టీడీపీ నేత గెస్ట్‌హౌస్‌కు నిప్పెట్టిన 'తమ్ముళ్లు'
విశాఖపట్నం జిల్లా టీడీపీలో వరుసగా రెండవరోజు కూడా అసమ్మతి సెగ ఎగసిపడింది. అరకు ఎమ్మెల్యే టికెట్ స్థానికేతరుడికు ఎట్లా ఇస్తారంటూ స్థానిక టీడీపీ కార్యకర్తుల బుధవారం చెలరేగిపోయారు. అందులోభాగంగా టీడీపీ టికెట్ కేటాయించిన ఎమ్మెల్యే అభ్యర్థి కుంభా రవిబాబు గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. గెస్ట్ హౌస్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం గెస్ట్ హౌస్ పై ప్రెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జిల్లా నేతకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని స్థానిక టీడీపీ కార్యకర్తులు టీడీపీ నేతలను హెచ్చరించారు. అయితే విజయనగరం జిల్లా ఎస్.కోట నుంచి గతంలో ఎమ్మెల్యేగా కుంభా రవి విజయం సాధించారు. ఆయనకు ఈ సారి అరకు ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించారు. దాంతో పార్టీకి ఎన్నో ఏళ్లుగా స్థానికంగా సేవలు చేస్తున్నా తమను కాదని బయట వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తారా అంటూ తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. అలాగే ఇటీవలే టీడీపీలో చేరిన భీమీలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌పై మంగళవారం నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీహెచ్ అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.