kharif seasaon
-
పొలంబడి.. కొత్త ఒరవడి
కడప అగ్రిక్చలర్: సేద్యం లాభసాటి కావాలి. సాంకేతిక సలహాలు, సాగు అధ్యయన అంశాలపై రైతులకు అవగాహన పెరగాలి. వ్యవసాయ అధికారులు పొలం వద్దకే వెళ్లి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి శాస్త్రీయ సాగు విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించాలనే ఉద్దశంతోతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో ఒక పొలంబడిని నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. జిల్లావ్యాçప్తంగా 387 పొలంబడులను ఎంపిక చేశారు. ఇందులో వరి, పత్తి, అపరాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, చిరుధాన్యాలు పంటలు ఉన్నాయి. రైతులకు సాంకేతిక సలహాలు, సాగు ఆధ్యయన అంశాలను వివరించడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు డాక్టర్ వైఎస్సార్ పొలంబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తక్కువ òపెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడిని ఎలా సాధించవచ్చు? ఇందుకు శాస్త్రయ సాగు విధానం ఎలా ఉపయోగపడుతుందో రైతులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఒకటి, రెండు చొప్పున మాత్రమే పొలంబడులను నిర్వహించేవారు. అది కూడా కొన్ని పంటలకు మాత్రమే పరిమితం చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అన్ని పంటలకూ పొలంబడి నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం బేస్‌లైన్ సర్వేను నిర్వహిస్తున్నారు. త్వరలో సాగుకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,93, 000 ఎకరాలు. ఇందులో వరి 32,741 హెక్టార్లలో, వేరుశనగ 7,454 హెక్టార్లలో, పత్తిపంట 17,303 హెక్టార్లలో, కందిపంట 3,685 హెక్టార్లలో, జొన్న 2021 హెక్టార్లలో, సజ్జలు 1,091 హెక్టార్లలో, మిరప 1070 హెక్టార్లలో, పసుపు 3420 హెక్టార్లలో, ఉల్లి 3603 హెక్టార్లలో, మొక్కజొన్న 624 హెక్టార్లలో, మినుములు 1268 హెక్టార్లలో, పొద్దు తిరుగుడు 874 హెక్టార్లలో, పెసర 225 హెక్టార్లలో, అముదం 534 హెక్టార్లలో సాగు చేయనున్నారు. ఇందులో ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పొలంబడి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పంటలసాగు చేపట్టగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ∙తక్కువ పెట్టబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధించేలా చూడటం. ∙ఇందులో ఎంపిక చేసిన గ్రామాల్లో 10 హెక్టార్లను గుర్తించి 20 నుంచి 30 మంది రైతులను భాగస్వాములను చేసి సహజ సి ద్ధవనరులతో సాగు చేయించడం. ∙భూసార పరీక్ష ఫలితాల అధారంగా ఎరువుల వినియోగంపై చైతన్యం కల్పించడం. ∙వానపాములు, సేంద్రియ ఎరువుల వాడాకాన్ని పెంచి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిచేలా చూడటం. ∙ విత్తన శుద్ధితో చీడపీడల నివారణ, అంతర మిశ్రమ పంటల ద్వారా మిత్ర పురుగు వృద్ధి, పక్షి స్థావరాల ఏర్పాటు ఆవశ్యకత గురించి తెలియజేయడం. ∙రైతులను సాగు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా చేయడం, స్వయం నిర్ణయం తీసుకునేలా.. సాధికారత సాధించేలా సమగ్రశిక్షణ ఇచ్చేలా కార్యక్రమానికి రూపకల్పన చేయడమే కార్యక్రమం ఉద్దేశం. ప్రతి నెల మంగళవారం నుంచి శుక్రవారంలోపు పొలంబడి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారు. ప్రతి గ్రా మంలో 14 వారాలపాటు 30 మంది రైతులతో స్థానికంగా సాగు చేస్తున్న పంటలపై శిక్షణ ఇస్తారు. శత్రు, మిత్ర పురుగుల ఉనికిని గుర్తించి మిత్ర పురుగుల సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. పంటలో చీడపీడల పరిశీలన, వాటి నివారణకు తీసుకోవాల్సిన పద్దతులను వివరిస్తారు. రైతు లతో ముఖాముఖి మాట్లాడి శాస్త్రీయ సాగు విధానంపై పూర్థిస్థాయిలో అవ గాహన కల్పిస్తారు. సాగులో ఎదురయ్యే ఆటుపోట్లును అధిగమించేలా సాంకేతిక సలహాలిస్తారు. సాగు పెట్టుబడి వ్య యం 15 శాతం తగ్గించడం, దిగుబడిలో 15 శాతం అధికంగా అందేలా ప్రణాళికలను రూపొందిస్తారు. గ్రామస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సహాయకులు నిర్వహించే పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయ విస్తరణాధికారి, మండల వ్యవసాయ అధికారి, మండలస్థాయిలో పర్యవేక్షిస్తారు. సబ్‌డివిజన్ స్థాయిలో ఏడీఏæ, జిల్లాస్థాయిలో జేడీఏ పర్యవేక్షిస్తారు. త్వరలో కార్యక్రమం ప్రారంభిస్తాం జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌కు 387 పొలంబడి కా ర్యక్రమాలు నిర్వహించనున్నాం. త్వరలో ప్రారంభంకానున్న సీజన్‌కు అను గుణంగా ఆయా పంటల సాగు నుంచే కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ సారి విద్యార్థి దశ నుంచే వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా విద్యార్థులను ఈ కార్యక్రమంలో మమేకం చేయనున్నాం. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
రైతులకు గుడ్ న్యూస్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తొలకరి పలకరిస్తున్న వేళ అన్నదాతకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఖరీఫ్ సీజన్ ఆంరభమవుతున్న తరుణంలో 2022–23 సీజన్‌కు వరి సహా 14 రకాల పంటల మద్దతు ధరలను పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై మద్దతు ధరను రూ.100 పెంచారు. సాధారణ రకం క్వింటాల్ రూ.1,940 ఉండగా తాజా నిర్ణయంతో రూ. 2,040కు పెరగనుంది. గ్రేడ్–ఏ రకం రూ.1,960 నుంచి రూ.2,060కు పెరగనుంది. రైతులకు మరింత ఆర్థ్ధిక ప్రోత్సాహమిచ్చేందుకు వరి విస్తీర్ణాన్ని పెంచేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాలు..నూనె గింజల సాగుకు ప్రోత్సాహమిచ్చేలా... కొన్నేళ్లుగా నూనెగింజలు, పప్పుధాన్యాల ధరలు దేశీయంగా అనూహ్యంగా పెరగడం, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకుంది. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. నువ్వుల మద్దతు ధర గరిష్టంగా రూ.523, సోయాబీన్ రూ.350, సన్‌ఫ్లవర్ రూ.300, వేరుశనగ రూ.300 పెరిగాయి. పెసర ధర రూ.480, కంది, మినప రూ.300 పెరిగాయి. జాతీయ సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లుండేలా మద్దతు ధరను నిర్ణయించినట్టు కేంద్రం ప్రకటించింది. తాజా పెంపుతో ఎనిమిది పంటలకు మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును మరింతగా ప్రోత్సహించడం, డిమాండ్–సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి మద్దతు ధరలను పెంచామన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగ సమగ్రాభివృధ్ధికి మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు భారత్–యూఏఈ మధ్య పరిశ్రమలు, అధునాతన పరిజ్ఞానాల్లో సహకారానికి అవగాహన ఒప్పంద ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. 10 సమాచార ఉపగ్రహాలను అంతరిక్ష శాఖ అధీనంలోని ఎన్ఎస్ఐఎల్కు బదిలీ చేసే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. వాతావరణ మార్పులపై సంయుక్త పరిశోధన కోసం ఏరిస్, జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఒప్పందానికీ ఆమోదముద్ర వేసింది. -
Telangana: బోరు బావుల కింద వరి సాగుకు చెక్..!
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో బోరు బావుల కింద వరికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిం చాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ రఘునందన్ రావు మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. యాసంగి సీజన్లో ఉత్పత్తి చేసిన బాయిల్డ్ రైస్‌ను తెలంగాణ నుంచి తీసుకునే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో ఆ సీజన్లో వరి సాగును పూర్తిగా నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులను వరి సాగు నుంచి ఎలా మళ్లించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే యాసంగి సీజన్లో బోరుబావుల కింద వరి సాగును నియంత్రించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల బోరుబావులు ఉన్నాయి. గత యాసంగిలో మొత్తం 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఒక్క బోరు బావులు కిందనే 46 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వరి సాగు నుంచి రైతుల్ని మళ్ళించి పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు సాగు చేసేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి రైతు సదస్సులు మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, కమిషనరేట్‌లోని ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో రైతు అవగాహన సదస్సులు ప్రారంభించాలని, ఈ నెలాఖరు కల్లా ముగించాలని డీఏవోలకు సూచించారు. వ్యవసాయ శాఖ నిర్ణయం -
Kaleshwaram : మూడో సీజన్లో ముందస్తుగానే...
కాళేశ్వరం: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మూడో సీజన్లో నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నీటిని తరలించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీరింగ్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ పూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లోని 17 మోటార్లకు గాను నాలుగింటిని ప్రారంభించారు. తొలుత 1, ఆపై 2, 5, 7 నంబర్ మోటార్లు ప్రారంభించగా, ఎనిమిది పంపుల ద్వారా నీరు గ్రావిటీ కాల్వలో ఎత్తిపోస్తున్నారు. ఈ నీరు అన్నారం బ్యారేజీకి తరలుతోంది. 5 రోజులుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుతోంది. బుధవారం ఇక్కడ గోదావరిలో 5.54 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. మరో రెండు రోజుల్లో వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో లక్ష్మీ పంపుహౌస్ ద్వారా నీటి ఎత్తిపోతల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూన్ నుంచే ఖరీఫ్ అవసరాలకు నీటిని తలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. -
ధాన్యం నిల్వకు జాగేదీ?
కరీంనగర్‌సిటీ: జిల్లాలో రబీలో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. ఇప్పటికే రైస్ మిల్లులు, గోదాముల్లో రబీ ధాన్యం, బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా కస్టమ్ మిల్లింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గోదాముల్లో సామర్థ్యానికి సరిపడా నిల్వలు పేరుకుపోయి ఖాళీ లేకపోవడం.. బియ్యం తరలించేం దుకు రైల్వే ర్యాకులు రాకపోవడం వెరసి ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికితోడు తమిళనాడు రాష్ట్రంతో తెలంగాణ రా ష్ట్రం ఒప్పందం చేసుకున్నట్లు రైతుల నుంచి అదనంగా కొనుగోలు చేసుకున్న వడ్లను మరాడించి సిద్ధం చేసుకున్నప్పటికీ ఆ రాష్ట్రంలో అమ్మకానికి అనుమతించకపోవడం మిల్లర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫలితంగా ఖరీఫ్ సీజన్లో వచ్చే ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఏటా ప్రభుత్వం ఖరీఫ్ మార్కెట్ సీజన్‌గా భావిస్తోంది. ఖరీఫ్, రబీల్లో వచ్చే ఉత్పత్తులను కలిపి మార్కెటింగ్‌పరంగా ఖరీఫ్ సీజన్‌గానే పేర్కొంటోంది. అక్టోబరు ఆరంభం నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఈ సీజన్ ఉంటుంది. 2017–18 రబీ సీజన్ ఆగస్టు 15తోనే ముగుస్తుంది. అయితే కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాల్సిన మిల్లర్లు ఇప్పటివరకు 68 శాతమే సీఎంఆర్‌గా అందించారు. ఇప్పటివరకు 58,920 టన్నుల బియ్యాన్ని అప్పగించకుండా తమ వద్దే పెట్టుకున్నారు. అందుకు గోదాముల్లో నిల్వ సామర్థ్యం లేదనే కారణం చెబుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లుల్లోనే నిల్వ ఉందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముంది. మిల్లర్లపై ఒత్తిడి పెంచినా గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం తరలించడానికి చర్యలు లేకపోవడమే ఇందుకు కారణంగా స్పష్టమవుతోంది. సీఎంఆర్ ఇంకెప్పుడు..? ధాన్యం ఉత్పత్తిలో జిల్లా కొన్నేళ్లుగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటోంది. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 2018 రబీలో 2,60,844 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఈ ధాన్యాన్ని జిల్లాలోని 121 మిల్లర్లకు ఇచ్చింది. వీరిలో 84 మంది బాయిల్డ్ మిల్లర్లు, 37 మంది రారైస్ మిల్లర్లు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులోగా ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలనేది నిబంధన. ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై తెల్లకార్డుదారులకు పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చితే 1,77,314 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుంది. ప్రభుత్వ ధాన్యాన్ని తమ మిల్లులకు కేటాయించుకున్న మిల్లర్లు బియ్యం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. గడువు ముగిసినా ఇప్పటికీ బియ్యం పూర్తిగా ఇవ్వలేదు. జిల్లావ్యాప్తంగా ఇంకా 58,920 టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇప్పటికీ 1,18,393 టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. మిగిలిన బియ్యాన్ని వెంటనే రాబట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన పౌర సరఫరాల శాఖ.. మిల్లర్లకు గడువు పొడిగిస్తూ కాలం వెల్లదీస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన బియ్యంలో తక్కువగా వచ్చినవి మిల్లర్లు వద్ద కూడా లేవని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉండడంతో కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకున్నట్లు తెలిసింది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే మిల్లర్ల సంఘం ప్రోద్బలంతో రాజకీయంగా ఒత్తిడులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ధాన్యం అక్రమార్కుల పాలవుతోందని తెలుస్తోంది. తమిళనాడుకు అనుమతి కరువు రబీలో ప్రభుత్వ ధాన్యంతోపాటు రైతుల నుంచి మద్దతు ధరకు మించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చిన రైస్‌మిల్లర్లకు వాటిని అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలుసుకుని ఒప్పందం ప్రకారం తమిళనాడుకు బియ్యం అమ్ముకునేందుకు అనుమతి నివ్వాలని విన్నవించారు. తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల టన్నుల బియ్యాన్ని తమిళనాడుకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో 60 వేల టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 80 వేల టన్నుల బియ్యాన్ని విక్రయించేందుకు అగ్రిమెంట్ చే యించుకున్నారు. అవి రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.1590తో పా టు అదనంగా రూ.30 చొప్పున క్విం టాలుకు కొనుగోలు చేయాలని నిబం ధన విధించారు. ఈ క్రమంలో రైతుల నుంచి సీఎంఆర్‌కు అదనంగా ధా న్యం కొనుగోలు చేశారు. 1620 క్విం టాలు చొప్పున కొనుగోలు చేసి వాటిని బియ్యం గా తమిళనాడుకు క్వింటాల్‌కు రూ.2450 చొప్పు న విక్రయించేందుకు అగ్రిమెంట్ పొందారు. తీరా సీజన్ ముగుస్తున్నా అనుమతిపై స్పందించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులకు చెల్లించి వారి వివరాలతోపాటు అకౌంట్ పే చెక్, బ్యాంకు స్టేట్మెంట్తో సమర్పించడానికి సిద్ధం గా ఉన్నా ప్రస్తుతం ప్రభుత్వం విక్రయానికి అనుమతించడం లేదు. రబీ ధాన్యం పూర్తిగా అటు సీఎంఆర్‌గా.. ఇటు కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోతే వచ్చే ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఫలితంగా రైతులు ఇబ్బందుల పాలయ్యే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు. గోదాములన్నీ ఫుల్ జిల్లాలో ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములకు సంబంధించి 94 మిల్లుల పరిధిలో 1,15,700 టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తు తం ఆయా గోదాములన్నీ నిల్వలతో నిండిపోయి ఉన్నాయి. అవి ఖాళీ చేసే పరిస్థితి లేకపోవడంతో కస్టమ్ మిల్లింగ్ ధాన్యానికి జాగలేకుండా పోయిం ది. జిల్లావ్యాప్తంగా 121 మంది రైస్‌మిల్లర్లకు కేటా యించిన 2,60,844 మెట్రిక్ టన్నుల ధాన్యంలో బియ్యంగా మరాడించి 1,77,314 మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. బాయిల్డ్ రైస్ క్వింటాలుకు 68 శాతం, రారైస్ క్వింటాలుకు 67 శాతం బియ్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 శాతంపైగా రావాల్సిన సీఎంఆర్ 66 శాతమే ప్రభుత్వానికి వచ్చింది. గడువులోగా పూరిస్థాయి సీఎంఆర్ అందించడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం గోదాముల్లో కేవలం 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల స్ధలం మాత్రమే ఖాళీగా ఉంది. జిల్లాలో పీడీఎఫ్ బియ్యం, గోధుమలు, రబీ బియ్యం తదితర నిల్వలతో గోదాములు 90 శాతం వరకు నిండుకున్నాయి. పత్తాలేని ర్యాకులు జిల్లాకు రైల్వే ర్యాకుల కొరత వెంటాడుతోంది. అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి రైల్వే శాఖ నిర్లక్ష్యం ఫలితంగా సరైన ర్యాకుల కేటాయింపులు లేక ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీ కావడం లేదు. ఒక్కోర్యాకు సామర్థ్యం 2500 మెట్రిక్ టన్నులు ఉంటుంది. నెలకు 35 వ్యాగన్లు రావాల్సి ఉన్నా ఆ దిశగా ఒక్కటీ కానరావడం లేదు. తమిళనాడు, కేరళలో వర్షాలు, వరదల కారణంగా ర్యాకులు ని లిచిపోయినట్లు తెలుస్తోంది. వ్యాగన్ల కోసం అధి కార యంత్రాంగం ప్రతిపాదనలు పంపుతున్నా స్పందన లేదు. సకాలంలో ర్యాకులు వస్తే తప్ప గోదాములు ఖాళీ అయ్యే పరిస్థితి కానరావడం లేదు. ఎఫ్‌సీఐ అధికారులు పట్టించుకోని కారణంగానే గోదాముల సమస్య జఠిలమవుతోంది. రైల్వేశాఖ ర్యాకులు కేటాయిస్తున్నా వాటిని తెప్పించే ప్రయత్నాలు చేయడంలో ఎఫ్‌సీఐ అధికారులు విఫలమవుతున్నారు. అధికారయంత్రాంగం సై తం అటు రైల్వేశాఖపైగానీ.. ఇటు ఎఫ్‌సీఐ శాఖపైగానీ ఒత్తిడి తీసుకొస్తే తప్ప పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కానరావడం లేదు. -
పట్టాదారులు వర్సెస్ కౌలు రైతులు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుంది. ఉగాది నాటికే కౌలు ఒప్పందాలు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ అనేక గ్రామాల్లో అటువంటి సందడే కనిపించడంలేదు. రైతుబంధు పథకంతో గ్రామాల్లో పట్టాదారులకు, కౌలు రైతులకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతుంది. కౌలును ఖరారు చేసుకునేందుకు రైతులు ప్రయత్నిస్తుంటే, కౌలుదార్లు ముందుకు రావడం లేదు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తున్నందున ఆ మేరకు కౌలు తగ్గించుకోవాలని కౌలు రైతులు పట్టాదారులను కోరుతున్నారు. అందుకు పట్టాదార్లు ససేమిరా అంటున్నారు. పెట్టుబడి సాయానికి, కౌలుకు ముడిపెట్టడం సరికాదని భూ యజమానులు అంటున్నారు. తమకు పెట్టుబడి సాయం రావట్లేదు కాబట్టి కౌలు తగ్గించాల్సిందేనని కౌలుదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కౌలు ఒప్పందాలు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కౌలు ఒప్పందాలు ఖరీఫ్‌లో జరుగుతాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఈ కిరికిరితో అనేక చోట్ల పట్టాదారు రైతులు కౌలుకు ఇవ్వకుండా వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు. 85 శాతం సన్న, చిన్నకారు రైతులే.. రాష్ట్రంలో చాలామంది రైతులు తమకున్న భూమికి తోడు మరికొంత కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలు కూడా కౌలు చేస్తుంటారు. మరోవైపు పెద్ద, మధ్య తరగతి రైతులు వ్యాపారం, ఉద్యోగం తదితర కారణాలతో తమ భూమిని కౌలుకు ఇచ్చి పట్టణాలకు వలస వెళ్తుంటారు. బ్యాంకర్ల కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14లక్షల మంది కౌలు రైతులున్నారు. అంతేకాదు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 40 శాతం మంది వరకు వారే ఉన్నారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 61.96 శాతం మంది సన్నకారు రైతులే. వీరి చేతిలో సరాసరి ఎకరా నుంచి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక చిన్నకారు రైతులు 23.90 శాతం మంది ఉన్నారు. వారి చేతిలో సరాసరి రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూమి ఉంది. అంటే 85.86 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. కౌలు రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. వారికి ప్రైవేటు అప్పులే దిక్కు. ఇంత కష్టపడ్డాక తనకు లాభం వచ్చినా రాకున్నా పంట అనంతరం భూ యజమానికి కౌలు చెల్లిస్తారు. నష్టపోయేది కౌలు రైతులే.. రైతుబంధు పథకం కింద భూ యజమానికి పెట్టుబడి సాయంతోపాటు కౌలు సొమ్ము కూడా అదనంగా అందుతుంది. ఇక్కడ సాగు ఖర్చు అంతా భరించి నష్టపోయేది కౌలు రైతేనన్న చర్చ జరుగుతోంది. ఇంతటి గణనీయ సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు పెట్టుబడి పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాయం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పడంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పట్టాదారులతో కౌలుదారులు పంచాయితీకి దిగుతున్నారు. -
ఇక.. చీటీ ఉంటేనే మందులు!
సాక్షి, తాండూరు : ఇక.. ఇష్టారాజ్యంగా పంటలపై మందుల వినియోగానికి చెక్ పడనుంది. వ్యవసాయాధికారులు అగ్రి వైద్యులుగా మారనున్నారు. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాలు అగ్రి మెడికల్ షాపులుగా మారనున్నాయి. రైతులు పంటలకు అధిక మోతాదు మందులు వినియోగించి నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీంతో పురుగులమందు దుకాణాలు అగ్రి మెడికల్ దుకాణాలుగా మారనున్నాయి. వ్యవసాయాధికారులు చీటీ ఇస్తేనే ఇకపై మందులు ఇచ్చే పద్ధతి అమలులోకి రానుంది. జిల్లాలో 18 మండలాలు, 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 7లక్షల ఎకరాలు సాగుకు అమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1.74లక్షల హెక్టార్లలో కంది, మినుము, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఏటా పురుగుమందులు వినియోగం పెరిగిపోతుంది. ఇప్పటివరకు రైతులు పురుగుమందులను దుకాణదారుల సూచన మేరకు వినియోగించేవారు. ఈక్రమంలో ఒక్కోసారి అధికమొత్తంలో కూడా ఉపయోగిస్తూ తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన సర్కారు కొత్త పద్ధతిని అమలులోకి తీసుకురానుంది. ఇకపై ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే.. పంటల దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో రైతులు పంటలకు రసాయన మందులను అధిక మోతాదుతో వినియోగించి తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు పురుగు ఆశించిందని నేరుగా మందుల దుకాణాదారులను అడిగి వారు ఇచ్చిన మేరకు పిచికారీ చేస్తుండేవారు. ఈనేపథ్యంలో రైతులకు దుకాణాదారులు నకిలీ మందులను సైతం అంటగట్టేవారు. తద్వారా వేల హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. ఈనేపథ్యంలో తీవ్రనష్టాలకు గురై కొన్నిసందర్భాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. దీం తో ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చర్యల కు ఉపక్రమించింది. ఇకపై వ్యవసాయ అధికారులు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయా లు చేయకుండా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాదారులకు ఉత్తర్వులు జారీ చేయనుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి.. జిల్లాలో ఉన్న రసాయనిక పురుగుమందు, ఎరువుల దుకాణాల్లో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి విత్తనం విత్తే నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అవసరమైన మందులను వ్యవసాయాధికారులు సూచనల మేరకు దుకాణాదారులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఈఓల కొరత.. జిల్లాలో 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 99 వ్యవసాయ క్లస్టర్లుగా ఉండాలి. అయితే, ప్రస్తుతం జిల్లాలో 53 క్లస్టర్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒక్కో క్లస్టర్లో 5వేల ఎకరాలకు ఒక ఏఈఓ అందుబాటులో ఉండాలి. కాగా, జిల్లాలో 44 మంది ఏఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయాధికారులకు ఇప్పటికే తలకు మించిన భారం ఉండటంతో పని ఒత్తిడి తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల చీటీ రాసి ఇవ్వడం మంచిదే అయినా, ఈ పద్ధతి నిర్వహణలో ఇబ్బందులు తప్పేలా లేవని క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. చీటీ రాసి ఇస్తేనే మందులు.. రైతులు పండిస్తున్న పంటలకు పిచికారీ చేసేందుకు వ్యవసాధికారులు చీటీ రాసి ఇవ్వాల ని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో ఏఈఓల కొరత ఉంది. ప్రభుత్వం త్వరలో ఏఈఓలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏఈఓలు బీజీగా ఉన్నారు. అయినప్పటికీ ఈ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. –గోపాల్, వ్యవసాయాధికారి,వికారాబాద్ జిల్లా -
రైతులకు ‘వర్రీ’
వరుస తుపాన్లు, తెగుళ్లతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోకపోగా.. మరింత కష్టాల్లోకి నెడుతోంది. సాగర్ ఎడమ కాల్వ కింద మేజర్లకు మంగళవారం నుంచి నీటిని బంద్ చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వరినాట్లు వేసి పుల్క కట్టే సమయంలో నీరు నిలిపి వేయడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఎడమ కాల్వకింద సుమారు 3.5లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. అందులో సుమారు 40వేల నుంచి 50వేల వరకు రెండు మూడు రోజుల క్రితం నాట్లు వేసినవే. సకాలంలో వరిపంటకు పుల్క కట్టకపోతే దిగుబడి తీవ్రంగా తగ్గే ప్రమాదముందని రైతులు భయపడుతున్నారు. మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్లోనే తుపాను, దోమకాటు వల్ల వరి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. కాగా రబీలోనైనా వరి సాగు చేసుకోవచ్చని భావించిన రైతులకు నాట్లు పూర్తి కాకముందే నీటిని నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌కు గాను వరి నాట్లకోసం డిసెంబర్ 20వ తేదీ నుంచి ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా అప్పట్లో ఖరీఫ్ వరి కోతలు సాగుతున్నందున నార్లు సిద్ధంగా లేకపోవడంతో రైతులు వరి నాట్లు వేసుకోలేదు. కాలువ చివరి భూములకు నీరు అందే వరకు ఆలస్యం కావడం వల్ల ఇప్పటికి కూడా నాట్లు పూర్తి కాలేదు. అయినా వారబందీ పద్ధతి ప్రకారం ఈ నెల 4వతేదీన(మంగళవారం) ఎడమ కాలువ పరిధిలోని మేజర్లుకు నీటిని నిలిపివేశారు. దాంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. రబీ సీజన్లో సాగర్ ఎడమ కాలువ పరిధిలో కేవలం 4,31,325 ఎకరాలకే సాగునీటిని అందించడానికి 50 టీఎంసీల నీటిని కేటాయించారు. కాగా ఇప్పటి వరకు 24 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎన్ఎస్పీ అధికారులు ప్రకటించారు. మిగతా 26 టీఎంసీల నీటిని నాలుగు విడతలుగా అందించనున్నారు. 9న తిరిగి నీటి విడుదల వారబందీ పద్ధతిలో ఈ నెల 4న సాగర్ ఎడమ కాలువ పరిధిలోని మేజర్లకు నీటిని నిలిపి వేసిన అధికారులు తిరిగి ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ముందుగా ప్రకటించినట్లుగా నాలుగు విడతలుగా నీటిని విడుదల చేయనున్నారు. వరి నాట్లు పూర్తికాని రైతులతో పాటు ఇటీవల రెండు, మూడు రోజుల క్రితం నాట్లు వేసిన వరి పొలాలు కూడా వరుసగా ఐదు రోజుల పాటు నీళ్లు లేకుంటే ఎండిపోయే పరిస్థితి వచ్చింది. బీళ్లుగా భూములు పదేళ్లుగా దామరచర్ల మండలం ముదిమాణిక్యం, వజీరాబాద్లలోని భూములకు ఎన్ఎస్పీ కాలువల ద్వారా నీరు అందడం లేదు. ఈ గ్రామాల పేర్లు మేజర్లకు పెట్టారు. కానీ నీళ్లు మాత్రం అందడం లేదు. ముదిమాణిక్యం మేజర్ కాలువ పరిధిలో 25 వేల ఎకరాల ఆయకట్టు, వజీరాబాద్ మేజర్ కాలువ పరిధిలో 32 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ ఇప్పటి వరకు కాలువ చివరి భూములకు నీళ్లు చేరకపోవడంతో బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. -
పుర్సత్ లేదు
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ‘గతం గతః ఇక నుంచైనా ప్రతి మూడు నెలలకు ఒక సారి తప్పని సరిగా సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులను సమీక్షించి వాటి ఫలాలు ప్రజల చెంతకు చేరుతున్నాయో లేదో చర్చించుకునేందుకు జిల్లా సమీక్ష సమావేశం నిర్వహిద్దాం...’ఇది ఏడాది మార్చి 2వ తేదీన నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ)లో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చర్చించి తీర్మానించారు. అయితే ఆ తర్వాత సమావేశం నిర్వహించేందుకు వారికి తీరిక లేకుండా పోయింది. ఈ కారణంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చాయని రైతులు సంతోషపడుతున్నా ఎరువులు దొరకడం లేదు. యూరియా కొరత లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా రైతన్నలు మాత్రం ప్రతిరోజూ జిల్లాలో ఎక్కడో ఒకచోట రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక పంట రుణాల విషయానికొస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 2400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.1200 కోట్లు మాత్రమే ఇచ్చారు. రుణం పొందేందుకు కేవలం మూడు రోజులే గడువుంది. ఈ మూడు రోజుల్లో మిగిలిన రూ.1200 కోట్లు రుణాలు ఇవ్వడం అసాధ్యం. ఇలాంటి వాటి పురోగతి గురించి ఎప్పటికప్పుడు జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే ఫలితాలుంటాయి. ప్రజా ప్రతినిధులే పట్టించుకోకపోవడంతో తమకెందులే అనే రీతిలో అధికారులు ఉంటున్నారు. పెండింగ్‌లో రూ. 13 కోట్ల ‘ఉపాధి’ బిల్లులు వలసలు నివారించేందుకు ఉపాధి హామీ పథకంతో పనులు కల్పించినా... పని చేసిన కూలీలకు మూడు నెలలుగా ప్రభుత్వం కూలి డబ్బులు నిలిపివేయడంతో దాదాపు రూ.13 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చాలా కుటుంబాలు పూట గడవక కూలి డబ్బుల కోసం దీనావస్థలో ఎదురుచూస్తున్నా వారి తరుఫున మాట్లాడేందుకు ప్రజాప్రతినిధులకు తీరక దొరకడం లేదు. మరోవైపు జిల్లాలో గతంలో మంజూరైన ఉపాధి పనులు వివిధ కారణాలతో పూర్తికాని దాదాపు రూ.1.5 లక్షల పనులను రద్దు చేసేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఈ పనులను రద్దు చేస్తే అభివృద్ధి పనులు అర్థాంతరంగా ఆగిపోతాయి. గత ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోవడంతో జిల్లాలోని 64 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గత డీఆర్సీ సమావేశంలో ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రి డీకే అరుణ చెప్పినా... ప్రభుత్వం గతంలో ప్రకటించిన కరువు మండలాలు మినహా ఒక్క మండలాన్ని కూడా జాబితాలో చేర్చలేదు. ప్రతి ఏడాది వేసవిలో ఏర్పడుతున్న తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం కోసం రూ. 600 కోట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని గతేడాది ఫిబ్రవరి 11, ఈ ఏడాది మార్చి 2న నిర్వహించిన డీఆర్సీ సమావేశాల్లో చర్చించి వదిలేయడంతో ఆ నిధులు ఇప్పటికీ రాలేదు. ఇన్చార్జిమంత్రిగా నియమితులైనప్పటి నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సంద ర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇప్పటికైనా నాయకులు జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు సమావేశమై చర్చిం చాల్సిన అవసరం ఉంది. -
పంట రుణాలేవీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అంచనాలకు మించి వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. విత్తనాలు, ఎరువుల కోసం రైతాంగం నుంచి తీవ్ర డిమాండు నెలకొంది. మరోవైపు రుణాల కోసం రైతన్నలు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.764.40 కోట్లు పంట రుణం ఇవ్వాల్సి ఉంది. కాని నేటికీ 30 శాతం దాటలేదు. ఖరీఫ్-2013 సీజన్లో 4.25 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే వర్షపాతం సాధారణ స్థాయిని మించడంతో సాగు విస్తీర్ణం ఐదు లక్షల హెక్టార్లకుపైగా నమోదైంది. జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి 2013-14లో రూ.1143 కోట్లు పంట రుణాలుగా అందజేయాల్సి ఉంది. ఇందులో కేవలం ఖరీఫ్‌లోనే రూ.764.40 కోట్లుగా రుణ వితరణ లక్ష్యం విధించారు. ఇటీవలి వర్షాలకు వరినాట్లు చురుగ్గా సాగుతుండటంతో రైతుల నుంచి పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా లీడ్ బ్యాంకు కార్యాలయం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 11,034 మంది రైతులకు రూ.230 కోట్లు పంట రుణంగా మంజూరు చేశారు. వీరిలో 3,169 మంది రైతులకు రూ.11 కోట్ల మేర రుణాలు రీ షెడ్యూలు చేసినట్లు బ్యాంకర్లు చెప్తున్నారు. పంట రుణాల వితరణలో అధికారులు చెప్తున్న లెక్కలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘బుక్ అడ్జస్ట్మెంట్’ పేరిట గతంలో పంట రుణాలు ఇచ్చిన వారి నుంచి సంతకాలు తీసుకుని కొత్తగా రుణాలు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు లెక్కలు చూపుతున్నారు. వాస్తవంలో రైతులకు నయా పైసా చేతికి అందకపోవడంతో విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి కోసం తిరిగి ప్రైవేటు రైతులను ఆశ్రయించాల్సి వస్తోంది. కౌలు రైతులకు మొండిచేయి కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలోనూ బ్యాంకర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కౌలు రైతులు 1,967 మంది వున్నట్లు వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా గుర్తించి రుణ అర్హత కార్డులు మంజూరు చేశాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో కేవలం 42 మందికి మాత్రమే రుణాలు అందజేశారు. దీర్ఘకాలిక, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయడంలోనూ బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు. మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ సంయుక్త సమావేశాల్లో రుణ వితరణ పురోగతిపై సమీక్ష జరుపుతున్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య వెల్లడించారు. -
జిల్లాలో పంటల సాగు ఆశాజనకం
పరిగి, న్యూస్‌లైన్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో పంటల సాగు ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పరిగిలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 2లక్షల 965 హెక్టార్లు కాగా ప్రస్తుతం 2.70లక్షలలో ఆయా పంటలు సాగయ్యాయని తెలిపారు. వీటిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం నమోదు కాగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. పత్తి, జొన్న పంటలు సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే తగ్గాయన్నారు. ఎరువులు ముఖ్యంగా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో డీఏపీ 44500 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 51 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. యూరియా 59వేల మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటివరకు 35 వేల మెట్రిక్ టన్నులు అందజేశామని, మిగతాది సెప్టెంబర్ వరకు పంపిణీ చేస్తామన్నారు. 50 శాతం ఎరువులు డీసీఎమ్మెస్ గోదాముల ద్వారా మిగతాది ప్రైవేటు డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని ఆయన వివరించారు. రైతులు అపోహలు వీడాలి.. ఎరువులు వాడటంలో రైతులు అపోహలు వీడాలని జేడీఏ కోరారు. సన్న యూరియా, దొడ్డు యూరియాలోనూ 46 శాతం నత్రజనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రైతులు అపోహలతో దొడ్డు యూరియాతో పాటు నీమ్ కోటింగ్ యూరియా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని, సమావేశాలు ఏర్పాటు చేయించి వారి అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో రూ.438 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 64 శాతం రుణాలు రైతులకు ఆయా బ్యాంకుల ద్వారా అందించామన్నారు. అలాగే ఇటీవల ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నగేష్‌కుమార్, ఏఓలు రేణుకా చక్రవర్తి, సుధారాణి, పాండు, ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.