కిరణ్ స్నేహితుడికి ఎమ్మెల్సీ పోస్ట్‌కు గవర్నర్ చెక్
హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హడావిడిగా ఇచ్చిన జీవోలపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. కిరణ్ సన్నిహితుడికి ఎమ్మెల్సీ పోస్ట్ కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలకు గవర్నర్ నరసింహన్ చెక్ పెట్టారు. గవర్నర్ కోటాలో రఘురామిరెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు కిరణ్ ప్రయత్నించారు. రెండోసారి కూడా రఘురామిరెడ్డి పేరునే కిరణ్ సూచించారు. అయితే రఘురామిరెడ్డి ఫైల్‌ను గవర్నర్ తిరస్కరించారు.
అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా గవర్నర్ రద్దు చేశారు. కిరణ్‌కు ఓఎస్డీగా ఉన్న సురేందర్‌కు అర్హత లేకున్నా సహకార శాఖ సహాయ రిజిస్టార్‌గా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నరసింహన్ రద్దు చేశారు. అంతేకాకుండా సురేందర్‌ను మాతృసంస్థ ఏపీఐఐసీ ఈడీగా పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.