకుండా బంగారు వర్ణంలో మొదలు భాగం మెరిసిపోతుంది. ఆకులు మాత్రం వెండి రంగులో ఉండి ఆకట్టుకుంటాయి. ఎడారి జాతికి చెందిన ఈ మొక్క ఎటువంటి వాతావరణంలోనైనా బతికేస్తుందని నర్సరీ రైతులంటున్నారు. స్పెయిన్‌కు చెందిన ఈ రకం మొక్కలను కూడా కడియం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ధర రూ.50 వేల నుంచి ప్రారంభమవుతుంది. -
ఒక్కో మొక్క రూ.25 లక్షలు!
సాక్షి, కడియం: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గుజరాత్లో అభివృద్ధి చేస్తున్న భారీ పార్కులో నాటేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి మొక్కలను తరలించారు. కడియంలోని వీరవరం రోడ్డులో మార్గాని వీరబాబుకు చెందిన గౌతమీ నర్సరీ నుంచి రెండు ఆలివ్ మొక్కలను గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాలీపై తీసుకువెళ్ళారు. స్పెయిన్ నుంచి తీసుకువచ్చిన వీటి వయస్సు సుమారు 180 సంవత్సరాలు ఉంటుందని నర్సరీ రైతు మార్గాని వీరబాబు తెలిపారు. ఒక్కో మొక్క ధర రూ.25 లక్షలు ఉంటుందని సమాచారం. రెండేళ్ళ క్రితం ఇక్కడికి తెచ్చి, వాటిని అభివృద్ధి చేసినట్లు వీరబాబు వివరించారు. (చదవండి: సత్తా చాటిన విశాఖ; హైదరాబాద్‌ను వెనక్కునెట్టిన సుందరనగరి) -
సుమధుర భరితం
పార్వతీపురం : పూలంటే మహిళలకు ప్రాణం. మూరెడు మల్లెపూలు ముడుచుకుని మురిసిపోతారు. కనీసం ఒక గులాబీనో, చామంతో.. బంతో చివరికి మందార పువ్వయినా ముడవనిదే వారికి సంతృప్తి ఉండదు. అలాంటిది.. కడియం పూల మొక్కలు కాళ్ల దగ్గరే వాలితే ఇంకేముంది. పరుగులు పెడుతూ నచ్చిన మొక్కలను కొనుగోలు చేసుకుంటూ పూల మొక్కలపై వారికున్న ప్రేమను చాటుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన పూలమొక్కల వ్యాపారి జి.సత్యనారాయణ 22 ఏళ్లుగా పార్వతీపురంలో పూల మొక్కల వ్యాపారం చేస్తున్నారు. పలు రకాల వృక్షజాతులు, వివిధ రకాల పూల మొక్కలను పార్వతీపురం మండలం వెంకంపేట గోరీల కూడలిలో విక్రయిస్తున్నారు. ఇక్కడ హైబ్రీడ్ పూణె, గులాబీ, బెంగళూరు గులాబీ, కోల్కత్తా గులాబీ, తెల్ల గులాబీ, కాశ్మీర్ గులాబీలతో పాటు పదిహేను రకాల మందార మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, ఆరంజ్, యాపిల్ రేగు, జంబో నేరేడు, స్వీట్ నిమ్మ, మునగ, ఉసిరి, సపోటా వంటి పండ్ల రకాలను కూడా విక్రయిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు పట్టణ ప్రజలు ఎగబడుతున్నారు. ఇంటి ఆవరణనే పూలతోటలుగా మలిచి ఆకర్షణగా తీర్చిదిద్దడం సాధారణమైంది. నిన్నటి వరకు పట్టణానికి పరిమితమైన వాతావరణం ఇప్పుడు పల్లెలకు పాకుతుండటంతో పూల మొక్కలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. మొక్కలను మంచి గిరాకీ ఏర్పడుతుండటంతో వ్యాపారులు కూడా వినియోగదారుల కోరిక మేరకు అరుదైన పూలు, పండ్ల రకాల మొక్కలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీరి వద్ద రూ.20 నుంచి రూ.500 విలువైన పలు రకాల మొక్కలు లభిస్తున్నాయి. వేసవిలో కష్టం ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి మొక్కలను సులువుగా పెంచవచ్చు. అదే వేసవి కాలంలో అయితే మొక్కల పెంపకం కష్టంతో కూడుకున్న పని. వర్షాకాలంలో ఎక్కువ రకాల మొక్కలను వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దిగుమతి చేస్తున్నాం. వేసవిలో నీరు లేక మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున కొన్ని రకాల్నే అందుబాటులో ఉంచుతున్నాం. ప్రజలు కొత్త రకాల మొక్కలను కోరుకుంటున్నారు. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి మొక్కలను తడపాల్సి వస్తుంది. ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తే ఇతర రాష్ట్రాలు, దేశాల మొక్కలను కూడా దిగుమతి చేసుకునే వీలుంటుంది. – సత్యనారాయణ, వ్యాపారి -
కడియమే కదిలొచ్చింది
-
హైదరాబాద్ మెట్రోకు ‘కడియం మొక్కలు’
రాజమండ్రి క్రైం: ప్రపంచంలోనే మొదటి సారిగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో కడుతున్న ఏకైక మెట్రో రైల్ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో సుందరీకరణకు ఆరు లక్షల మొక్కలను తూర్పు గోదావరి జిల్లా కడియం నుంచి తీసుకువెళుతున్నట్టు ప్రాజెక్ట్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇక్కడి షెల్టన్ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబద్‌లో 72 కిలో మీటర్ల మేర మెట్రో పనులు 2017 జూన్‌నాటికి పూర్తవుతాయని ఆయన వివరించారు. మొత్తం రూ. 14,132 కోట్లతో మెట్రో పనులు చేపడుతున్నామని, ఇప్పటి వరకు 55 శాతం పనులు పూర్తయ్యాయని ఎండీ తెలిపారు. మెట్రో సుందరీకరణలో భాగంగా ఈ ఏడాది లక్ష సాధారణ మొక్కలు, 5 లక్షల పూల మొక్కలు నాటుతామన్నారు. మెట్రో రైల్వే నిర్వహణకు ప్రపంచంలోనే అత్యాధునికమైన కమ్యూనికేషన్ బేస్డ్ టెక్నాలజీ సిస్టం(సీబీటీఎస్)ను వినియోగిస్తున్నట్లు ఎండీ వివరించారు. -
కొత్తందాలతో రా...రమ్మంటున్న నర్సరీలు