kerber
-
ఒకరి వెంట ఒకరు...
న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. యూఎస్ ఓపెన్‌లో ఆదివారం ఒక్కరోజే మహిళల సింగిల్స్ టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారిణులు ఓడిపోయారు. నాలుగో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ నెగ్గిన కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఆరో సీడ్ గార్సియా (ఫ్రాన్స్), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) రెండో రౌండ్లో... ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. మూడో రౌండ్లో 29వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 3–6, 6–3, 6–3తో కెర్బర్‌పై, 22వ సీడ్ షరపోవా (రష్యా) 6–3, 6–2తో ఒస్టాపెంకోపై, 30వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 5–7, 6–4, 7–6 (7/4)తో గార్సియాపై, 26వ సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–1తో క్విటోవాపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లో నిష్క్రమించగా... రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. జర్మనీ ప్లేయర్ కోల్‌ష్రైబర్ 6–7 (1/7), 6–4, 6–1, 6–3తో జ్వెరెవ్‌పై గెలిచాడు. ఫెడరర్ 6–4, 6–1, 7–5తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై, జొకోవిచ్ 6–2, 6–3, 6–3తో గాస్కే (ఫ్రాన్స్)పై గెలిచారు. -
వింబుల్డన్ ‘క్వీన్’ కెర్బర్
ఒకవైపు టాప్–10 సీడెడ్ క్రీడాకారిణులు క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిదారి పట్టగా... మరోవైపు తొలి రౌండ్ నుంచి నిలకడగా ఆడిన మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ టైటిల్ పోరులోనూ అదరగొట్టింది. 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో కెర్బర్ 65 నిమిషాల్లోనే విజయగర్జన చేసింది. తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతోపాటు కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని దక్కించుకుంది. లండన్: రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు నిరాశ ఎదురైంది. 11వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ అద్భుత ఆటతీరుతో సెరెనా ఆట కట్టించింది. శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కెర్బర్ 6–3, 6–3తో 36 ఏళ్ల సెరెనాను ఓడించింది. ఈ క్రమంలో స్టెఫీ గ్రాఫ్ (1996లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన కెర్బర్‌కు 22 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 40 లక్షలు); రన్నరప్ సెరెనాకు 11 లక్షల 25 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ మాత్రమే కోల్పోయిన కెర్బర్ అంతిమ పోరులో మాత్రం ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించింది. తొలి గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా స్కోరును 2–2తో సమం చేసింది. కానీ కెర్బర్ మళ్లీ పుంజుకొని ఏడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లోనూ కెర్బర్ తన జోరు కొనసాగించగా... సెరెనా డీలా పడిపోయింది. విశేషాలు కెర్బర్ సెరెనా 1 ఏస్‌లు 4 1 డబుల్ ఫాల్ట్‌లు 2 2/6 నెట్ పాయింట్లు 12/24 4/7 బ్రేక్ పాయింట్లు 1/1 11 విన్నర్స్ 23 5 అనవసర తప్పిదాలు 24 56 మొత్తం పాయింట్లు 45 -
యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్
-
కెర్బర్... నంబర్ 1
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాక... ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో ఆమెను ‘వన్ హిట్ వండర్’ అని టెన్నిస్ పండితులు అభివర్ణించారు. కానీ ఆ అమ్మాయి మాత్రం అలా భావించలేదు. తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకొని వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. ఆ తర్వాత అదే జోరును సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో కొనసాగించింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంది. నిలకడగా ఆడుతూ అందరి అంచనాలను తారుమారు చేసిన ఆ జర్మనీ అమ్మాయి పేరు ఎంజెలిక్ కెర్బర్. కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కెర్బర్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ అమ్మాయి కరోలినా ప్లిస్కోవాతో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన ప్లిస్కోవా ఫైనల్లో ఏం చేస్తుందో వేచి చూడాలి. ఫైనల్లో ఎవరు గెలిచినా తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరిస్తారు. * యూఎస్ ఓపెన్‌లో ఫైనల్లోకి * తొలిసారి టాప్ ర్యాంక్ సొంతం * సెమీస్‌లో వొజ్నియాకిపై గెలుపు * సెరెనాకు ప్లిస్కోవా షాక్ * నేడు కెర్బర్తో టైటిల్ పోరు న్యూయార్క్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కెర్బర్ 6-4, 6-3తో రెండు సార్లు రన్నరప్, మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై గెలుపొందగా... ప్లిస్కోవా 6-2, 7-6 (7/5)తో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. ప్లిస్కోవాకిది తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కాగా, కెర్బర్‌కు మూడోది. ముఖాముఖి రికార్డులో కెర్బర్ 4-3తో ఆధిక్యంలో ఉంది. కెర్బర్ ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా, రొబెర్టా విన్సీ తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరగా... పెనెట్టా టైటిల్ సాధించాక టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. సెరెనా చేజారిన రికార్డు మరో సెమీస్‌లో సెరెనా ఓడిపోవడం, కెర్బర్ ఫైనల్‌కు చేరుకోవడంతో... అంతిమ సమరం ఫలితంతో సంబంధం లేకుండా సోమవారం మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విడుదల చేసే తాజా ప్రపంచ ర్యాంకింగ్‌సలో కెర్బర్ కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా ఆవిర్భవించనుంది. ఒకవేళ సెరెనా ఫైనల్‌కు చేరుకున్నా కచ్చితంగా టైటిల్ గెలిస్తేనే ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకునేది. సెమీస్‌లో సెరెనా ఓటమితో వరుసగా 187 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని ఈ అమెరికా స్టార్ కోల్పోరుుంది. వరుసగా 186 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన స్టెఫీ గ్రాఫ్ రికార్డును సెరెనా సమం చేయగలిగింది కానీ అధిగమించలేకపోయింది. అదే జోరు... సెమీస్ చేరే వరకు ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా ఇవ్వని కెర్బర్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభంలో రెండుసార్లు వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జర్మన్ స్టార్ 15 నిమిషాల్లోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వొజ్నియాకి ఒక బ్రేక్ పారుుంట్ సంపాదించి కోలుకునేందకు ప్రయత్నించినా కెర్బర్ తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ మొదట్లోనే వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో కెర్బర్ నెట్ వద్దకు ఎనిమిదిసార్లు దూసుకొచ్చి ఏడుసార్లు పారుుంట్లు సాధించింది. 19 విన్నర్స్ కొట్టిన ఆమె 16 అనవసర తప్పిదాలు చేసింది. సర్వీస్‌లో తడబడిన వొజ్నియాకి 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘నా కెరీర్లో ఈ రోజు గొప్ప దినం. ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకోవడం గొప్పగా అనిపిస్తోంది’ అని కెర్బర్ వ్యాఖ్యానించింది. మహిళల సింగిల్స్ ఫైనల్ నేటి అర్ధరాత్రి గం. 1.30 నుంచి టెన్-1లో ప్రత్యక్షప్రసారం -
స్టెఫీ సరసన సెరెనా
నిరీక్షణ ముగిసింది. సెరెనా సాధించింది. పది నెలల నుంచి అందినట్టే అంది చేజారిపోతోన్న అరుదైన రికార్డును ఈ నల్లకలువ వింబుల్డన్ వేదికగా అందుకుంది. ఓపెన్ శకంలో (1968 తర్వాత) అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేసింది. గతేడాది వింబుల్డన్ టైటిల్ సాధించాక... యూఎస్ ఓపెన్ సెమీస్‌లో నిష్ర్కమించడం... ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలువడంతో సెరెనాకు ఈ ఘనత సాధించడం కాస్త ఆలస్యమైంది. ♦ 22వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన అమెరికా స్టార్ ♦ స్టెఫీ గ్రాఫ్ రికార్డు సమం ♦ ఏడోసారి వింబుల్డన్ ట్రోఫీ కైవసం ♦ ఫైనల్లో కెర్బర్‌పై విజయం ♦ రూ. 17 కోట్ల 39 లక్షల ప్రైజ్‌మనీ సొంతం లండన్: ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో తడబడిన సెరెనా... ముచ్చటగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని విజేతగా నిలిచింది. తన కెరీర్లో 22వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా జర్మనీ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. సెంటర్ కోర్టులో శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా (అమెరికా) 7-5, 6-3తో నాలుగో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను ఓడించింది. ఈ క్రమంలో ఏడోసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతోపాటు 20 లక్షల పౌండ్లను (రూ. 17 కోట్ల 39 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంది. రన్నరప్ కెర్బర్‌కు 10 లక్షల పౌండ్ల (రూ. 8 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. 1995 నుంచి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతోన్న సెరెనా కెరీర్లో ఓవరాల్‌గా ఇది 71వ సింగిల్స్ టైటిల్. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో సెరెనా ఐదో స్థానంలో ఉంది. మార్టినా నవ్రతిలోవా (167 టైటిల్స్), క్రిస్ ఎవర్ట్ (154), స్టెఫీ గ్రాఫ్ (107), మార్గరెట్ కోర్ట్ (92) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. బదులు తీర్చుకుంది ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో కెర్బర్ చేతిలో ఓడిపోయిన సెరెనా వింబుల్డన్‌లో మాత్రం ఈ జర్మనీ క్రీడాకారిణిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. 81 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సెరెనాకు కెర్బర్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో ఇద్దరూ పోటీపడి పాయింట్లు గెలిచారు. అయితే కీలకదశలో మాత్రం సెరెనా తన పవర్ఫుల్ ఆటతీరుతో కెర్బర్‌పై పైచేయి సాధించింది. తొలి సెట్ 12వ గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెరెనా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ ఎనిమిదో గేమ్‌లో మరోసారి కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా... తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సెరెనా కళ్లు చెదిరేరీతిలో సర్వీస్ చేసింది. ఆమె ఏకంగా 13 ఏస్‌లు సంధించింది. మరోవైపు కెర్బర్ ఒక్క ఏస్‌ను కూడా కొట్టలేకపోయింది. ఓపెన్ శకంలో మహిళల గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా సెరెనా (34 ఏళ్ల 283 రోజులు) నిలిచింది. గతేడాది వింబుల్డన్‌లో 33 ఏళ్ల 285 రోజుల వయస్సులో టైటిల్ నెగ్గిన సెరెనా ఈసారీ విజేతగా నిలిచి తన పేరిటే ఉన్న రికార్డును సవరించింది. ⇒ మరో రెండు టైటిల్స్ సెరెనా సాధిస్తే... మహిళల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24 టైటిల్స్) రికార్డును సమం చేస్తుంది. ⇒ అత్యధికసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణుల జాబితాలో సెరెనా సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకుంది. సెరెనాతోపాటు స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ), డోరెతి లాంబర్ట్ చాంబర్స్ (బ్రిటన్) ఏడుసార్లు చొప్పున ఈ టైటిల్‌ను సాధించారు. ఈ జాబితాలో మార్టినా నవ్రతిలోవా (9 సార్లు), హెలెన్ విల్స్ మూడీ (8 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ⇒ సెరెనా 1999లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గినప్పటి నుంచి ఇప్పటివరకు 20 మంది వేర్వేరు క్రీడాకారిణులు కూడా గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌గా నిలిచారు. ‘‘ముందుగా దేవుడికి కృతజ్ఞతలు. ఆయన కరుణ లేకుంటే నేనీ ఘనత సాధించకపోయేదాన్ని. నా విజయంలో కుటుంబసభ్యులు, సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది. వింబుల్డన్ సెంటర్ కోర్టు నాకు ఇల్లు లాంటిది. 22 సంఖ్య అద్వితీయ అనుభూతినిస్తోంది. కెర్బర్తో ఆడితే నాలోని అత్యుత్తమ ఆటతీరు బయటకొస్తుంది. గ్రాఫ్ రికార్డును సమం చేసినందుకు గొప్పగా అనిపిస్తోంది.’’ - సెరెనా సెరెనా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్(22) ⇒ ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2003, 2005, 2007, 2009, 2010, 2015 ⇒ {ఫెంచ్ ఓపెన్ (3): 2002, 2013, 2015 ⇒ వింబుల్డన్ (7): 2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016 ⇒ యూఎస్ ఓపెన్ (6): 1999, 2002, 2008, 2012, 2013, 2014 ≈ సెరెనా సాధించిన 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో తొమ్మిది ఆమెకు 30 ఏళ్ల వయసు దాటాకే రావడం విశేషం. ≈ సెరెనా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గేందుకు 346 మ్యాచ్‌లు ఆడింది. స్టెఫీ గ్రాఫ్ 303 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించింది. ≈ ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు (304) నెగ్గిన రెండో క్రీడాకారిణి సెరెనా. మార్టినా నవ్రతిలోవా (306 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉంది. -
వింబుల్డన్ విజేత సెరెనా
లండన్ : సెరెనా విలియమ్స్.. ఈ ఏడాది ఎట్టకేలకు తొలి గ్రాండ్ స్లామ్ సాధించింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో.. వరుస రెండు సెట్లలో పోరును ముగించి వింబుల్డన్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ 7-5, 6-3 తేడాతో ఎంజెలిక్ కెర్బర్(జర్మనీ)పై గెలిచి వింబుల్డన్ టైటిల్‌ను సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా ఆద్యంత ఆకట్టుకుని ఏడోసారి వింబుల్డన్ టైటిల్ ను ముద్దాడింది. తద్వారా జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ పేరిట ఉన్న 22 గ్రాండ్ స్లామ్ రికార్డును సమం చేసింది. దాంతోపాటు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ వేటలో కెర్బర్ చేతిలో ఓటమికి సెరెనా ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. తొలి సెట్ ఆరో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా.. ఆ తరువాత తన సర్వీస్‌ను కాపాడుకుని ఆ సెట్‌ను దక్కించుకుంది. ఇక రెండో సెట్లో కెర్బర్ నుంచి సెరెనా కాస్త పోటీ ఎదుర్కొంది. రెండో సెట్ లో సెరెనా 2 -1 తో ఆధిక్యంలో ఉన్న దశలో కెర్బర్ పుంజుకుంది. తన సర్వీసును కాపాడుకోవడంతో పాటు, సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో స్కోరు 3-3తో సమం చేసింది కాగా, ఆ తరువాత నాల్గో గేమ్‌లో తన సర్వీసును కాపాడుకున్న సెరెనా.. ఐదో గేమ్‌లో బ్రేక్ పాయింట్ ద్వారా ఆధిక్యం సాధించింది. ఇక ఆరో గేమ్‌ను సెరెనా సునాయాసంగా గెలిచి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు స్టెఫీగ్రాఫ్ తర్వాత వింబుల్డన్ సాధించిన తొలి జర్మనీ క్రీడాకారిణిగా నిలవాలనుకున్న కెర్బర్ రన్నరప్ గా సరిపెట్టుకుంది.