katra train
-
కశ్మీర్‌కు వందేభారత్ .. టిక్కెట్ ఎంత? ఏ రూట్లో వెళుతుంది?
రాబోయే వేసవి సెలవుల్లో కుటుంబంతోపాలు ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే అందుకు కశ్మీర్‌కు వెళ్లే వందేభారత్ సిద్ధంగా ఉంది. అందమైన లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సహజసిద్ధ అందాలను ఈ రైలులో నుంచి చూసి ఎంతగానో ఆనందించవచ్చు. అంతేకాదు ఈ ప్రయాణంలోని మధురానుభూతులను మీ వెంట తీసుకెళ్లవచ్చు.ఇదంతా ఎంతో దూరంలో లేదు. కశ్మీర్‌కు ప్రతిపాదిత వందే భారత్ రైలును ఎప్పుటి నుంచి నడుపుతారనే దానికి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న శ్రీనగర్‌కు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. శ్రీనగర్‌కు నడిచే ఈ వందే భారత్ రైలు కాట్రా- శ్రీనగర్ మధ్య నడుస్తుంది. అంటే ఢిల్లీలో లేదా దేశంలోని మరో ఇతర ప్రాంతంలో నివసిస్తున్నవారు ముందుగా కాట్రా చేరుకోవాలి. ఇక్కడి నుండి కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలులో శ్రీనగర్‌కు చేరుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఢిల్లీ నుంచి కట్రాకు గల వందేభారత్ రైలులో కట్రా చేరుకుని, అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లవచ్చు. కాగా కట్రా- శ్రీనగర్ మధ్య నడిచే కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలు దేశంలోని ఇతర ప్రాంతాలకు నడిచే వందే భారత్ రైళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.కశ్మీర్‌కు నడిచే ప్రత్యేక వందే భారత్ రైలును అక్కడి వాతావరణం, అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ప్రత్యేక రైలు -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రయాణిస్తుంది. ఈ రైలులోని కోచ్‌లు చైర్ కార్లు, జనరల్ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్లుగా విభజించారు. కొన్ని నెలల తర్వాత ఈ రైలును జమ్మూ వరకు పొడిగించనున్నారు. అప్పటి నుంచి ఈ రైలు జమ్మూ- శ్రీనగర్ మధ్య నడవనుంది. ఈ రైలు మార్గంలో రియాసి, బక్కల్, దుగ్గ, సవల్కోట్, సంగల్డాన్, సుంబెర్, ఖారి, బనిహాల్, ఖాజిగుండ్, సదురా, అనంతనాగ్, బిజ్బెహారా, పంజ్‌గామ్, అవంతిపోరా, రత్నిపోరా, కాకాపోరా, పాంపోర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు కాట్రా నుంచి శ్రీనగర్‌కు రెండున్నర నుండి మూడు గంటల్లో చేరుకుంటుంది.రైల్వే వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ రైలులో ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ.1500 నుంచి రూ.1700 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2400 నుండి రూ. 2600 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 17న రైలు ప్రారంభించిన అనంతరం రైల్వే అధికారులు ఛార్జీలను ప్రకటించనున్నారు. అప్పటి నుంచి సీట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
కశ్మీర్‌కు వందేభారత్.. మంచులోనూ వెచ్చదనం
దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతూ, ప్రయాణికులకు నూతన రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రైల్వే లైన్ ద్వారా దేశాన్ని అనుసంధానించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్(యూఎస్బీఆర్ఎల్) పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఢిల్లీ నుండి రైళ్లు కశ్మీర్‌కు బయలుదేరనున్నాయి. ఈ మార్గంలో నడిపేందుకు ముందుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంపిక చేశారు. అయితే కశ్మీర్ లోయలో హిమపాతం, అక్కడి సబ్-జీరో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ వందేభారత్ రైలులో పలు నూతన ఫీచర్లను జోడించారు.ఇప్పటివరకు కశ్మీర్ వైపు వెళ్లే రైళ్లు కాట్రా వరకు మాత్రమే నడుస్తున్నాయి. తదుపరి రైల్వే లైన్ వేసే పనిని వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్(USBRL Project) కింద చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 17 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇది త్వరలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్డాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీనిని రోడ్డు మార్గంతో పోలిస్తే, ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది.కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్‌ను ఎంపిక చేశారు. ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. రైలు బయట మంచుకురుస్తుంటో లోపలి ప్రయాణికులు వెచ్చదనాన్ని అనుభవించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్లో రైళ్లు నడపడానికి మంచు కురువడం, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. విండ్ స్క్రీన్ పై మంచు కురుస్తున్న కారణంగా, లోకో పైలట్ ముందున్న రోడ్డును చూడలేకపోతారు. మైనస్ ఉష్ణోగ్రత(Subzero temperature)లో టాయిలెట్ పైప్లైన్లు కూడా స్తంభించిపోతాయి. అలాగే విపరీతమైన చలి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.కశ్మీర్‌కు నడిపేందుకు రూపొందించిన రైలులో పైలట్ క్యాబిన్ విండ్‌స్క్రీన్ డబుల్ లేయర్ గ్లాస్‌తో తయారు చేశారని, మధ్యలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఉత్తర రైల్వే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మీడియాకు తెలిపారు. ఈ సాంకేతికత కారణంగా గ్లాస్‌కు అంటుకున్న మంచు వెంటనే కిందకు జారిపోతుందన్నారు. వైపర్ నుండి వేడి నీరు కూడా బయటకు వస్తుందని, ఇది మిగిలిన మంచు, ఆవిరిని తొలగిస్తుందన్నారు. కొత్త ఫీచర్లతో కూడిన ఈ వందే భారత్‌లో లోకో పైలట్ క్యాబిన్‌లోని సీట్లు కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. రైలు అంతటా హీటర్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌లో హై లెవల్ థర్మోస్టాట్ లేయరింగ్ ఉంటుంది. తద్వారా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా లోపలి ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉంటుంది.వందే భారత్ టాయిలెట్లలో నీటి పైప్‌లైన్‌ను సిలికాన్ హీటింగ్ ప్యాడ్లతో ఇన్సులేట్ చేశారు. తద్వారా బయో టాయిలెట్‌లోని ట్యాంక్‌కు హీటింగ్ కూడా అందుతుంది. ఫలితంగా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ఇదేవిధంగా ఈ నూతన వందే భారత్ రైలు కిటికీలకు డబుల్ లేయర్డ్ గ్లాస్ కూడా అమర్చారు. దీంతో ఎవరైనా ఒకవేళ రాయి విసిరినప్పటికీ, పైగాజు మాత్రమే పగిలిపోతుంది. ప్రయాణికులకు ఎటువంటి హాని వాటిల్లదు.ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా -
సొరంగంలో ఆగిపోయిన రైలు!!
జమ్ము కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు బేస్ క్యాంపు అయిన కట్రాకు వెళ్లేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన రైలు ఇంజన్ చెడిపోయి.. సొరంగం మధ్యలో ఆగిపోయింది. అలా దాదాపు గంట పాటు రైలు కట్రా రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆగిపోయింది. మొత్తం ఏసీ ఉన్న ఈ శ్రీశక్తి ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుంచి కట్రా వెళ్తుంది. మరో ఐదు కిలోమీటర్లు వెళ్తే స్టేషన్ వచ్చేస్తుందనగా సొరంగంలో గంటపాటు రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 5.10 గంటలకు రైలు కట్రా చేరాల్సి ఉండగా, ఉదయం 7 గంటలకు వచ్చినట్లు ఫిరోజ్‌పూర్ డీఆర్ఎం ఎన్సీ గోయల్ తెలిపారు. కట్రా రైలును ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సొరంగంలో ఆగిపోయిన రైలును మళ్లీ తీసుకెళ్లేందుకు హుటాహుటిన ఉధంపూర్ నుంచి మరో ఇంజన్‌ను పంపారు. అప్పటికే అరగంట ఆలస్యంగా నడుస్తున్న రైలు, ఈ సంఘటనతో మరో గంట ఆలస్యమొంది.