25 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర | kapu Satyagraha Yatra from january 25th | Sakshi
Sakshi News home page

రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ..

Published Thu, Jan 12 2017 10:58 AM | Last Updated on Mon, Jul 30 2018 6:25 PM

25 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర - Sakshi

25 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర

కాకినాడ : కాపు రిజర్వేషన్ల సాధనకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్రను ప్రారంభించనున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఈ నెల 25నుంచి ఆరు రోజుల పాటు ఆయన యాత్ర చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభం అయ్యే ఈ యాత్ర అమలాపురం మీదగా అంతర్వేది వరకూ కొనసాగనుంది.

ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గురువారమిక్కడ మాట్లాడుతూ గాంధేయ మార్గంలోనే సత్యాగ్రహ యాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాపు సత్యగ్రహ యాత్ర ఏ కులంపై పోరాటం కాదని ముద్రగడ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement