‘లాల్’ గడగడలాడించాడు..
► కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు నేటితో ఐదేళ్లు
► అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్న మిత్రులు
పెద్దపల్లి : నూతన ప్రజాస్వామిక విప్లవ బాటలో భూమి కోసం, భుక్తి కోసం, దేశవిముక్తి కోసం సాయుధ పోరాట పంథాలో నేలకొరిగిన కిషన్‌జీ ఉరఫ్ మల్లోజుల కోటేశ్వర్‌రావు ఎన్‌కౌం టర్‌కు నవంబర్ 24తో నాలుగేళ్లు పూర్తయ్యా రుు. పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌ఘడ్‌ను గడగడలాడించిన కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు అప్పుడే నాలుగేళ్లు నిండి ఐదో యేట అడుగు పెడుతున్న సం దర్భంగా ఆయన చిన్ననాటి మిత్రులు గుర్తు చేసుకుంటున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కిషన్‌జీ మావోరుుస్టు పార్టీ నిర్మాణకర్తలో ఒకరు. కొండపల్లి సీతారామయ్య ఆరంభించిన పీపుల్స్‌వార్ పార్టీకి పది మంది ముఖ్యుల్లో కిషన్‌జీ మొదటివారు. జై తెలంగాణ కోసం విద్యార్థి దశలో జైకొట్టిన కిషన్‌జీ క్రమంగా విప్లవ రచరుుతల సంఘం వారి అభ్యుదయ రచనలతో మమేకమై కొండపల్లి సీతారామయ్య వర్గంలో కలిసి పని చేసిన ఆయన మావోరుుస్టు పార్టీకి అగ్రనేతగా ఎదిగారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోరుుస్టు పార్టీని విసృ్తతపరచడంలో కీలకపాత్ర పోషించిన కిషన్‌జీ కోసం అప్పట్లో దేశ వ్యాప్తంగా పోలీసు బలగాలు గాలించారుు. చార్‌మజుందార్ కోట పశ్చిమబెంగాల్‌లోని ఈస్ట్ మిద్నాపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ అమరుడయ్యారు. జంగల్‌మహల్ ఉద్యమంతో ఆదివాసీలను ఏకం చేసి భూమిపై హక్కులు కల్పించడంలో ప్రముఖపాత్ర వహించిన కిషన్‌జీ దేశంలోని పాలకవర్గాలను హడలెత్తించారు. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌గా గుర్తించిన కిషన్‌జీని ఎన్‌కౌంటర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికే వీరప్పన్ ఎన్‌కౌంటర్‌ను ముగించిన ఐపీఎస్ విజయ్‌కుమార్‌కు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బాధ్యతలు అప్పగించి పశ్చిమ బెంగాల్‌కు పంపించారు. ఏడాదిలో కిషన్‌జీని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. 2012 నవంబర్ 22న కిషన్‌జీని పట్టుకొని చిత్రహింసలు పెట్టి 24 తెల్లవారుజామున అడవుల్లో చంపినట్లు హక్కుల సంఘాలు ఆరోపించారుు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ తర్వాత మావోరుుస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఆ పార్టీలోని కేంద్ర కమిటీలో ముఖ్య నాయకుడిని కోల్పోరుున స్థానంలో మరో నాయకుడిని ఊహించలేక పోతున్నారు. అరుుతే కిషన్‌జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి పార్టీలో రెండో స్థానంలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి కంటే కిషన్‌జీ సీనియర్‌గా చెప్పుకోవచ్చు. అరుుతే కిషన్‌జీ సంస్మరణ సభలు ఆ పార్టీ బలంగా ఉన్న దండకారణ్యంలో మాత్రమే కొనసాగుతున్నారుు. మైదాన ప్రాంతంలో మొదటి సంస్మరణ సభ హక్కుల సంఘాలు హైదరాబాద్‌లో నిర్వహించారుు.