kolluri chiranjeevi
-
డాక్టర్ కొల్లూరి చిరంజీవి కన్నుమూత
ఖైరతాబాద్ (హైదరాబాద్): తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కొల్లూరి చిరంజీవి (74) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లూరి చిరంజీవి గత నెల 19న ఏఐజి ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతున్న సమయంలోనే మంత్రి కేటీఆర్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం నారాయణగూడలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. 1947 ఫిబ్రవరిలో వరంగల్‌లో ఆయన జన్మించారు. తల్లి టీచర్, తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే ఆయన విద్యార్థి సంఘం నేతగా చురుకుగా పనిచేశారు. మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే డాక్టర్ చంద్రావతిని ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నారు. 1969 ఉద్యమకారుల సమాఖ్య ఏర్పాటుచేసి సమస్యలపై పోరాటం చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరి కొండపల్లి సీతారామయ్యకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తర్వాత బీఎస్పీలో చేరి కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంతో మంది విద్యార్థులు, ఉద్యమకారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి కేటీఆర్ నివాళి కొల్లూరి భౌతికకాయం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండా ప్రకాశ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మందకృష్ణ మాదిగ, జై భీంటీవీ సీఈవో శ్రీధర్ తదితరులు కొల్లూరి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు సంతాపం ప్రకటించారు. -
తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్ : తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తడంతో పాటు మూత్రపిండాల పనితీరు మందగించడంతో ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌మీద చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.10 లక్షలు తక్షణమే విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డా. చిరంజీవి పుట్టినరోజునే ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని కేటీఆర్ ఆదుకోవడం ఎప్పటికీ మరిచిపోలేమని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: మంత్రి తలసానిపై దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు ‘కేటీఆర్ పీఏ’నంటూ ఫోన్.. డబ్బు డిమాండ్ రాంగ్ రూట్లో బైకర్.. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -
గౌతమీపుత్ర శాతకర్ణిలో కాపీ కొట్టారు
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: గౌతమి పుత్ర శాతకర్ణి చారిత్రక చిత్రంగా పేర్కొనడం దారుణమని హైదరాబాద్ దక్కన్ డెమోక్రటిక్ అలయెన్స్ అధ్యక్షుడు కొల్లూరి చిరంజీవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు లింగాల పాండు రంగారెడ్డి అన్నారు. ఆదివారం లక్డీకపూల్‌లోని తేజ్ ఎక్క్లేవ్ అపార్ట్మెంట్లో విలేకరులతో మాట్లాడుతూ.. చారిత్రక సినిమా పేరుతో వినోదపు పన్ను మినహాయింపు పొందడం సమంజసం కాదన్నారు. ఈ చిత్రం టైటిలే తప్పుగా ఉందని వారు పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘ఆంధ్ర ప్రశస్తి’ పద్యరూపకంలో గోతమి పుత్ర శాతకర్ణిని వర్ణించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద రాయితీలు పొందేందుకు గౌతమి పుత్రుడు కోటిలింగాల్లో జన్మించినట్లుగా చూపడం అవాస్తవమన్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలపై అతని తల్లి బాలశ్రీ వేయించిన నాసిక్ శిల శాసనంలోనూ ఆయన అమరావతి కేంద్రంగా భారత్‌ను పాలించినట్లుగా పేర్కొన లేదన్నారు. పశ్చిమ దక్షిణ భారతదేశాన్ని మాత్రమే ఆయన పాలించారని వారు వివరించారు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఆంధ్ర ప్రశస్తి పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పడంలో నిజం లేదని ఈ సినిమా కేవలం కల్పితమని, రాయితీల కోసం చారిత్రక చిత్రంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గ్రీక్, ఇంగ్లీషు చిత్రాలను కాపీ కొట్టారన్నారు.