Kanaka Raj
-
మల్లన్నసాగర్ ముంపు ఇళ్ల కూల్చివేతలో విషాదం
కొండపాక(గజ్వేల్): మల్లన్నసాగర్ ముంపు గ్రామ మైన ఎర్రవల్లిలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టిన క్రమంలో విద్యుత్ స్తంభం కూలి మీద పడటంతో ఓ యువకుడు మృతి చెందారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక, తొగుట మండలాల సరిహద్దులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి ఆదివారం తెల్లవారుజామున గోదావరి నీటి తరలింపునకు ట్రయల్‌రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎర్రవల్లిలో అధికారులు గుట్టుచప్పుడుకాకుండా ఇళ్లు కూల్చివేత చేపట్టారు. గజ్వేల్ మండలం ముట్రాజ్‌పల్లి శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటున్న బాధితులు విషయం తెలుసుకొని శనివారంరాత్రి ఎర్రవల్లికి వచ్చి తమ ఇళ్లల్లోని సామాన్లను సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆరె కనకరాజు(28) తన ఇంట్లోంచి సామాన్లను బయటకు తీస్తుండగా ఆ పక్కనే ఇంటిని కూల్చివేస్తున్న జేసీబీ సమీపంలోని విద్యుత్‌స్తంభానికి బలంగా తగిలింది. దీంతో కరెంట్ తీగలు తెగిపోయి కనకరాజుపై స్తంభం పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే కనకరాజును అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యు లు ధ్రువీకరించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల కూల్చి వేత పనులెలా చేపడతారంటూ ఉస్మా నియా ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కనకరాజు కుటుంబానికి రూ.20 లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ అధికారులు హామీనిచ్చే వరకు పోస్టుమార్టం చేయనివ్వబోమంటూ పట్టుబట్టారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధితకుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామంటూ హామీనివ్వడంతో శాంతించారు. మృతుడికి రెండు న్నరేళ్ల కూతురు ఉంది. భార్య శ్యామల 4నెలల గర్భవతి. ఎర్రవల్లిలో నేలమట్టమైన ఇళ్లు ఎర్రవల్లిలో విషాదం ఎర్రవల్లికి చెందిన ఆరె నర్సయ్య– లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నర్సయ్య చిన్న కుమారుడే కనకరాజు. వారికున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలే పండటంతో కనకరాజు బతుకుదెరువు కోసం హైదరబాద్‌కు వెళ్లాడు. ఊరు ముం పునకు గురవుతుందని తెలుసుకున్న ఇటీవల తిరిగి ఎర్రవల్లికి చేరుకొని కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
మిస్టరీగా జయ డ్రైవర్ మృతి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనకరాజ్ సాక్షి, చెన్నై: కొడనాడు ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు హత్య కేసులో అనుమానితుడు, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరో నిందితుడు, కనకరాజ్ స్నేహితుడు సయన్ కారు ప్రమాదంలో గాయపడడం అనుమానాలకు తావిస్తోంది. గార్డు హత్యకేసులో వీరిద్దరి పాత్ర ఉందని పోలీసు విచారణలో తేలింది. సేలం జిల్లా ఎడపాడికి చెందిన కనకరాజ్ కోసం గాలింపు సాగుతున్న సమయంలో శుక్రవారం రాత్రి ఆత్తూరు సమీపంలో కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. హత్య కేసులో తన పేరు వినిపిస్తుండడంతో పోలీసుల వద్ద లొంగిపోవడానికి మిత్రుడి బైక్ తీసుకుని కనకరాజ్ వెళ్లినట్టు కుటుంబీకులు చెప్పారు. అయితే, మార్గమధ్యంలో ఓ వాహనం ఢీకొట్టినట్టు, ప్రమాదంలో మరణించినట్టు తేలడం అనుమానాలకు దారితీసింది. సయన్ తిరుచ్చూర్ సమీపంలోని ప్రమాదంలో గాయపడడం అనుమానాలకు బలం చేకూరింది. కనకరాజ్ మరణ సమాచారంతో, ఇక తాను పట్టుబడతానేమోనన్న భయంతో కోయంబత్తూరు నుంచి తిరుచ్చూర్‌కు భార్య వినుప్రియ, కుమార్తె నీలుతో కలిసి కారులో సయన్ వెళ్తున్న సమయంలో ఓ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య, కుమార్తె మరణించగా, సయన్ తీవ్రగాయాలపాలయ్యారు. సయన్ వద్ద కోయంబత్తూరు జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి సెల్వకుమార్ వాంగ్మూలం తీసుకున్నారు. గార్డు హత్య, ప్రమాదం రూపంలో కనకరాజ్ మరణం, సయన్ ఆస్పత్రి పాలు కావడం వెరసి కొడనాడులో ఏదో రహస్యం దాగి ఉందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని తమిళనాట ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కనకరాజ్‌కు ఎస్టేట్ వివరాలు పూర్తిగా తెలుసునని, జయలలితకు పదేళ్లు డ్రైవర్‌గా పనిచేసిన అతడిని ఆమె మరణించే ఆరు నెలల ముందు తొలగించినట్టు విచారణలో తేలింది. ప్రమాదంలో మరణించిన సయన్ భార్య వినుప్రియ, కుమార్తె నీలుల గొంతులపై కత్తిగాట్లు ఉన్నట్లు కేరళలోని తిరుచ్చూరు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.