ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్‌గా ఖాలిద్ జమీల్
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్ జమీల్‌ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు హెడ్ కోచ్‌గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్ జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్ ఈస్ట్ డీలాపడగా... హెడ్ కోచ్ గెరార్డ్ నుస్ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు.