killed brother
-
అపరకాళిగా మారి హతమార్చింది
సాక్షి ప్రతినిధి, చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి లైంగిక వేధింపులకు ఆమె తట్టుకోలేకపోయింది. అపరకాళిగా మారి అంతమొందించింది. తేనీ జిల్లా ఉత్తమపాళయంకు చెందిన అరటి ఆకుల వ్యాపారి మణికంఠన్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్ బావమరిది పాండీశ్వరన్ (30) భార్య నిరంజన (25)లకు ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్, పాండీశ్వరన్ కొన్నేళ్ల క్రితం టీ బంకు నడిపారు. ఈ సమయంలో నిరంజనపై కన్నేసిన మణికంఠన్ తరచూ సెల్ఫోన్లో ఇబ్బందికరమైన సంభాషణ చేసేవాడు. అనేకసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో భర్తకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కారణంగా టీ బంకును ఎత్తివేసి ఇరువురూ వేర్వేరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయినా బుద్ధి మార్చుకోని మణికంఠన్ నిరంజనకు సెల్‌ఫోన్ ద్వారా అసభ్య సంభాషణలు కొనసాగించాడు. దీంతో విసిగిపోయిన నిరంజన శనివారం ఉదయం భర్తతో కలిసి మణికంఠన్ దుకాణానికి వెళ్లి నిలదీసింది. ఈ సమయంలో ఘర్షణ వాతావారణం చోటుచేసుకోగా నిరంజన తన వెంట తెచ్చుకున్న కొడవలితో మణికంఠన్‌ను హతమార్చింది. రక్తం మడుగులో ఉన్న మణికంఠన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. భార్యాభర్తలిద్దరూ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా వారిని అరెస్ట్ చేశారు. -
ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే
సాక్షి, నవాబుపేట: ప్రియురాలి అన్న తమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువకుడు అతడిని దారుణంగా హత్య చేశాడు. మండల పరిధిలో చిట్టిగిద్ద గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నవాబుపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష నిందితుల వివరాలు వెల్లడించారు. నవాబుపేట మండల పరిధిలోని చిట్టిగిద్ద గ్రామానికి చెందిన షేక్ సోహెల్(20) ఈ నెల 14న గ్రామ శివారులో హత్యకు గురయ్యాడు. ఈ మేరకు మృతుడి తల్లి ఫరీదాబేగం ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కృష్ణ మరికొంత మంది సిబ్బందితో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు రంభించారు. గ్రామస్తుల సమాచారం మేరకు మృతుడి పెద్దమ్మ కొడుకు ఎల్లకొండ గ్రామానికి చెందిన తొంట అమీర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా సోహేల్‌ను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడు. హత్య జరిగిందిలా.. సోహెల్ చిన్న చెల్లెలు, అమీర్ గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి విషయమై సోహెల్ ను అడగ్గా నిరాకరించాడు. దాంతో సోమేల్ బతికుండగా మా పెళ్లి కాదు, అతన్ని అంతం చేయాలని అమీర్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలి యని సోహేల్ తనకు ఆరోగ్యం బాగాలేదు మహారాష్ట్రలోని దర్గాకు వెళ్లాలి. కొంత డబ్బు ఇవ్వమని అమీర్‌ను అడిగగా.. అందుకు అమీర్ ఒప్పుకున్నాడు. ఈ నెల 13న సాయంత్రం అమీర్ మృతుడికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తా అని చెప్పడంతో సోహెల్ ఎల్లకొండకు వెళ్లాడు. తిరిగి వీరు నవాబుపేటకు వచ్చి వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి చిట్టిగిద్ద గ్రామ శివారులోని లింగంపల్లి గుట్ట వద్దకు వెళ్లారు. అతిగా మద్యం సేవించిన సోహెల్ తాను కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. ఇదే అదునుగా భావించిన అమీర్ అక్క డే ఉన్న డ్రిప్‌పైపుతో సోహెల్ గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతుడి పోన్ తీసుకొని అక్కడి నుంచి ఏమీతెలియనట్లు ఇంటికి వెళ్లాడు. గ్రామస్తుల సమాచారంతో విచారణ చేపట్టగా అ మీర్ నేరాన్ని అంగీకరించాడని, హత్యకు ఉపయోగించిన డ్రిప్‌పైపు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శిరీష తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కృష్ణ ఉన్నారు. -
సిగరెట్ ఇవ్వలేదని అన్నని చంపేశాడు
న్యూఢిల్లీ: అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదంలో అన్న దారుణహత్యకు గురికావడం ఢిల్లీలో కలకలం రేపింది. కంటికి రెప్పలా పెంచుకుంటున్న బిడ్డల్లో ఒకరు శాశ్వతంగా దూరంకావడం, మరొకరు నేరస్తుడిగా మిగలడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సిగరెట్ ఇవ్వలేదన్న కోపంతో క్షణికావేశంలో అన్నపై దాడి చేశాడో బాలుడు. తప్పు తెలుసుకొనేలోపే ఘోరం జరిగిపోయింది. సిగరెట్ తాగుతున్న అన్న(18) ను చూసిన తమ్ముడు (16).. తనకూ ఒకటి ఇమ్మని అడిగాడు. దీనికి అన్న నిరాకరించాడు. ఆగ్రహానికి గురైన తమ్ముడు ఈ విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో పక్కనే ఉన్న ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని అన్నపై దాడిచేసి తలపై తీవ్రంగా కొట్టాడు. రక్తమోడుతున్న అతడిని అలాగే వదిలేసి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న పెద్దకొడుకు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అయితే కుమారుడు పడి ఉన్న తీరు చూసి, దొంగతనం జరిగిందనే అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. అయితే చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి సారీ చెబుదామని చిన్నకొడుకు ఇంటికి చేరాడు. అప్పటికే అన్న తిరిగిరాని లోకాలకు తరలిపోయాడని తెలిసి బావురుమన్నాడు. జరిగిన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని జువెనైల్ హోంకు తరలించారు.