kalyan station
-
మృత్యువు నుంచి వృద్ధుడిని కాపాడిన లోకో పైలట్లు!
ముంబై: ముంబై-వారణాసి ప్రత్యేక రైలు డ్రైవర్లు సకాలంలో స్పందించి అత్యవసర బ్రేకులు వేయడంతో ముంబై సమీపంలోని కళ్యాణ్ స్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్న ఒక వృద్ధుడు నేడు చావు నోటి నుంచి తప్పించుకొని బయటపడ్డారు. థానేలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. "రైల్వే ట్రాక్ లను దాటడం చట్టవిరుద్ధం, ప్రమాదకరం. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయే అవకాశం ఉండవచ్చు. ముంబై-వారణాసి స్పెషల్ రైలు 02193కు చెందిన ఎల్ పీఎస్ కె. ప్రధాన్, ఏఎల్ పీ రవిశంకర్ పైలెట్లు కళ్యాణ్ స్టేషన్ వద్ద ట్రాక్ దాటుతున్న సీనియర్ పౌరుడిని అత్యవసర బ్రేకులు వేసి కాపాడారు. సంతోష్ కుమార్ సీపీడబ్ల్యుఐ వారిని హెచ్చరించినట్లు" సెంట్రల్ రైల్వే తన ట్వీట్ లో పేర్కొంది. కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో 70 ఏళ్ల హరి శంకర్ రైలు వస్తున్నప్పుడు పట్టాలు దాటుతుండగా ఆకస్మికంగా పడిపోయారు. అతను పడిపోవడం గమనించిన చీఫ్ పర్మనెంట్ వే ఇన్ స్పెక్టర్(సీపీడబ్ల్యుఐ) సంతోష్ కుమార్, డ్రైవర్లు లోకో పైలట్ ఎస్ కె ప్రధాన్, అసిస్టెంట్ లోకో పైలట్ జీ. రవిశంకర్ లను హెచ్చరిస్తూ పట్టాలపై దాటుతున్న వృద్ధుడికి తెలిసేలా హెచ్చరికలు చేయాలని అరిచారు. ఆ హెచ్చరికను కాదని వెంటనే ఇద్దరు లోకో పైలట్లు అత్యవసర బ్రేకులు వేసి వృద్ధుడిని కాపాడి తర్వాత రైలు కింద నుంచి అతనిని బయటకు తీశారు. ఇప్పడు ఈ వీడియొ సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతుంది. సకాలంలో స్పందించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఇద్దరు లోకోమోటివ్ పైలట్లు, సీపీడబ్ల్యుఐకి సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కన్సల్ ఒక్కొక్కరికి ₹2,000 నగదు బహుమతిని ప్రకటించారు. Shri Alok Kansal, @GM_Crly announced on the spot cash award of ₹2,000/- each to LP, ALP and CPWI (Chief Permanent Way Inspector) for their timely act of saving the precious life of human being (2/2) — Central Railway (@Central_Railway) July 18, 2021 -
పట్టాలు తప్పిన ‘అమరావతి’
సాక్షి, ముంబై: అమరావతి నుంచి ముంబై వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 4.50 గంటల ప్రాంతంలో కల్యాణ్ స్టేషన్లో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులెవరూ గాయపడలేదని రీజినల్ అధికారి అరుణేంద్ర కుమార్ చెప్పారు. ఈ ఘటన లోకల్‌తోపాటు దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన అన్నారు. కల్యాణ్ స్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై రైలు వస్తుండగా ఇంజిన్, వెనకాలే ఉన్న ఓ బోగీ పట్టాలు తప్పినట్లు కుమార్ చెప్పారు. ఈ ఘటన కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది ఇంజిన్, బోగీని పట్టాలు ఎక్కించే పనులు ప్రారంభించారు. ప్రయాణికుల ఇబ్బందులు... అమరాతి-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా వెనకాలే వస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ముఖ్యంగా సికింద్రాబాద్-ముంబై సీఎస్టీ మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఠాణే స్టేషన్‌కు ఉదయం అరున్నరకు రావాల్సిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ 10 గంటల తర్వాత చేరుకుందని ప్రయాణికులు కొల్లూరి మహేశ్, ఉషారాణి న్యూస్‌లైన్‌కు చెప్పారు. ఇదిలాఉండగా, మన్మాడ్-ముంబై-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్, మన్మాడ్-కుర్టా టర్మినస్-మన్మాడ్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయగా, భుసావల్-పుణే ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్-దౌండ్ మీదుగా దారి మళ్లించారు. లోకల్ రైళ్లపై ప్రభావం రైలు పట్టాలు తప్పడంతో నాలుగో నంబర్ ప్లాట్ఫారం నిరుపయోగంగా మారింది. దీంతో మిగతా ప్లాట్‌ఫారాలపై అదనపు భారం పడింది. దీని ప్రభావం లోకల్ రైళ్లపై కూడా పడింది. పలు లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల ఉదయం ఆసన్‌గావ్, టిట్వాల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఇతరులు తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు.