Kesava reddy victims
-
ఊరంతా దాచి కేశవరెడ్డి చేతిలో పెడితే...ఇప్పుడేమో?
సాక్షి, నంద్యాల(కర్నూలు) : పాణ్యం మండలం నెరవాడ వద్ద ఉన్న కేశవరెడ్డి స్కూల్ ఎదుట యాళ్లూరు గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. గ్రామానికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లేదని భీష్మించుకు కూర్చున్నారు. పాణ్యం సీఐ వంశీకృష్ణ జోక్యం చేసుకుని కేశవరెడ్డి కుమారుడు మంగళవారం నాటికి వాయిదా కోరాడని చెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అనంతరం యాళ్లురు రైతుసంఘం మాజీ అధ్యక్షులు బెక్కెం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 2015లో కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డికి రూ.24 లక్షలు అప్పుగా ఇచ్చామని తెలిపారు. అ డబ్బంతా గ్రామనికి చెందిన మాతా అరవిందమ్మ ఆశ్రమం, దేవాలయం, గ్రామ అభివృద్ధికి దాచుకున్నదని తెలిపారు. రూ.24 లక్షలకు రూ.2 వడ్డీ ప్రకారం ఏటా చెల్లిస్తానని చెప్పడంతో గ్రామపెద్దలందరూ కలిసి అప్పుగా ఇవ్వడం జరిగిందన్నారు. తీసుకున్న తర్వాత రెండేళ్లు వడ్డీ చెల్లించి తర్వాత సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించడం నిలిపివేశాడన్నారు. గ్రామస్తులు వడ్డీ చెల్లించాలని అడిగితే శ్రీకాకుళంలో వెంచర్ వేశామని, అది అమ్ముడు పోతే మొత్తం నగదు చెల్లిస్తానని నమ్మబలికాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పటి నుంచి వడ్డీ, అసలు చెల్లించకుండా గడువు చెబుతూ కాలం వెల్లదీశాడని చెప్పుకొచ్చారు. కొంత కాలం తర్వాత గ్రామపెద్దలంతా కేశవరెడ్డిని గట్టిగా నిలదీస్తే రూ.6లక్షలు ఇచ్చి మిగతా సొమ్మంత కొంత వ్యవధిలోనే పూర్తిగా చెల్లిస్తానని నమ్మబలికాడన్నారు. తర్వాత కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారని, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సొమ్ము ఇవ్వలేదని తెలిపారు. సీఐ ఇచ్చిన హామీ మేరకూ మంగళవారం కేశవరెడ్డి కుమారుడు అప్పు చెల్లించకపోతే బుధవారం స్కూల్ గేట్‌కు తాళాలు వేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు బెక్కెం బాలతిమ్మారెడ్డి, బెక్కెం చిన్నరామకృష్ణారెడ్డి, కైప జగన్నాథరెడ్డి, గంగుల వెంకటచంద్రారెడ్డి, గంగుల తిమ్మారెడ్డి, బెక్కెం మధుసుదన్‌రెడ్డి, బెక్కెం చంద్రశేఖర్‌రెడ్డి , పోగుల వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేశవరెడ్డి విద్యాసంస్థల స్కాం లో కొత్త ట్విస్ట్
-
కేశవరెడ్డి విద్యాసంస్థల స్కాం లో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : విద్యార్థుల వద్ద డిపాజిట్ల పేరుతో కోట్ల స్కాంతో సంచలనం సృష్టించిన కేశవరెడ్డి విద్యాసంస్థల కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి సమీప బంధువును కాపాడేందుకు టీడీపీ సర్కార్ పావులు కదుపుతోంది. జిల్లాలో మొత్తం 1428మంది బాధితులు ఉండగా.. కేవలం 13 మందినే సాక్ష్యులుగా ఏపీ సీఐడీ చేర్చింది. కేశవరెడ్డికి అనుకూలంగా సీఐడీ వ్యవహరిస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమనూ సాక్ష్యులుగా చేర్చాలని పలువురు బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేశవరెడ్డి బాధితులుకు న్యాయవాదులు హరినాథ రెడ్డి, విజయ కుమార్, సీపీఎం నేత రాంభూపాల్ అండగా నిలిచారు. కేశవరెడ్డి బాధితుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని కేశవరెడ్డి బాధితులు, ప్రజా సంఘాలు నిర్ణయించాయి. -
మంత్రి ఆది మోసం : వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి, అమరావతి బ్యూరో: కేశవరెడ్డి విద్యాసంస్థలకు తామిచ్చిన అప్పును తిరిగి ఇవ్వకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి తమను తిప్పుకుంటున్నారని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బాధితుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఆరేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ తిప్పుకుంటున్నారు తప్పితే డబ్బులు ఇవ్వట్లేదని వాపోయారు. మంత్రి హామీపై విసుగుచెందిన శ్రీనివాస్‌రెడ్డి, ఆయన తన భార్య హైమావతి, ముగ్గురు సంతానంతో కలసి సచివాలయం గేట్–2 వద్ద పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. అక్కడున్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి అడ్డుకుని ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. 2012లో ఓ మధ్యవర్తి ద్వారా కేశవరెడ్డికి రూ. 5 లక్షలు ఇచ్చామని 8 నెలల పాటు వడ్డీ ఇచ్చి తర్వాత నుంచి ఇవ్వడం మానేశారని చెప్పారు. ఈ విషయమై మంత్రి ఆదిని కలవగా డబ్బు తాను చెల్లిస్తానని హామీ ఇచ్చి పలు దఫాలుగా రూ.లక్ష ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును కలిసినా, ఆయన కూడా చేస్తాం.. చూస్తాం అన్నారు తప్పితే ఇంతవరకు న్యాయం చేయలేదని వాపోయాడు. నెల రోజుల్లో తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. -
అమరావతిలో కేశవరెడ్డి బాధితుడి ఆందోళన
-
జన్మభూమి సభలో ఏపీ మంత్రికి షాక్