Kalairajan
-
నాకెవ్వరూ పోటీ కాదు: స్టాలిన్
చెన్నై: కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కకుండా చేయడం, రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం మీడియాకు తెలిపారు. టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దక్షిణ చెన్నై సెక్రెటరీగా వ్యవహరిస్తున్న వీపీ కళైరాజన్ ఈ రోజు మధ్యాహ్నం డీఎంకేలో చేరారు. తిరుచ్చిలో జరిగిన ఒక సభలో కళైరాజన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏఎంఎంకేతోపాటు వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. బీజేపీ, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కళైరాజన్ మాట్లాడుతూ ‘తమిళనాడును కాపాడే సత్తా, ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తెగువ స్టాలిన్‌కే ఉన్నాయన్నారు. కళైరాజన్‌ను ఏఎంఎంకే నుంచి దినకరన్ బుధవారం బహిష్కరించారు. వీ సెంథిల్ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండో నేత కళైరాజన్. -
సెల్వంను చంపేస్తా.. శశి అనుచరుడిపై కేసు
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను హతమారుస్తానని హెచ్చరించిన అన్నా డీఎంకే మాజీ ఎమ్మెల్యే, శశికళ మద్దతుదారుడు వీపీ కలైరాజన్పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కుట్రతోనే తనపై కేసు నమోదు చేశారని కలైరాజన్ ఆరోపించారు. దక్షిణ చైన్నై జిల్లా పార్టీ కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు. అన్నా డీఎంకే శాసన సభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికైన తర్వాత పన్నీరు సెల్వం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. శశికళ వర్గీయులు తన చేత బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారని బాంబు పేల్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళకు వీరవిధేయుడైన కలైరాజన్.. పన్నీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెల్వంను చంపేస్తానని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కలైరాజన్పై కేసు నమోదు చేశారు. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట