కిరండోల్ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్
అనంతగిరి: విశాఖ నుంచి కిరండోల్ వెళుతున్న ఓ గూడ్స్ రైలు బొర్రా -గరకవలస స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఈ రైలు విశాఖ నుంచి బొగ్గుతో వెళుతోంది. రెండు బోగీలు పట్టాలు తప్పడంతో సుమారు 200 మీటర్ల మేర ట్రాక్ దెబ్బతిన్నది.
దీంతో బుధవారం ఈ మార్గంలో విశాఖ- కిరండోల్ ప్యాసింజర్ రైలు సర్వీసు నడవడంపై సందేహాలు నెలకొన్నాయి. రైల్వే సిబ్బంది బుధవారం ఉదయం లోపు ట్రాక్ మరమ్మతు చర్యలు చేపడితే తప్ప ఈ మార్గంలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తిరిగే అవకాశం లేదు.