kanumuri raghuramakrishnamraju
-
ఎవరి సంతోషం కోసం మూడేళ్లకు అక్రమ కేసు?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పక్కా పన్నాగంతో తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణరాజు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కస్టడీలో వేధించినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.ఆయన అరెస్ట్ విషయంలో, ఆ తరువాత కూడా సీఐడీ అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఎవరి సంతోషం కోసమో మూడేళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు ఓ సాంప్రదాయానికి తెర తీశారని చెప్పారు. ఈ చర్యకు భవిష్యత్తులో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరినో సంతోషపెట్టడం.. మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే 2021 మే 14న అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు కాగా ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి సంబంధిత జ్యూరిస్ డిక్షన్ పరిధిలోని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారని పొన్నవోలు చెప్పారు. ‘పోలీస్ కస్టడీలో తనను టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు విచిత్రంగా మూడేళ్ల తర్వాత.. గత నెల 11న గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదుపై నెల రోజుల తరవాత పోలీసులు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు కొందరు పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఎవరినో సంతోషపెట్టడం, మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే ఈ కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. వాంగ్మూలం ఒకటి.. ఫిర్యాదు మరొకటి 2021లో రఘురామకృష్ణరాజును గుంటూరు కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు ఏమాత్రం పొంతన లేదు. ముఖానికి రుమాలు కట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కస్టడీలో తనను టార్చర్ చేశారని నాడు మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. కానీ గత నెలలో చేసిన ఫిర్యాదులో మాత్రం విచిత్రంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్, సీతారామాంజనేయుల పేర్లు ప్రస్తావించారు. తనను హింసిస్తున్న వీడియోను వైఎస్ జగన్ చూశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకన్నా తప్పుడు కేసు ఉండదు మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే.. అందులో ప్రస్తావించిన వారందరిపైనా ఇప్పుడు కేసు నమోదు చేయడం పూర్తిగా అసమంజసం. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు? ఇంతకన్నా తప్పుడు కేసు మరొకటి ఉండదు. కేవలం దురుద్దే«శం, ద్వేషంతో రఘురామరాజు ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహంగా స్పందించారు. నాడు మెజి్రస్టేట్ ఎదుట రఘురామ చెప్పిందేమిటి? మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటి? అని పోలీసులు కనీసం ఆలోచించరా? టార్చర్ చేయనేలేదు రఘురామరాజును నాడు సీఐడీ కస్టడీలో ఏమాత్రం టార్చర్ చేయలేదు. ఆయన కోరడంతో కోర్టు ఆదేశాల మేరకు వైద్య బృందం పరీక్షించి రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల అయిన తరువాత రఘురామరాజు ఒక్కరే తన సొంత వాహనంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల సూచనను బేఖాతర్ చేస్తూ అలా వెళ్లిన రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రిలో తన శరీరంపై గాయాలు చూపారు. దాన్నిబట్టి ఆయన ప్రయాణంలో ఏం జరిగి ఉంటుందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. ముందే కల గన్నారా? రఘురామరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వైఎస్ జగన్‌ను, డాక్టర్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చడం సరికాదు. పాలించే వ్యక్తి మారితే చట్టం మారుతుందా? ఆ వ్యక్తికి వంత పాడుతుందా? అసలు చట్టం, న్యాయం, ప్రాథమిక సూత్రాలు ఏం చెబుతున్నాయో పట్టించుకోరా? 77 రోజుల తర్వాత సాక్షులను విచారించడమే సరికాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయం తెలియదా? అలాంటప్పుడు మూడేళ్ల తర్వాత విచారిస్తే ఏం జరుగుతుంది? రఘురామ గత నెల 11న ఈ – మెయిల్ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అంతకు ఒక రోజు ముందే అంటే జూన్ 10వ తేదీనే పోలీసులు లీగల్ ఒపీనియన్ ఎలా పొందారో చెప్పాలి. రఘురామ ఫిర్యాదు చేస్తారని పోలీసులు ముందుగానే కల గన్నారా? చట్టపరంగానే ఎదుర్కొంటాం ఈ తప్పుడు కేసును చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన విధానం సరికాదు. ఇదో సంప్రదాయంగా మారితే భవిష్యత్తులో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్ధకే కళంకం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేయలేదు. 2015లోనే టీడీపీ హయాంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆ కేసు నమోదు చేసింది. -
సుప్రీంకోర్టు వారించినా వినరా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా నారా లోకేశ్ తయారు చేసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్నట్లు మరోసారి నిరూపితమైంది! ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితం తోసిపుచ్చిన ఆరోపణల ఆధారంగా కూటమి సర్కారు తాజాగా తప్పుడు కేసు నమోదు చేయడమే అందుకు తాజా నిదర్శనం. 2021లో తనను సీఐడీ అధికారుల కస్టడీలో గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని.. హింసించారని నాటి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య పరీక్షలు గతంలోనే నిర్ధారించాయి. ఆ ఆరోపణల ఆధారంగా రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా, అదే ఆరోపణల ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సుప్రీం కోర్టు సైతం తిరస్కరించింది. తాజాగా అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించేందుకు బరి తెగించింది. నాడు న్యాయస్థానాలు తోసిపుచ్చిన ఆరోపణలతోనే రఘురామరాజు మూడేళ్ల తరువాత మెయిల్లో ఫిర్యాదు చేయడం... ఆ వెనువెంటనే ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు, నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలతోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసులు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ చర్య కక్ష సాధింపే కాదు.. కోర్టు ధిక్కారమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.బెడిసికొట్టిన పన్నాగం.. రఘురామను హింసించలేదన్న వైద్య నివేదికలుసమాజంలో వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న కె.రఘురామకృష్ణరాజుపై సీఐడీ అధికారులు 2021 మే నెలలో కేసు నమోదు చేశారు. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసే సమయంలో సీఐడీ అధికారులపై దాడికి పాల్పడినా ఎంతో సంయమనం పాటిస్తూ మంగళగిరిలోని ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ క్రమంలో రఘురామరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన ప్లేటు ఫిరాయించి గుంటూరు మెజి్రస్టేట్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో అసత్య ఆరోపణలు చేశారు. కస్టడీలో సీఐడీ అధికారులు తనను కొట్టారని... హింసించారని ఆరోపిస్తూ బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు తనను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించారని ఆరోపిస్తూ దానిపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఆయనకు వైద్యుల బృందంతో పరీక్షలు నిర్వహించి నివేదిక సమ ర్పించాలని గుంటూరు జీజీహెచ్ వైద్య అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో నలుగురు వైద్యుల బృందం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఎక్స్‌రే, స్కాన్లు తీసింది.రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. సీఐడీ అధికారులు కస్టడీలో ఆయన్ను శారీరకంగా హింసించలేదని నిర్ధారించింది. అదే విషయాన్ని హైకోర్టుకు నివేదించింది. సీఐడీ అధికారులు నిజంగానే కస్టడీలో శారీరకంగా హింసించి ఉంటే అవి ఎక్స్‌రే, స్కాన్ రిపోర్టులలో బయటపడేవి. అలాంటిది ఏమీ లేకపోవడంతో వైద్య బృందంలోని నలుగురు డాక్టర్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ నివేదిక సమర్పించారు. ఒకవేళ నలుగురు వైద్యుల్లో ఎవరైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి ఉంటే మరోసారి వైద్య పరీక్షలు చేయాలని ఇతర ఆస్పత్రులకు హైకోర్టు అప్పుడే ఆదేశించి ఉండేది. ఈ నేపథ్యంలో రఘురామను సీఐడీ అధికారులు శారీరకంగా హింసించలేదని పూర్తి ఆధారాలతో వైద్యులు నిగ్గు తేల్చిన నివేదికను హైకోర్టు ఆమోదించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో రఘురామను జ్యుడిషియల్ కస్టడీ కోసం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తమ కస్టడీలో ఉన్న నిందితుడిని జైలుకు తరలించడంతో సీఐడీ / పోలీసు అధికారుల బాధ్యత ముగుస్తుంది. తరువాత పరిణామాలతో వారికి సంబంధం ఉండదు. సుప్రీం తీర్పులు పట్టవా? ఏదైనా కేసులో 77 రోజుల తరువాత సాక్షులను విచారించడం సరికాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. రఘురామ ఫిర్యాదు విషయంలో ఏకంగా మూడేళ్ల తరువాత... అదీ అప్పటికే ఆ ఆరోపణలతో దాఖలైన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాలతో చంద్రబాబు ప్రభుత్వం కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుల చర్య కచ్చితంగా కక్ష సాధింపేనని స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం కోర్టు ధిక్కారమేనని తేల్చి చెబుతున్నారు. ఆరోపణలు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు తిరస్కరణహైకోర్టులో చుక్కెదురు కావడంతో రఘురామ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుంటూరు జిల్లా జైలులో ఒక రోజు ఉన్న తరువాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం అక్కడి నుంచి పోలీసుల వాహనంలో కాకుండా తన సొంత వాహనంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి వెళ్లారు. రెండు రోజుల తరువాత ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను పోలీసులు కొట్టినట్టు ఆ వైద్య పరీక్షల్లోనూ వెల్లడి కాలేదు. అయితే సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించిన ఆయన.. సీఐడీ కస్టడీలో తనను గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామరాజు ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దాంతో రఘురామ ఎత్తుగడ బెడిసికొట్టింది. తనను సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని, శారీరకంగా హింసించారంటూ రఘురామ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ అధ్యాయానికి తెర పడింది. కక్ష సాధింపుతో తప్పుడు కేసు.. ఒక రోజు ముందే పోలీసులకు ఉప్పు.. రెడ్ బుక్ రాజ్యాంగాన్నే తమ ప్రభుత్వం అనుసరిస్తుందని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. రఘురామను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించలేదని నిర్థారిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బేఖాతర్ చేశారు. గుంటూరు జీజీహెచ్, హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యుల నివేదికలను బుట్ట దాఖలు చేస్తూ కేవలం కక్ష సాధింపే తమ విధానమని మరోసారి చాటుకున్నారు. 2021 మేలో తనను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించారని ఆరోపిస్తూ మూడేళ్ల తరువాత రఘురామరాజు ఈ ఏడాది జూన్ 11న పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని కోర్టులో పిటిషన్ వేసిన ఆయన.. ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం 2021లో సీఐడీ అదనపు డీజీగా ఉన్న పీవీ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు(వాస్తవానికి అప్పట్లో ఏసీబీ అదనపు డీజీగా ఉన్నారు)తోపాటు నాటి సీఎం జగన్‌ను నిందితులుగా పేర్కొనడం గమనార్హం. వారితోపాటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ప్రభావతి, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌పై కూడా ఆరోపణలు చేశారు. మరో విచిత్రమేంటంటే రఘురామరాజు ఈ ఏడాది జూన్ 11న ఫిర్యాదు చేయగా అంతకు ఒకరోజు ముందే అంటే జూన్ 10నే ఆయన ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా కోరారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తోందో స్పష్టమవుతోంది. రఘురామ ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరపాలెం పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్, డాక్టర్ ప్రభావతిలతోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
రఘురాజుకు డౌటే
తమకే కావాలంటున్న కృష్ణంరాజు, గంగరాజు చంద్రబాబుపైనే రఘురాజు ఆశలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీలో తనకు ఎదురే లేదని చెప్పుకున్న బీజేపీ నేత, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు (రఘురాజు)కు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సీటు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. ఐదు నెలల క్రితమే రాజకీయ అరంగేట్రం చేసి.. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను నిర్ణయించే స్థాయిలో పావులు కదుపుతున్నట్లు హడావుడి చేసిన ఆయన ఇప్పుడు తన సీటు కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నరసాపురం ఎంపీ సీటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో లోపారుకారీ ఒప్పందం చేసుకున్న రఘురాజు కొద్దినెలల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ అధిష్టానాన్ని కూడా మచ్చిక చేసుకుని ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన సీటుకు ఢోకా లేదనుకున్న ఆయన తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోనూ వేలు పెట్టారు. పలువురు నేతలను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి టీడీపీలో చేర్పించి వారికి సీట్లివ్వాలని సూచిం చారు. దీంతో ఆయా నియోజకవర్గాల తెలుగుదేశం నేతలు రఘురాజు తీరుపై కారాలు మిరియాలు నూరారు. ఈ తంతు ఇలా నడుస్తుండగానే బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు వ్యవహారం రసకందాయంలో పడినా ఎట్టకేలకు కుదిరింది. అనుకున్నట్లుగానే చంద్రబాబు నరసాపురం సీటును బీజేపీకి వదిలేశారు. కానీ అక్కడ రఘురాజు అభ్యర్థిత్వానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. రెబల్‌స్టార్ ఒత్తిడి నరసాపురం ఎంపీ సీటు కోసం రఘురామకృష్ణంరాజుతోపాటు సినీ ప్రముఖుడు, మాజీ కేంద్ర మంత్రి యూవీ కృష్ణంరాజు తొలినుంచీ పోటీ పడుతున్నారు. రఘురాజు కంటే ముందే ఆయన బీజేపీలో చేరి తనకున్న విస్తృత పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని నరసాపురం సీటును చేజిక్కించుకునేందుకు కృష్ణం రాజు పావులు కదుపుతున్నారు. జిల్లా బీజేపీలోని ఒక వర్గం ఆయనకే సీటివ్వాలని అగ్ర నేతలను కోరుతోంది. తాజాగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైలా గ్రూపు కంపెనీల అధినేత గోకరాజు గంగరాజు (గంగతాతరాజు) అదే సీటు కోసం ప్రయత్నిస్తుండటంతో రఘురాజు అవకాశాలకు గండిపడ్డాయి. వీహెచ్‌పీ నాయకుడైన ఆయనకు ఆర్ఎస్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నారుు. వాటిని ఆధారం చేసుకుని గంగరాజు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుపై ఆశలు దీంతో రఘురాజు పరిస్థితి గందరగోళంగా మారింది. చంద్రబాబుపైనే ఆయన పూర్తిగా ఆధారపడినట్లు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో అయినా చంద్రబాబుతో బీజేపీ పెద్దలకు రికమండ్ చేయించుకుని నరసాపురాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే బీజేపీలోని ఒకవర్గం రఘురాజును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన వ్యా పారాలను కాపాడుకోవడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, అలాం టి వ్యక్తికి ఎలా సీటిస్తారని ఆ వర్గం బీజేపీ జాతీయ నేతలను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అదీగాక చంద్రబాబు వ్యూహంలో భాగంగానే రఘురాజు బీజేపీలోకి వచ్చారని.. ఈ దృష్ట్యా ఆయనకు సీటు ఇచ్చినా పేరుకు బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తారని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. దీంతో నరసాపురం సీటు విషయంలో బీజేపీ అధిష్టానం సతమతం అవుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఎంపీ స్థానం కోసం పట్టుబడుతోంది. ఒకవేళ ఆ దిశగా చర్చలు సఫలమై కాకినాడ సీటును బీజేపీకి ఇస్తే కృష్ణంరాజును అక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో బీజేపీలో నేతలు ఉన్నారు. అది జరగని పక్షంలో నరసాపురం సీటు ఎవరికివ్వాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీంతో రఘురాజు పరిస్థితి ఇరకాటంలో పడింది.