kattangoor
-
పట్టపగలే తాళాలు పగులగొట్టి చోరీ
కట్టంగూర్ : నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో పట్టపగలే దొంగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. పద్మశాలినగర్‌లో నివసించే బి.లింగయ్య దంపతులు సోమవారం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే సరికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ.80 వేల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి పట్టీలు చోరీకి గురైనట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కట్టంగూరులో యువతి దారుణహత్య
కట్టంగూర్ : నువ్వే నా ప్రాణం అంటూ నమ్మబలికాడు.. నువ్వు లేకుంటే జీవించలేనని ప్రేమ ఊబిలోకి దించాడు..మూడేళ్లుగా చిలకా గోరింకలా తిరిగారు..పెళ్లి చేసుకోమని కోరగానే కాదు పొమ్మన్నాడు.. ఒత్తిడిచేస్తే చివరకు ప్రియురాలి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు. ఇదీ కట్టంగూరు మండల కేంద్రంలో గురువారం దారుణహత్యకు గురైన యువతి విషాదగాథ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన కందాల యాదగిరిరెడ్డి మూడో కూతురు శ్రీవిద్య (19) సూర్యాపేటలో పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. కట్టంగూర్కు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు డ్రైవర్ యాదగిరి రెగ్యులర్‌గా నల్లగొండ నుంచి సూర్యాపేటకు వెళుతుంటాడు . అయితే అదే బస్సులో రోజూ ప్రయాణించే శ్రీవిద్యతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ మూడేళ్లగా ప్రేమించుకుంటున్నారు. కాగా,ఇటీవల ఫైనల్ ఇయర్ పూర్తికావడంతో శ్రీ విద్య నల్లగొండలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ప్రాజెక్ట్‌వర్క్ చేస్తోంది. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న శ్రీ విద్యను యాదగిరి గురువారం ఇందిరమ్మ కాలనీలోని తన తండ్రి ఎనమల చంద్రయ్య ఇంటికి తీసుకువచ్చి గొడ్డలితో నరికాడు. మెడ, ఛాతిపై నరకడంతో శ్రీ విద్య అక్కడికక్కడే కుప్పకులి మృతిచెందింది. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.నల్లగొండ డీఎస్పీ రాంమోహన్‌రావు, నకిరేకర్ రూరల్ సీఐ రాఘవరావు, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు పర్వతాలు, ప్రసాదరావు, శ్రీనివాస్‌తో పాటు క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
కట్టంగూరు వద్ద పెరిగిన వరద ఉధృతి, వాహనాల దారి మళ్లింపు
నల్గొండ: గతకొన్నిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాలతో పలుజిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమయింది. ఈశాన్య రుతుపవనాల ప్రబావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో భారీవర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు వద్ద వరద ఉధృతి పెరగడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహాదారి మీదుగా వెళ్లే వావాన రాకపోకలను మళ్లిస్తున్నట్టు నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు పేర్కొన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను నకిరెకల్ నుండి తిప్పర్తి, నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను బిబినగర్, జనగాం, సూర్యాపేట మీదుగా విజయవాడ వైపు దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు. కట్టంగూరు వద్ద వరద ఉధృతి తగ్గితే యదావిధిగా రాకపోకలు కొనసాగుతాయని చిరంజీవులు తెలిపారు.