సేవ్ డెమోక్రసీ
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు
విజయవంతానికి కన్నబాబు పిలుపు
కాకినాడ :
వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో నిరసనలు చేపట్టాలని, జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే దిశగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేని టీఆర్ఎస్లోకి చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే భగ్గుమన్న చంద్రబాబు ఇక్కడ మాత్రం అదే తప్పు చేసి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.