Kakarala Padma
-
కాకరాల పద్మ ఏపీ పోలీసుల అదుపులో లేరు
సాక్షి, హైదరాబాద్: రివల్యూషనరీ విమెన్ మూమెంట్ నాయకురాలు కాకరాల పద్మను కోర్టులో హాజరుపర్చేలా ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలన్న హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు మూసివేసింది. పద్మ తమ అధీనంలో లేరని, అదుపులోకి తీసుకోలేదని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు నివేదించారు. దాంతో గురువారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తు లు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తమిళనాడులోని చెన్నిమలై రైల్వేస్టేష న్లో ఏపీ గ్రేహౌండ్స్ పోలీసులు కాకరాల పద్మను అదుపులోకి తీసుకున్నారని, ఆమెకు ప్రాణహాని ఉన్నందున వెంటనే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని న్యాయవాది డి.సురేశ్‌కుమార్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుకు వచ్చింది. పద్మ తమ పోలీసుల అధీనంలో లేరంటూ హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయడంతో ధర్మాసనం పై నిర్ణయం తీసుకుంది. -
కాకరాల పద్మ ఎక్కడ?
ఏపీ, తమిళనాడు పోలీసులకు హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న రెవల్యూషనరీ విమెన్ మూమెంట్ నాయకురాలు కాకరాల పద్మను కోర్టులో హాజరుపర్చాలన్న కేసులో పోలీసులకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ పిటిషన్లు వేయాలని ఏపీ, తమిళనాడుæ డీజీపీలు, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. తమిళనాడులోని చెన్నిమలై రైల్వేస్టేషన్లో ఏపీ పోలీసులు పద్మను అదుపులోకి తీసుకొని, ఆమెను ఏకోర్టులోనూ హాజరుపరచలేదని న్యాయవాది డి.సురేశ్‌కుమార్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.