కట్టంగూర్ : నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో పట్టపగలే దొంగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. పద్మశాలినగర్‌లో నివసించే బి.లింగయ్య దంపతులు సోమవారం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే సరికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ.80 వేల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి పట్టీలు చోరీకి గురైనట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.