కాకరాల పద్మ ఏపీ పోలీసుల అదుపులో లేరు | Kakarala Padma is not in our custody: AP police to high court | Sakshi
Sakshi News home page

కాకరాల పద్మ ఏపీ పోలీసుల అదుపులో లేరు

Published Fri, Jul 14 2017 4:17 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

కాకరాల పద్మ(ఫైల్‌) - Sakshi

కాకరాల పద్మ(ఫైల్‌)

రివల్యూషనరీ విమెన్‌ మూమెంట్‌ నాయకురాలు కాకరాల పద్మను కోర్టులో హాజరుపర్చేలా ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలన్న హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు మూసివేసింది.

సాక్షి, హైదరాబాద్‌: రివల్యూషనరీ విమెన్‌ మూమెంట్‌ నాయకురాలు కాకరాల పద్మను కోర్టులో హాజరుపర్చేలా ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలన్న హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు మూసివేసింది. పద్మ తమ అధీనంలో లేరని, అదుపులోకి తీసుకోలేదని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు నివేదించారు. దాంతో గురువారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తు లు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

తమిళనాడులోని చెన్నిమలై రైల్వేస్టేష న్‌లో ఏపీ గ్రేహౌండ్స్‌ పోలీసులు కాకరాల పద్మను అదుపులోకి తీసుకున్నారని, ఆమెకు ప్రాణహాని ఉన్నందున వెంటనే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని న్యాయవాది డి.సురేశ్‌కుమార్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుకు వచ్చింది. పద్మ తమ పోలీసుల అధీనంలో లేరంటూ హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలు కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయడంతో ధర్మాసనం పై నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement