KLU
-
గుడ్‌న్యూస్.. వరద బాధితులకు ఉచితంగా ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. ఇలాంటి వారికి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు/ డూప్లికేట్ సర్టిఫికెట్లు అందించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించినట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృతికా శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐవోలు, డీఐఈవోలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.పదో తరగతి హిందీ సిలబస్ కుదింపుసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లను ప్రభుత్వం స్టేట్ సిలబస్‌లోకి మార్చిన నేపథ్యంలో ఆయా స్కూళల్లో సిలబస్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హిందీ సిలబస్ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని చాప్టర్లను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్కూళ్ల విద్యార్థులకు జూన్– జూలై సిలబస్‌తో ఎఫ్ఏ–1 హిందీ నమూనా పరీక్షను మంగళవారం పూర్తి చేశామని తెలిపారు. అలాగే, కొత్త విధివిధానాల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు హిందీ సిలబస్ అధికంగా ఉన్నందున పద్యభాగ్–7 (ఆత్మత్రాణ్), గద్యభాగ్–11 (తీసరీ కసమ్ కే వశల్ పకార్ శేలేంద్ర), గద్యభాగ్–12 (అబ్ కహా దూస్రోంకే దుఖ్ సే దుఖీ హోనీవాలీ), ఉపవాచక్–3 (టోపీ శుక్లా) పాఠాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదలతాడేపల్లిరూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యావిధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సులకు మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
కేఎల్‌యూలో ‘ఖైదీ నెం 150’ యూనిట్
వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): స్థానిక వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో 'ఖైదీ నంబర్ 150' చిత్ర యూనిట్ సభ్యులు గురువారం పర్యటించారు. చిరంజీవి నటించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై నిర్మాత అల్లు అరవింద్ అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి 150వ చిత్రం ఆడియో ఫంక్షన్ నిర్వహణకు కృష్ణా జిల్లా ఫెర్రి, తాత్కాలిక సచివాలయం వద్ద, మంగళగిరి హాయ్‌ల్యాండ్‌ను పరిశీలించామని తెలిపారు. సినీ వర్గాలు మాత్రం దాదాపుగా యూనివర్సిటీనే ఖాయం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
మద్యం మత్తులో రెచ్చిపోయిన నైజీరియన్స్
-
మద్యం మత్తులో రెచ్చిపోయిన నైజీరియా విద్యార్థులు
యువకుడిపై కత్తితో దాడి.. వడ్డేశ్వరంలో ఉద్రిక్త పరిస్థితి తాడేపల్లి రూరల్: నైజీరియాకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం మద్యం మత్తులో రెచ్చిపోయి స్థానిక యువకుడిపై దాడికి పాల్పడ్డారు.కేఎల్‌యూలో బీటెక్ సెకండియర్ చదువుతున్న నైజీరియాకు చెందిన అడిల్, మహ్మద్, క్రిస్టాఫర్, అహ్మద్, బీసీఏ సెకండియర్ చదువుతున్న వలిద్లు మద్యం సేవించేందుకు వడ్డేశ్వరంలోని ఓ వైన్‌షాపునకు వెళ్లారు. స్థానికులైన బురదగుంట సునీల్, మరో యువకుడు కూడా వైన్‌షాపునకు వెళ్లారు. ఈక్రమంలో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసిన నైజీరియా విద్యార్థులు తమను చూసే నవ్వుతున్నారని భావించి, వారిపై తిరగబడ్డారు. మద్యం బాటిళ్లు పగలగొట్టి సునీల్‌పై కత్తితో దాడి చేశారు.అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు నైజీరియా విద్యార్థులను చితకబాదారు. వారిలో అహ్మద్ అనే విద్యార్థి గాయపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునీల్‌తో పాటు అహ్మద్‌ను వైద్యశాలకు తరలించారు. చివరికి పారిపోయిన నలుగురు విద్యార్థులను అదుపులోనికి తీసుకొని వారికి కేఎల్ వర్సిటీ హాస్టళ్లకు తరలించారు. -
కేఎల్‌యూలో కొనసాగుతున్న కౌన్సెలింగ్
తాడేపల్లి రూరల్ : కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ శుక్రవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం జరిగిన కౌన్సెలింగ్‌లో కేఎల్‌యూ ఈఈఈ -2015 లో 3001 నుంచి 5000 ర్యాంకుల వరకు, మధ్యాహ్నం 5001 నుంచి 7000 ర్యాంకుల విద్యార్థులు యూనివర్సిటీలో ప్రవేశాలు పొందారని తెలిపారు. 100 శాతం ప్లేస్‌మెంట్‌కు చిరునామా కేఎల్‌యూ అని తల్లిదండ్రులు, విద్యార్థులు బలీయంగా నమ్మడమే ఈ అనూహ్య స్పందనకు కారణమని వర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజాహరీన్ అన్నారు. శనివారం జరిగే కౌన్సెలింగ్‌లో కేఎల్‌యూ ఈఈఈలో 7001 నుంచి 9000 ర్యాంకులు పొందిన వారికి, తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌లో 40000 ర్యాంకులు పొందిన విద్యార్థులకు, అనంతరం 9001 నుండి 12000 ర్యాంకులు పొందిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చని సూచించారు.