తాడేపల్లి రూరల్ : కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ శుక్రవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం జరిగిన కౌన్సెలింగ్‌లో కేఎల్‌యూ ఈఈఈ -2015 లో 3001 నుంచి 5000 ర్యాంకుల వరకు, మధ్యాహ్నం 5001 నుంచి 7000 ర్యాంకుల విద్యార్థులు యూనివర్సిటీలో ప్రవేశాలు పొందారని తెలిపారు. 100 శాతం ప్లేస్‌మెంట్‌కు చిరునామా కేఎల్‌యూ అని తల్లిదండ్రులు, విద్యార్థులు బలీయంగా నమ్మడమే ఈ అనూహ్య స్పందనకు కారణమని వర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజాహరీన్ అన్నారు.
శనివారం జరిగే కౌన్సెలింగ్‌లో కేఎల్‌యూ ఈఈఈలో 7001 నుంచి 9000 ర్యాంకులు పొందిన వారికి, తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌లో 40000 ర్యాంకులు పొందిన విద్యార్థులకు, అనంతరం 9001 నుండి 12000 ర్యాంకులు పొందిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు.
కేఎల్‌యూలో కొనసాగుతున్న కౌన్సెలింగ్
Published Sat, May 30 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement