kishenji
-
‘లాల్’ గడగడలాడించాడు..
► కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు నేటితో ఐదేళ్లు ► అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్న మిత్రులు పెద్దపల్లి : నూతన ప్రజాస్వామిక విప్లవ బాటలో భూమి కోసం, భుక్తి కోసం, దేశవిముక్తి కోసం సాయుధ పోరాట పంథాలో నేలకొరిగిన కిషన్‌జీ ఉరఫ్ మల్లోజుల కోటేశ్వర్రావు ఎన్‌కౌం టర్కు నవంబర్ 24తో నాలుగేళ్లు పూర్తయ్యా రుు. పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌ఘడ్‌ను గడగడలాడించిన కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు అప్పుడే నాలుగేళ్లు నిండి ఐదో యేట అడుగు పెడుతున్న సం దర్భంగా ఆయన చిన్ననాటి మిత్రులు గుర్తు చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కిషన్‌జీ మావోరుుస్టు పార్టీ నిర్మాణకర్తలో ఒకరు. కొండపల్లి సీతారామయ్య ఆరంభించిన పీపుల్స్‌వార్ పార్టీకి పది మంది ముఖ్యుల్లో కిషన్‌జీ మొదటివారు. జై తెలంగాణ కోసం విద్యార్థి దశలో జైకొట్టిన కిషన్‌జీ క్రమంగా విప్లవ రచరుుతల సంఘం వారి అభ్యుదయ రచనలతో మమేకమై కొండపల్లి సీతారామయ్య వర్గంలో కలిసి పని చేసిన ఆయన మావోరుుస్టు పార్టీకి అగ్రనేతగా ఎదిగారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోరుుస్టు పార్టీని విసృ్తతపరచడంలో కీలకపాత్ర పోషించిన కిషన్‌జీ కోసం అప్పట్లో దేశ వ్యాప్తంగా పోలీసు బలగాలు గాలించారుు. చార్‌మజుందార్ కోట పశ్చిమబెంగాల్లోని ఈస్ట్ మిద్నాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్‌జీ అమరుడయ్యారు. జంగల్‌మహల్ ఉద్యమంతో ఆదివాసీలను ఏకం చేసి భూమిపై హక్కులు కల్పించడంలో ప్రముఖపాత్ర వహించిన కిషన్‌జీ దేశంలోని పాలకవర్గాలను హడలెత్తించారు. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌గా గుర్తించిన కిషన్‌జీని ఎన్కౌంటర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికే వీరప్పన్ ఎన్‌కౌంటర్‌ను ముగించిన ఐపీఎస్ విజయ్‌కుమార్‌కు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బాధ్యతలు అప్పగించి పశ్చిమ బెంగాల్‌కు పంపించారు. ఏడాదిలో కిషన్‌జీని ఎన్కౌంటర్లో హతమార్చారు. 2012 నవంబర్ 22న కిషన్‌జీని పట్టుకొని చిత్రహింసలు పెట్టి 24 తెల్లవారుజామున అడవుల్లో చంపినట్లు హక్కుల సంఘాలు ఆరోపించారుు. కిషన్‌జీ ఎన్కౌంటర్ తర్వాత మావోరుుస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీలోని కేంద్ర కమిటీలో ముఖ్య నాయకుడిని కోల్పోరుున స్థానంలో మరో నాయకుడిని ఊహించలేక పోతున్నారు. అరుుతే కిషన్‌జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి పార్టీలో రెండో స్థానంలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి కంటే కిషన్‌జీ సీనియర్‌గా చెప్పుకోవచ్చు. అరుుతే కిషన్‌జీ సంస్మరణ సభలు ఆ పార్టీ బలంగా ఉన్న దండకారణ్యంలో మాత్రమే కొనసాగుతున్నారుు. మైదాన ప్రాంతంలో మొదటి సంస్మరణ సభ హక్కుల సంఘాలు హైదరాబాద్‌లో నిర్వహించారుు. -
దద్దరిల్లుతోంది... దండకారణ్యం
‘‘అభివృద్ధి పేరుతో ఆదివాసీలకు రాజ్యాంగం క ల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసి, అక్కడి సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోంది. అందమైన ప్రకృతికి నిలయమైన దండకారణ్యాలు దద్దరిల్లుతున్నాయి. భవిష్యత్తులోనైనా ఈ పరిస్థితి మారాలన్న కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. స్వీయదర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ‘దండకారణ్యం’ చిత్రం ఈ మార్చి 4న విడుదల కానుంది. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ- ‘‘మావోయిస్టు నాయకుడు కిషన్‌జీ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాను. అడవి తల్లి కోసం పోరాడుతున్న వారు, ప్రభుత్వం తరపున ఉద్యోగాలు చేస్తున్న పోలీసులు యుద్ధం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఇద్దరూ తమ కన్నతల్లులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇకనైనా కాల్పుల విరమణ పాటించి, అడవిని ప్రశాంతంగా ఉంచాలనే అంశాన్ని మా చిత్రం ద్వారా చెబుతున్నాం. ఈ నెల 20న పాటలను విడుదల చేయనున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఎడిటింగ్-సంగీతం: ఆర్.నారాయణమూర్తి. -
కిషన్‌జీని చంపింది మమత సర్కారే
తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు బెల్పహారి/కోల్‌కతా: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావును మమతా బెనర్జీ ప్రభుత్వమే చంపిందంటూ ఆమె మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011, నవంబర్ 24న పశ్చిమ మిడ్నాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్‌జీ చనిపోయారంటూ గతంలో భద్రతా దళాలు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెబుతుండగా, తాజాగా అభిషేక్ అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంతో మమత సర్కారు ఇరకాటంలో పడింది. దీనిపై మమత వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ‘ఇంతకుముందు పత్రికలు తిరగేసినప్పుడు జంగల్‌మహల్‌లోని మరణాలపై నిత్యం కథనాలు కనిపించేవి. అయితే గత నాలుగేళ్ల కాలంలో ఒకే ఒక వ్యక్తి మరణించారు. ఆయన ఎవరో కాదు మావోయిస్టు నేత కిషన్‌జీనే. మమత ఆయనను చంపేసి రానున్న కాలంలో ప్రజలు చెప్పిందే అంతిమ తీర్పు అని రుజువుచేశారు’ అని అభిషేక్ శుక్రవారం రాత్రి బెల్పహారిలో జరిగిన సభలో చెప్పారు. ‘ప్రభుత్వం ఆయుధాలను వాడేది ప్రజల మంచి కోసమే. ఉగ్రవాదం కోసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో విపక్షాలు మమత సర్కారుపై అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. మమత అక్రమానికి పెట్టింది పేరని దీన్ని బట్టి స్పష్టమవుతోందని బీజేపీ నేత సిద్ధార్థ్నాథ్ సింగ్ మండిపడ్డారు. అభిషేక్ మాటలకు మమత కట్టుబడి ఉంటారా అని ఆయన నిలదీశారు. మమత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మావోయిస్టు నేత ఆజాద్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని, అయితే అధికారంలోకి వచ్చాక కిషన్‌జీని చంపేందుకు రాష్ట్ర బలగాలను వాడుకున్నారని దుయ్యబట్టారు. -
తెలం‘గానం’ కోసమే తొలి లాఠీ దెబ్బ
కొడుకు జ్ఞాపకాల్లో బతుకుతున్న తల్లి నేడు మావోయిస్టు నేత కిషన్‌జీ రెండో వర్ధంతి పెద్దపల్లి, న్యూస్‌లైన్: సమసమాజ స్థాపన కోసం మూడున్నర దశాబ్దాలు పాలకుల గుండెల్లో నిద్రించిన విప్లవయోధుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీ. సాయుధ పోరాటంలో శిఖరమంత ఎత్తు ఎదిగి.. పోలీసుల తూటాలకు కుప్పకూలిన కోటేశ్వర్ రావు విప్లవ బాట పట్టేందుకు తెలంగాణ భావజాలమే బీజాలు నాటింది. విద్యార్థి దశలోనే కోటేశ్వర్రావు తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. నాటి పీపుల్స్ వార్ నుంచి..నేటి మావోయిస్టు పార్టీకి మూల స్తంభంగా ఎదిగిన కోటేశ్వర్రావు పాతికేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ప్రహ్లాద్, కిషన్‌జీ పేర్లతో పలు రాష్ట్రాల్లో విప్లవ ఉద్యమాన్ని నడిపించారు. కుటుంబమే ధిక్కార స్వరం... కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర్రావు కుటుంబ సభ్యులందరిది ధిక్కార స్వరమే. ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. రజాకార్లను ఎదురొడ్డిన ధీరుడు. తండ్రి అడుగుజాడల్లో నడచిన కోటేశ్వర్రావు, ఆయన తమ్ముడు వేణుగోపాల్‌రావు ఆనాడే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా గళమెత్తారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నియమనిష్టలతో జీవనం సాగించాల్సిన అన్నదమ్ములు దళిత, బహుజన బానిస బతుకుల విముక్తి కోసం తుపాకీ పట్టారు. తల్లి మధురమ్మ కూడా భర్తతో పాటు రజాకార్లను ఎదురించింది. రజాకార్లతో జరిగిన సమరంలో వెంకటయ్య అజ్ఞాతవాసం వెళ్లి, జైలు పాలయ్యారు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత విడుదలయ్యారు. అప్పటినుంచి వెంకటయ్య కుటుంబం పదిహేనేళ్లపాటు ప్రశాంతంగా ఉంది. 1969లో జై తెలంగాణ సభ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో వెంకటయ్యతో పాటు ఆయన కొడుకులు కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌లు ఉద్యమగొంతుకలై సర్కారును నిలదీశారు. 1969లో టీపీఎస్(తెలంగాణ ప్రజా సమితి) నాయకత్వాన పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో జై తెలంగాణ సభపై పోలీసులు దాడి చేసి, లాఠీచార్జి చేశారు. నాడు మల్లోజు కోటేశ్వర్‌రావుతో పాటు మరికొందరు యువకులు జైలు పాలయ్యారు. మిగిలినవారు విడుదల కాగా, కోటేశ్వర్రావు జైల్లోనే ఎక్కువ కాలం గడిపి విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో రమేజాబీ, జిజియాబాయి అనే మిహళలు పోలీసుల లైంగికదాడికి గురయ్యారు. ఈ సంఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బస్సును దగ్ధం చేశాయి. ఈ కేసులో కోటేశ్వర్రావు మరోసారి అరెస్టయి వరంగల్ జైలుకు వెళ్లారు. తెలుగు మహాసభ, విరసం వంటి సంస్థలతో కొనసాగిన అనుబంధంతో కోటేశ్వర్రావు విప్లవోద్యమానికి మరింత దగ్గరయ్యారు. అప్పటి నుంచి విప్లవోద్యమంలో అనేక బాధ్యతలు నిర్వహించారు. సమ సమాజ స్థాపన కోసం ఎక్కుపెట్టిన ఆయుధంతో పాల కుల గుండెల్లో నిద్రించిన కిషన్‌జీని పట్టుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు 36 ఏళ్లు పట్టింది. 2011 డిసెంబర్ 24న బెంగాల్ రాష్ట్రంలోని మిద్నాపూర్‌లోని కలోని అడవుల్లో కేంద్ర బలగాల చేతిలో హతమయ్యారు. హైదరాబాద్‌లో నేడు వర్ధంతి సభ.. ఈనెల 24తో కిషన్‌జీ ఎన్కౌంటర్లో అమరుడై రెండేళ్లు నిండుతున్నాయి. ఆయన రెండో వర్ధంతి సభను హైదరాబాద్‌లో పౌర హక్కుల సంఘాలు, విరసం సంయుక్తంగా నిర్వహిస్తుం డగా తిథి, వార నక్షత్రం ప్రకారం డిసెంబర్ 2న ఆయన కుటుం బ సభ్యులు రెండో వర్ధంతి జరుపుతున్నారు. రాష్ట్రం చూడకముందే పొట్టన పెట్టుకున్నరు.. కొడుకును చెంప మీద ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచుకున్న.. జై తెలంగాణ అంటూ టీపీఎస్ మీటింగ్‌కు వెళ్లి పోలీసుల నుంచి దెబ్బలు తిని జైలుకు వెళ్లారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడంతో నా కొడుకు పడ్డ శ్రమకు, వాడు తిన్న లాఠీ దెబ్బలు వృథా పోలేదు. కాని తెలంగాణ రాష్ట్రం చూడకముందే కొడుకు కోటన్నను సర్కారు పొట్టనబెట్టుకుంది. మాయన వెంకటయ్య తెలంగాణ రజాకార్ల పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని చూశారు. స్వాతంత్య్ర సమరయోధులుగా నలుగురిలో సంతోషంగా గడిపారు. కాని కొడుకు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పూటయినా గడపకపోవడం విషాదం. ఆదివారంతో కొడుకు మరణించి రెండేళ్లు అవుతుంది. కొడుకు చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా మదినిండా కదులుతున్నాయి. అన్న వెనుకే నా చిన్న కొడుకు వేణు కూడా అడవిలోకి పోయింది. అడవిలో ఉన్న చిన్న కొడుకు వేణును ఒక్కసారి చూడాలని ఉంది. - మల్లోజుల కోటేశ్వర్రావు తల్లి మధురమ్మ