kapu satyagraha yatra
-
ఎవరిపై ఎత్తుగడ ?
-
కాపు సత్యాగ్రహ యాత్రకు చుక్కెదురు!
అనుమతి లేదన్న ఎస్పీ కాకినాడ: రిజర్వేషన్ల సాధన కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రకు ఏపీ ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఈ నెల 25నుంచి ఆరు రోజుల పాటు తలపెట్టిన ఈ యాత్రకు అనుమతి లేదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. గత సంఘటనల నేపథ్యంలో సత్యాగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాదయాత్రకు కూడా యాన పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని ఎస్పీ రవిప్రకాశ్ శనివారం విలేకరులతో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి కాపు సత్యాగ్రహ యాత్రను ప్రారంభించాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయించారు. అక్కడి నుంచి అమలాపురం మీదగా అంతర్వేది వరకు ఆయన యాత్ర తలపెట్టారు. గాంధేయ మార్గంలోనే ఈ సత్యాగ్రహ యాత్రను నిర్వహిస్తామని, కాపులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయించేందుకే యాత్ర చేస్తున్నామని ఆయన గతంలో స్పష్టం చేశారు. -
రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ..
-
25 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర
కాకినాడ : కాపు రిజర్వేషన్ల సాధనకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్రను ప్రారంభించనున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఈ నెల 25నుంచి ఆరు రోజుల పాటు ఆయన యాత్ర చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభం అయ్యే ఈ యాత్ర అమలాపురం మీదగా అంతర్వేది వరకూ కొనసాగనుంది. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గురువారమిక్కడ మాట్లాడుతూ గాంధేయ మార్గంలోనే సత్యాగ్రహ యాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాపు సత్యగ్రహ యాత్ర ఏ కులంపై పోరాటం కాదని ముద్రగడ స్పష్టం చేశారు. -
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ముద్రగడ
-
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ముద్రగడ
కాకినాడ: కాపు రిజర్వేషన్ల సాధనకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాలుగు దశల్లో భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటించారు. డిసెంబర్ 18న నల్ల రిబ్బన్లు కట్టుకుని.. కంచం, గరిటతో నిరసన తెల్పుతామని చెప్పారు. 30న ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తామని, జనవరి 8న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 25న కాపు సత్యాగ్రహ యాత్ర చేపడతామని, దీనికి ఎటువంటి అనుమతి తీసుకోబోమని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన కాపు జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 16 నుంచి 21 వరకు ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టాలని భావించినా ప్రభుత్వం అనుమతించకపోవడంతో విరమించుకున్నారు. -
బాబూ.. మాది మీలా స్వార్థయాత్ర కాదు
-
బాబూ.. మాది మీలా స్వార్థయాత్ర కాదు
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎందుకు పాదయాత్ర చేశారో ఎవరికీ తెలియదని.. తమది ఆయనలా స్వార్థయాత్ర కాదని, జాతికోసమే చేస్తున్నానని కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ఎన్నికల్లో మీరిచ్చిన హామీని అమలుచేయమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. తమ జాతి అంటే అంత చులకనా అంటూ నిలదీశారు. మీలాగ మేం కేసులకు భయపడేది లేదు.. కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకునేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని రోజులు గృహనిర్బంధంలో ఉంచుతారో మీ ఇష్టమని.. తమవాళ్లతో చర్చించి పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటానని ముద్రగడ చెప్పారు. వచ్చేనెల రెండోతేదీన కాపు జేఏసీ నేతలతో సమావేశమై తదుపరి సత్యాగ్రహ యాత్ర గురించి నిర్ణయం తీసుకుంటామని పద్మనాభం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 30, 144 అమలులో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం జనచైతన్య యాత్రలు ఎలా నిర్వహిస్తున్నారని అడిగారు. వాళ్లకో రూలు.. తమకో నిబంధనా అని ఆయన మండిపడ్డారు. -
ముద్రగడను అంతం చేయాలనే వేధింపులు!
కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని భౌతికంగా అంతం చేయాలనే వేధింపులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేయడం కొత్త కాదని, ముద్రగడ మాత్రం అలా పాదయాత్ర చేయడానికి అనుమతి లేదని హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ అంటున్నారని.. వాళ్లిద్దరూ చెప్పినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. ముద్రగడ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మనాభం ఇంటి పక్కన చిన్న జిన్నింగు మిల్లు ఉంటే దాన్ని ఆక్రమించుకుని పోలీసులు అక్కడ చేరారని, ఇది సరైన విధానం కాదు, దీన్ని మార్చుకోవాలని చెబుతున్నామని అన్నారు. ముద్రగడను అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, పాదయాత్రను అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతాయని హెచ్చరించారు. పద్మనాభం పాదయాత్రకు 15 వేల మంది పోలీసులను మోహరించారని, ఇది ప్రజాస్వామ్యమా, రాచరికమా, మిలటరీ పాలన సాగుతోందా అని ప్రశ్నించారు. అంతమంది పోలీసులను అక్కడ పెట్టి ఏం చేయాలనుకున్నారని, రాష్ట్రాన్ని ఎలా పాలించాలనుకుంటున్నారని నిలదీశారు. ముద్రగడ సత్యాగ్రహ యాత్ర చేపట్టడానికి కారణం చంద్రబాబు కాదా, 6 నెలల్లో బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా, ఏడాదికి వెయ్యికోట్లతో పథకాలు చేపడతామన్నది నిజమా కాదా అని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయాలనుకుంటే దాన్ని అణిచేసే ప్రయత్నాలు చేయడాన్ని అతి దారుణమైన అంశంగా భావిస్తున్నామన్నారు. పద్మనాభం ఏకాకి కాదని, ఆయన వెనక రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్య శక్తులన్నీ ఉన్నాయని, కాపుసమాజం మొత్తం ఆయన వెనక ఉందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నాయన్నారు. తుని ఘటన తర్వాత ఇదే ముద్రగడ నిరాహార దీక్ష చేస్తే.. మంత్రివర్గ సభ్యులు వెళ్లి ఆగస్టు లోపల కాపులను బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చారని.. దాన్ని నిలబెట్టుకోలేదనే ఇప్పుడు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తామంటే.. దాన్ని అణిచేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. తుని ఘటన తర్వాత ఆయన కుటుంబాన్ని తీవ్రంగా అవమానపరిచి 15 రోజులు ఆస్పత్రిలో ఖైదీగా బంధించి ఇబ్బంది పెట్టారని.. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి విజయం సాధించిన వ్యక్తి పద్మనాభం అని అన్నారు. ఇప్పుడు మళ్లీ కాపు రిజర్వేషన్ల కోసం ఆయన రావులపాలెం నుంచి పాదయాత్ర చేస్తామంటే దాన్ని చిందరవందర చేయాలని యోచిస్తున్నారని ఆరోపించారు. ఇది వాళ్లకేం కొత్త కాదని, గతంలో వంగవీటి మోహన రంగాను కూడా వేధించి, హత్యచేసింది అప్పటి తెలుగుదేశం పార్టీయేనని గుర్తుచేశారు. -
ముద్రగడను అంతం చేయాలనే వేధింపులు!
-
‘కాపు సత్యాగ్రహ యాత్రకు అనుమతి లేదు’
కాకినాడ : కాపు సత్యగ్రహ యాత్రకు అనుమతి లేదని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తని సభ కూడా ప్రశాంతంగా నిర్వహించుకుంటామని అన్నారని, ఆ తర్వాత రైలు, పోలీస్ స్టేషన్, వాహనాలు తగులబెట్టారని చినరాజప్ప సోమవారమిక్కడ అన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి సమయం పడుతుందని, కొద్దికాలం వేచి ఉండాల్సిందేనని చినరాజప్ప వ్యాఖ్యానించారు. స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిన వెంటనే మంజునాథ కమిషన్ నివేదిక మేరకు న్యాయం చేస్తామని చినరాజప్ప తెలిపారు. మరోవైపు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కోనసీమలో చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ ఓ పక్క చెబుతూనే.. మరో పక్క భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా యాత్రను అడ్డుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో యాత్ర పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 21 వరకూ ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. -
16 నుంచి కాపు సత్యాగ్రహయాత్ర
రాజమహేంద్రవరం : కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 16 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర చేపడుతున్నట్లు కాపు జేఏసీ నేతలు ఏసుదాసు, రామకృష్ణ ప్రకటించారు. సోమవారమిక్కడ వారు విలేకరులతో మాట్లాడారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు జరిగే ఈ యాత్రలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొంటారని చెప్పారు. కాపు రిజర్వేషన్లపై అవగాహన కోసమే సత్యాగ్రహ యాత్ర చేపట్టమన్నారు. ఈ యాత్ర శాంతియుతంగా నిర్వహిస్తామని...ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతనని జేఏసీ నేతలు తెలిపారు.