సాగుకు ధరాఘాతం!
నవాబ్‌పేట్ , న్యూస్‌లైన్: రైతే దేశానికి వెన్నెముక అంటూ ఎన్నికల సమయంలో వేదికలపై నేతలు ఉపన్యాసాలు దంచేస్తుంటారు. అన్ని రంగాలకంటే వ్యవసాయానికి పెద్దపీట వేస్తామంటూ రైతన్నలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు. అధికారంలోకి రాగానే పాలకులు అన్నదాతలను విస్మరిస్తున్నారు. వారి వెతలను పట్టించుకోవడంలేదు. వ్యవసాయ పెట్టుబడి ఏటికేడు రెట్టింపు అవుతుండడంతో రైతు కుదేలవుతున్నాడు. ఎరువులు, విత్తనాల ధరలను అదుపులో ఉంచాలనే స్పహ ప్రభుత్వాలకు రావ డం లేదు. ఇష్టానుసారం ధరలు పెంచుతూ పోతు న్న ప్రైవేటు ఎరువుల సంస్థలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నించడం లేదు.
దీంతో ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు దుకాణాల ఎదుట రాత్రీ పగలూ అనే తేడా లేకుండా క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏటా ఇదే తంతు జరుగుతున్నా పాలకులు మాత్రం సకాలంలో ఎరువులను సరఫరా చేయడంలో చిత్తశుద్ధి కనబర్చని దుస్థితి దాపురించింది. గిట్టుబాటు ధరలు లేక, ప్రక తి వైపరీత్యాలతో పం టలు నష్టపోయి అప్పుల బాధతో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం సానుభూతి చూపని వారూ ఉన్నారు. పంటలకు నష్టపరిహారం, వృుతుల కుటుంబాలకు నయాపైస ఇప్పించరు. ఇదీ అన్నదాతపై పాలకులు చూపిస్తున్న అవ్యాజప్రేమ.
ఎరువులు, విత్తనాల ధరలు పైపైకి...
ఎరువులు, విత్తనాల ధరలు అదుపు చేయడంలో పాలకులు నిర్లక్షం వహించడంతో రైతన్నలపై ఆర్థిక భారం పెరిగింది. ఓవైపు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్న రైతులకు పంటల ఉత్పత్తికి ప్రాణదాత లైన ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడం అదనపు భారంగా భరిస్తున్నారు. నాలుగేళు ్లగా నిత్యం పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు కంటతడిపెట్టిస్తున్నాయి. ఎరువులపై ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ తగ్గింపులో భాగంగా ఎరువుల కంపెనీలపై నియంత్రణ ఎత్తివేసింది. పరిస్థితులను బట్టి ధరలను పెంచుకునే వెసులుబాటును కంపెనీలకు కల్పించింది. దీంతో కంపెనీలు అడ్డు, అదుపు లేకుండా వ్యవహరిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను సాకుగా చూపుతూ ప్రతిసారి భారీగా ఎరువుల ధరలను పెంచుతూ పోతున్నాయి. ఇక విత్తన కంపెనీలదీ ఇదే బాట.