KNR construction company
-
మార్కెట్లు పతనం- ఈ షేర్లు జూమ్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 378 పాయింట్లు క్షీణించి 45,875కు చేరింది. నిఫ్టీ సైతం 102 పాయంట్లు కోల్పోయి 13,456 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మజెస్కో లిమిటెడ్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మౌలిక రంగ హైదరాబాద్ కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ప్రతిపాదించింది. నేడు సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. దీంతో కేఎన్ఆర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 7.4 శాతం దూసుకెళ్లి రూ. 318ను తాకింది. ప్రస్తుతం 6.3 శాతం ఎగసి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ షేరు 23 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! మజెస్కో లిమిటెడ్ వాటాదారులకు షేరుకి రూ. 974 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు బోర్డు అనుమతించినట్లు బీమా రంగ ఐటీ సేవల కంపెనీ మజెస్కో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. వెరసి రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుపైనా 19,480 శాతం డివిడెండ్‌ను చెల్లించనుంది. ఇందుకు రూ. 2,788 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మజెస్కో షేరు తొలుత 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,010కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 992 వద్ద ట్రేడవుతోంది. -
బటర్‌ఫ్లై గంధిమతి- కేఎన్ఆర్.. రయ్రయ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఫలితాలు నిరాశపరచినప్పటికీ ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్ తయారీ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) కాలంలో పటిష్ట పనితీరు చూపిన మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బటర్‌ఫ్లై గంధిమతి అప్లయెన్సెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో బటర్‌ఫ్లై గంధిమతి రూ. 8.6 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 2.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు సైతం 50 శాతం క్షీణించి రూ. 77 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బటర్‌ఫ్లై గంధిమతి షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 152 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 157 వరకూ ఎగసింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 47 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 522 కోట్లను అధిగమించింది. పన్నుకుముందు లాభం 5 శాతం బలపడి రూ. 59 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5 శాతం జంప్‌చేసి రూ. 242ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 238 వద్ద ట్రేడవుతోంది. -
కేఎన్‌ఆర్‌కు తొలి అంతర్జాతీయ ఆర్డరు
ముంబై: కెఎన్ఆర్ కనస్ట్రక్షన్ కంపెనీ తొలిసారిగా రూ. 515.33 కోట్ల విలువైన అంతర్జాతీయ కాంట్రాక్టును దక్కించుకుంది. బంగ్లాదేశ్‌లో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి సంబంధించిన ఈ కాంట్రాక్టును స్పెక్ట్రా ఇంజనీర్స్‌తో కలిసి నిర్మించనుంది. ఈ భాగస్వామ్య కంపెనీలో కెఎన్ఆర్కు 49 శాతం వాటా ఉంది.