Khargone
-
Women At Leisure: తీరిక వేళలో.. తీయటి జ్ఞాపకాలలో...
‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి తీరిక సమయాన్ని మించిన విలువైన సమయం లేదు’ అంటుంది సురభి యాదవ్. పని ఒత్తిడి లేని తీరిక సమయం మహిళలకు ఎలాంటిది? పాట నుంచి ఆట వరకు ప్రతి విన్యాసం, ప్రతి క్షణం అపురూపం. అలాంటి అపురూప కాలాన్ని ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ అందంగా అద్దం పడుతుంది.... మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సురభి యాదవ్ ఐఐటీ–దిల్లీలో బయో కెమికల్ ఇంజనీరింగ్ చేసింది. పెద్ద చదువు చదువుకున్న తొలి మహిళగా తనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఊరు దాటి ఐఐటీ–క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన సురభికి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ఎంతోమంది వ్యక్తులు, వందలాది పుస్తకాలు, కళలు... తన ఆలోచనలను విశాలం చేశాయి.. ‘థింకింగ్... రీడింగ్... రైటింగ్’ అనేది తన ప్రధాన వ్యాపకంగా మారింది. పై చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన సురభి అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక ఎన్జీవోలో కొంతకాలం పనిచేసింది. ఆ తరువాత ‘సఝే సప్నే’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ‘సామాజిక సేవ అనేది ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాదు. అది మన జీవనవిధానంలో భాగం’ అని తండ్రి చెప్పిన మాటలు సురభి సామాజిక సేవారంగంలోకి రావడానికి కారణం అయ్యాయి. స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే సురభి యాదవ్‌లో మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఆమె తాజా ప్రాజెక్ట్ ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ తన తల్లి జ్ఞాపకాల స్ఫూర్తితో చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి గురించి బంధువులు, పరిచయస్తులతో మాట్లాడుతున్న క్రమంలో తల్లికి సంబంధించి తనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే తల్లిలో ఒక సరదా మనిషి ఉన్నట్లు తెలియదు. ఆమెకు ఈత వచ్చు అనే విషయం తెలియదు. ‘ఇలాంటి తల్లులు ఇంకా ఎంతమంది ఉన్నారో?’ అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. తీరికవేళలలో సురభి తల్లి తన పేరు ‘బసంతి’ని పేపర్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆమె చదువుకోలేదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులపై సంతకం పెడుతున్నప్పుడు ఆమె కళ్లలో గొప్ప వెలుగు కనిపించేది. ‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని తీరిక సమయంలో పరిశీలించాలి. అయితే పని ఒత్తిడి వల్ల ఆ తీరిక సమయాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకుంటే అరుదైన సందర్భాలను రికార్డ్ చేయవచ్చు. బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్ అలాంటి ప్రయత్నమే’ అంటుంది సురభి. ‘ఉమెన్ ఎట్ లీజర్’లో ఉన్న వెయ్యికిపైగా చిత్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసినవి. -
ఘోరం.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి..
భోపాల్: మధ్యప్రదేశ్ ఖర్గోన్లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పాప అరుపులు కేకలు విని స్థానికులు వచ్చి కుక్కలను చెదరగొట్టారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చిన్నారి సోనియా ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి రోజూకూలీగా పనిచేస్తున్నాడు. తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని రోదించాడు. చదవండి: స్నేహితుడిని బెదిరించి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ -
కొత్త ఫోన్.. ఓ ప్రాణాన్ని తీసింది
ఖార్గోన్ : మొబైల్ ఫోన్ మోజు.. ఓ ప్రాణాన్ని హరించింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఈ సమయంలో ఖరీదైన ఫోన్ ఎందుకని మందలించిన భార్యను దారుణంగా కొట్టి చంపాడో భర్త. ఈ ఘటన మధ్యప్రదేవ్‌లోని ఖార్గోన్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖార్గోని జిల్లాలోని డోమ్వాడ గ్రామానికి చెందిన భోలారం అనే వ్యక్తి భార్య నందుబాయి, ముగ్గురు పిల్లలతో ఓ అద్దె ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు. ఇలాంటి సమయంలో భోలారాం ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బుతో కొత్త ఫోన్ కొంటానని భార్యతో చెప్పాడు. ఇంట్లో పరిస్థితి బాగా లేదని, ఇప్పుడు ఫోన్ వద్దని భర్తతో నందు వాదించింది. అయినప్పటికీ భోలారాం వినకుండా ఫోన్ కొనేందుకు షోరూమ్‌కు వెళ్లాడు. దీంతో కలత చెందిన నందు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. సాయంత్రం కొత్త ఫోన్‌తో ఇంటికి తిరిగివచ్చిన భోలారాం..ఇంట్లో భార్య కనిపించకపోయేసరికి అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ గొడవ పడి భార్య, పిల్లలను తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఫోన్ కొనాల్సిన అవసరమేంటని భర్తను మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన భోలారాం.. నందు తలను గోడకేసి బలంగా గుద్దాడు. దీంతో నందుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భోలారాం గట్టిగా ఏడుస్తూ ముగ్గురు పిల్లలను ఇంట్లోనే వదిలి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
నవోదయ విద్యార్థి ఆత్మహత్య
ఖర్గోన్: చదువు ఒత్తిడిని భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ నవోదయ స్కూల్లో 8 వతరగతి చదువుతున్న ఆర్యన్ మన్శారే(14) గురువారం బాత్రూంలో ఉరి వేసుకున్నారు. వార్షిక పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకనే ఆర్యన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఖర్గోన్ పోలీస్ అధికారులు తెలిపారు. స్నానానికి బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుంటున్న ఆర్యన్ చూసిన తోటి విద్యార్థి ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే బాలున్ని సనావాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆర్యన్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరక లేదని, ఆర్యన్ తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఖర్గన్ ఎస్పీ డి. కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. -
ప్రతి రోజు నీ భార్యను హాయ్ డార్లింగ్ అను: కోర్టు
ఇండోర్: పెటాకులవుతున్న ఓ పెళ్లిని ఓ జిల్లా కోర్టు నిలబెట్టింది. దూరమవుతున్న ఆ దంపతులకు ఆ బంధం విలువను గుర్తు చేసింది. భార్యా భర్తల మధ్య పరస్పర అనుబంధం మాటతీరు ఎలా ఉండాలనే విషయం స్పష్టంగా చెప్పింది. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో రమేశ్, రాశి(విజ్ఞప్తి మేరకు పేర్లు మార్చాం) అనే ఇద్దరికి వివాహం అయింది. వివాహం అయిన కొద్ది రోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రాశి ఆరునెలల కిందట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయినా గొడవలు సర్దుమనగలేదు. దీంతో రాశి పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు, తన బిడ్డకు అయ్యే పోషణ వ్యయం భర్త నుంచి ఇప్పించాలంటూ జిల్లా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. దీంతో ఆ జిల్లా న్యాయమూర్తి గంగాచరణ్ దూబే డ్రైవర్ అయిన రమేశ్ కు భార్యభర్తల సంబంధం గుర్తు చేశాడు. భార్యమీద భర్త తప్పక ప్రేమ చూపించాలని అన్నాడు. ప్రతి రోజు సాయంత్రం 'హాయ్ డార్లింగ్.. ఎలా ఉన్నావు?ఈ రోజు నీకు ఎలా గడిచింది? అంటూ ప్రేమగా పలకరించాలని ఆయన స్వయంగా చెప్పారు. భర్త ఎప్పుడూ భార్యతోనే ఉండాలని, పుట్టింటికి వెళితే వెళ్లి ప్రేమ చూపించి తిరిగి తన వద్దకు తెచ్చుకోగలగాలని సూచించారు. వివాహాన్ని రక్షించాలి తప్ప భగ్నం చేయొద్దని అన్నారు.